OG Movie: తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తగా సినీమాటిక్ యూనివర్స్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ సినీమాటిక్ యూనివర్స్ అనేది హాలీవుడ్ లో బాగా పాపులర్. ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో లోకేష్ కనగరాజ్ దీనిని క్రియేట్ చేసి అందరికీ అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు.
లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమా చేస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు అందరికీ మంచి అంచనాలు కలిగాయి. అయితే విక్రం సినిమా విడుదల అవ్వడానికి ఒక రోజు ముందు తాను దర్శకత్వం వహించిన ఖైదీ సినిమా చూసి రండి అని ట్విట్ చేశాడు. కట్ చేస్తే థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులకు మైండ్ చెదిరిపోయింది. సినిమాటిక్ యూనివర్స్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే తెలుగు దర్శకులు కూడా ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సుజిత్ సినీమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాడు అని ఆలోచనలు మొదలయ్యాయి.
సాహో సినిమాతో ఓజి కు లింక్?
సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన సినిమా సాహో. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరియర్ లో విడుదలైన ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కానీ పవన్ కళ్యాణ్ తో సుజిత్ సినిమా అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులే ఈ సినిమా గురించి పొగుడుతూ పోస్టులు పెట్టారు.
ఇప్పుడు సాహో సినిమాకి ఓజి సినిమాకి లింక్ ఉందంటూ కొత్త వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమాలో “రాయ్ సన్ హ్యాజ్ అర్రైవ్డ్” అలానే ఓ జి సినిమాలో ” ఫైర్ స్ట్రోమ్ కమింగ్” అని కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. వాస్తవానికి ఈ రెండు కూడా జపనీస్ లాంగ్వేజ్ లో ఉండటం వలన కొత్త ఆలోచనలు చాలామందికి మొదలవుతున్నాయి. కేవలం దీనిని పట్టుకొని సాహో సినిమాతో లింక్ ఉంటుందేమో అని అందరూ ఊహిస్తున్నారు.
లేనిపోని అంచనాలతో ప్రమాదం
సినీమాటిక్ యూనివర్స్ అనగానే తెలుగులో గుర్తొచ్చేది లోకేష్ కనగరాజ్. ఇక కూలీ సినిమా సినిమాటిక్ యూనివర్స్ లో భాగం కాదు అని ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు లోకేష్. కానీ కొంతమంది దానిని పెద్దగా పట్టించుకోకుండా డి కోడ్ చేయడం మొదలుపెట్టారు. అలా అంచనాలను విపరీతంగా పెంచుకున్నారు. తీరా సినిమాకి వచ్చేసరికి ఆ అంచనాలు అందుకోకపోవడంతో సినిమా పై కొద్దిపాటి నిరాశ వ్యక్తం. ఇప్పుడు ఓ జి విషయంలో కూడా అలాంటి పరిణామాలు ఎదురవుతున్నాయి. ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా సినిమాను సినిమాగా చూడటం చాలా బెటర్. నిజంగా లింక్ ఉంటే అంతకు మించిన ఆనందం ఏముంది.? థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం.
Also Read: Mouli Talks: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బుర్రలైన డైరెక్టర్లు ఉన్నారు