Mirai: బాలనటుడుగా ఎన్నో సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన తేజ సజ్జ(Teja Sajja) ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. హీరోగా వరుస సినిమాలలో నటిస్తున్న ఈయన కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నటించిన హనుమాన్(Hanuman) సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తదుపరి చిత్రం మిరాయ్(Mirai) కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 12వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.
విలన్ గా మంచు మనోజ్..
కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni) దర్శకత్వంలో, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో తేజసజ్జా హీరోగా నటించిన మంచు మనోజ్ (Manchu Manoj)విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్ తో భారీ స్థాయిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. ఇక ఇటీవల సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ టీజర్ చూస్తుంటే మాత్రం మరోసారి తేజ పాన్ ఇండియా స్థాయిలో హిట్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మిరాయ్ అంటే అర్థం ఏంటి అనే సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంది.
భవిష్యత్తు కోసం ఆశ..
మరి మిరాయ్ అనే పదానికి అర్థం ఏంటనే విషయానికి వస్తే..మిరాయ్ అనేది ఒక జపనీస్ పదం. ఈ పదానికి “భవిష్యత్తు కోసం ఆశ ” అనే అర్థం వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కథానాయకుడు ఒక యోధుడిగా భవిష్యత్తు కోసం ఏం చేశారనే నేపథ్యంలో సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు మిరాయ్ అనే టైటిల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా టైటిల్ కు అర్థం తెలియడంతో అభిమానులు ఈ టైటిల్ వెనుక ఇంత అర్థం ఉందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ధర్మాన్ని కాపాడే యోధుడిగా…
ఇక ఈ సినిమాలో తేజ సజ్జకు జోడిగా రితికా నాయక్ నటించగా, మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, శ్రియ వంటి సీనియర్ నటీనటులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.చెడును అంతం చేసి ధర్మాన్ని కాపాడే ఓ సూపర్ యోధుడిగా తేజ సజ్జ కనిపించబోతున్నారు. అశోకుడు కళింగ యుద్ధ పరిణామాల తర్వాత రాసిన గ్రంథాలను తరతరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధుల గురించి ఈ సినిమా ఉండబోతుందని ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అదేవిధంగా ఈ సినిమాలో తేజ సజ్జ తల్లి పాత్రలో శ్రేయ కనిపించబోతున్నట్టు స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా ఏకంగా 8 భాషలలో సెప్టెంబర్ 12వ తేదీ విడుదలకు సిద్ధమైంది. హనుమన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో హిట్ కొట్టిన తేజ మరోసారి మిరాయ్ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ అందుకోబోతున్నారంటూ అభిమానులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Om Raut: ఆ బయోపిక్ కోసం ధనుష్ ను మించిన నటుడు లేడా…నెటిజన్స్ రియాక్షన్ ఇదే!