BigTV English

OTT Movie : హనీమూన్ లో కొత్త జంట… దెయ్యం ఎంట్రీతో గుండెల్లో గుబులు… క్లైమాక్స్ వరకు అరాచకమే గురూ

OTT Movie : హనీమూన్ లో కొత్త జంట… దెయ్యం ఎంట్రీతో గుండెల్లో గుబులు… క్లైమాక్స్ వరకు అరాచకమే గురూ

OTT Movie : రియల్ లైఫ్ లో జరిగిన స్టోరీలతో సినిమాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో కొన్ని స్టోరీలు గూస్ బంప్స్ తెప్పిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా స్టోరీ ఒక దీవిలో జరుగుతుంది. ఇక్కడ ఒక జంట దెయ్యం ఉచ్చులో చిక్కుకుంటుంది. ఆ తరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రతి సీన్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెట్టిస్తుంది. మరోవైపు అద్భుతమైన లొకేషన్‌ లు, విజువల్స్ ఈ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


కథలోకి వెళ్తే

బెత్ ఒక బయాలజీ స్టూడెంట్. తన ప్రియుడు హ్యారీతో 10 రోజుల రొమాంటిక్ విహార యాత్ర కోసం ఆస్ట్రేలియా గ్రేట్ బారియర్ రీఫ్‌లోని ఒక ఒంటరి దీవికి వెళ్తారు. బోట్ కెప్టెన్ జాక్సన్ వారిని అక్కడ వదిలి వెళ్ళిపోతాడు. నీలిరంగు సముద్రం, తాటి చెట్లతో ఆ దీవి స్వర్గంలా కనిపిస్తుంది. ఈ జంట తమ అనుభవాలను కామ్‌ కార్డర్‌లో రికార్డ్ చేస్తారు. కానీ త్వరలో అక్కడ వింత సంఘటనలు మొదలవుతాయి. వీళ్ళ వస్తువులు కదలడం, ఇసుకలో అడుగుజాడలు కనిపించడం, సాటిలైట్ ఫోన్ కనిపించకుండా పోవడం లాంటివి జరుగుతాయి. మొదట స్పిరో, ఎలియాస్ అనే స్థానిక మత్స్యకారులు ఆటపట్టిస్తున్నట్లుగా అనుకుంటారు. దీనివల్ల మత్స్యకారులతో గొడవకూడా పడతారు. ఈ సమయంలో బెత్‌పై దాడి జరుగుతుంది, హ్యారీ వాళ్ళతో గొడవపడతాడు.


అయితే ఈ సమయంలో ఏడు గీతలతో ఒక సమాధిని కనుగొంటారు. అక్కడ ఈ జంటకి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఈ దీవి చీకటి గతాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. 1920లలో కోరల్ అనే అమ్మాయిపై ఏడుగురు మగవాళ్లచే అఘాయిత్యానికి గురై మరణించింది. ఆమె ఇప్పుడు దెయ్యం రూపంలో పురుషులపై ప్రతీకారం తీర్చుకుంటూ ఈ దీవిని హాంట్ చేస్తుంది. ఇప్పుడు కోరల్ దెయ్యం శక్తివంతమవుతుంది. హ్యారీపై దాడులు తీవ్రమవుతాయి. మత్స్యకారులు దెయ్యం దాడిలో ఒకరు గాయపడి, భయంతో దీవి నుండి పారిపోతారు. ఇక హ్యారీని కోరల్ దెయ్యం కత్తితో పొడిచి, బట్టలు లేకుండా ఆమె సమాధి పైన వేలాడదీస్తుంది. బెత్, హ్యారీ రక్తం సమాధిపై కారుతుంటే చూసి, భయంతో స్పృహ కోల్పోతుంది. ఇక క్లైమాక్స్ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. ఆ దెయ్యం బెత్ ను కూడా చంపుతుందా ? దాని చేతిలో ఎంతమంది పోయారు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘అన్‌ఇన్‌హాబిటెడ్’ 2010లో విడుదలైన ఆస్ట్రేలియన్ హారర్-థ్రిల్లర్ చిత్రం. బిల్ బెన్నెట్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో జెరాల్డిన్ హేక్‌విల్ (బెత్), హెన్రీ జేమ్స్ (హ్యారీ), తాసియా జలార్ (కోరల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఫండాంగో ఎట్ హోమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే

Related News

OTT Movies: ఆఫీసులో బాస్ రహస్య జీవితం.. ఏకంగా ఇద్దరు అమ్మాయిలతో.. ఒక్క వీడియోతో మొత్తం మటాష్!

OTT Movie: తనను ప్లేబాయ్‌లా మార్చిన ఆటగాడితో కూతురు ప్రేమలో పడితే? ఈ తండ్రి కష్టం ఎవరికీ రాకూడదు!

OTT Movie : కూతురి చావుకి ప్రెగ్నెన్సీ తో రివేంజ్… ప్రాణాల మీదకి తెచ్చే దొంగతనం… నరాలు తెగే ఉత్కంఠ

OTT Movie : అయ్యయ్యో పెంచిన వింత జంతువుతోనే ఆ పాడు పని… జెండర్ మార్చుకుని అది చేసే అరాచకం చూస్తే దిమాక్ ఖరాబ్

OTT Movie : రైతే కదా అనుకుంటే రప్పా రప్పా… ఒక్కొక్కడి దుమ్ముదులిపే రైతు బిడ్డ… ఇది కదా రివేంజ్ అంటే

Big Stories

×