Intinti Ramayanam Today Episode September 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రణతి నగలు వేసుకోవడం చూస్తున్న అవని ఈ నగలని నీకు ఎవరు ఇచ్చారు అని అడుగుతుంది. పల్లవి వదిన ఈ నగలను వేసుకోమని ఇచ్చింది వదిన అని అంటుంది. ఇంటి తాళాలు చిన్నపిల్లవి నీకెందుకు.. పెద్దవాళ్ళకి ఇవ్వు నీకెందుకు ఈ పెత్తనం అని అంటుంది. పార్వతిని పిలిచి అవని తాళాలను ఇస్తుంది. ఇంటి పెద్ద కోడలు నువ్వు ఈ తాళాలు నీ దగ్గర పెట్టుకోవాలి అని అంటుంది. ఆ తర్వాత పల్లవి భరత్ ను లోపలికి పిలిచి చూసావా మీ అక్క ఎలా మాట్లాడుతున్నావ్ అని ప్రణతి దగ్గర తాళాలు ఉంటే మీ అక్క ఎలా మాట్లాడుతుందో చూసావా.. పెళ్లి చేసింది అయితే నీకు కావాల్సినవన్నీ సమకూరేలా చూసుకోవాలిసిన బాధ్యత కూడా మీ అక్కదే కదా.. ప్రగతికి ఎన్నో కోరికలు ఉంటాయి కానీ అవన్నీ కూడా చేసింది మీ అక్క.. మీ అక్క చెడ్డది అని నేను చెప్పట్లేదు కానీ ఏది మంచో ఏది చెడు ఆలోచించాలి అని భరత్ తో పల్లవి కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. వీళ్ల మాటలు విన్న ప్రణతి వదిన అలాంటిది కాదు.. కానీ చూస్తుంటే పరిస్థితులు అలానే అనిపిస్తున్నాయి అని పల్లవి మాటలు ప్రణతి కూడా నమ్ముతుంది.. పల్లవి ప్లాన్ సక్సెస్ అయ్యింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అక్షయ్ వాళ్ళ బాస్ వస్తుంది. ఆమె రావడంతో ఇంట్లోనే వాళ్ళందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. అయితే అసలు నిజం ఏంటో తెలుసుకోవాలని చాముండేశ్వరి కూడా అనుకుంటుంది. కానీ అవని మాత్రం మనం కూడా కొన్ని విషయాన్నీ మీ బాస్ కు పరిస్థితిలో తెలియకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంటున్నారు… పల్లవి, శ్రీయా ఇద్దరు కూడా ఈ ఫంక్షన్ ఎలా ఆపాలని అనుకుంటారు. అయితే ఏదో ఒకటి చేసి ఫంక్షన్ జరగకుండా చేయాలి అని పల్లవి అనుకుంటుంది..
పల్లవి అనుకున్నట్లుగానే ఆల్కహాల్ కలిపిన జ్యూస్ ని ఎవరో ఒకరికి ఇవ్వాలి అని అనుకుంటుంది. ఎవరి దగ్గరకు వెళ్లినా పల్లవి వాళ్ళకి ఇవ్వకూడదు అని అతని చెప్పి మళ్ళీ వెనక్కి తీసుకొస్తుంది. ఆఖరికి ఆ గ్లాస్ ని అక్షయ్ తాగుతాడు. పంతులుగారు పెళ్లికూతురు తీసుకురండి అని అంటాడు. అవినీని నేను తీసుకొని వస్తా అని ఆరాధ్య వెళుతుంది. ఇద్దరు కలిసి అవనిని కిందకు తీసుకొని వస్తారు. అబ్బాయిని కూడా తీసుకురండి అని పంతులుగారు చెప్తారు.
అక్షయ్ ఎవరూ రావాల్సిన అవసరం లేదు నేను ఒక్కడినే వస్తాను అని అంటాడు. అయితే అక్షయ్ తీరని చూసి అందరూ షాక్ అవుతారు. మందు తాగాడేమో అని అనుమానం పడతాడు. పల్లవి అనుకున్న ప్లాను సక్సెస్ అవుతుంది. అక్షయ్ వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్లి నన్ను ఇంత టార్చర్ చేస్తావని తాగిన మైకంలో ఏవేవో వాగేస్తాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోతాడు. ఇక పల్లవి అక్షయ్ బాస్ చాముండేశ్వరి దగ్గరికి వెళ్లి మేడం మా బావగారు తాగారండి ఏదో అలా పొరపాటయింది అని అంటుంది.
నువ్వు నోరు మూసుకొని వెనక్కి వెళ్ళు నాకు ఇదంతా తెలుసు వీళ్ళిద్దరూ అన్యోన్యంగా లేరని కూడా నాకు తెలుసు. ఈ విషయాలన్నీ నాకు అవని ముందే చెప్పింది. ఏం జరిగినా కూడా అవని మొత్తం నిజాన్ని నాకు చెప్పేసింది. భార్యాభర్తల అన్నాక గొడవలు రాకుండా ఎలా ఉంటాయి. మేము గొడవలు వచ్చినా విడిపోకూడదు అని అనుకున్నాము. కుటుంబాన్ని కలపాలని నేను అనుకుంటున్నాను అని అవని చెప్పిన విషయాన్ని చాముండేశ్వరి బయటపడుతుంది..
Also Read: రోహిణి షాకిచ్చిన శృతి.. ఊహించని ట్విస్ట్.. ప్రభావతికి క్లాస్ పీకిన సత్యం..
అక్షయ్ కి నిజానికి తాగుడు అలవాటు లేదు అవని చెప్పింది. అతనికి కొంచెం మజ్జిగ ఇవ్వండి. మళ్ళీ స్టడీ అయిపోతాడు అని చాముండేశ్వరి అంటుంది. అవని చెప్పిన విషయాలని బయటపెట్టి పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తుంది చాముండేశ్వరి. పల్లవి ప్లాను దారుణంగా ఫెయిల్ అవుతుంది. అవనిని యంతగా తొక్కలని చూసినా ఏదో ఒక రకంగా పైకెళ్తుంది అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఇలాంటి కోడలు ప్రతి ఒక్క ఇంటికి ఉంటే చాలా మంచిది అని అందరూ అవనిని మెచ్చుకుంటారు. ఇక అక్షయ్ కి మజ్జిగ తాపగానే లేచి నాకేమైంది మీరందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు అని అడుగుతాడు. అక్కడిదో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..