E-Paper
Advertisement

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!

రాహుల్‌ను పీఎం మెటీరియల్ చేసేందుకే ఇదంతా.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ రామచందర్ రావు!
Advertisement

Bharat Summit: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వి. సుభాష్ రామచందర్ రావు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది దేశ ప్రయోజనాల కోసం జరుగుతున్న సమ్మిట్ కాదని, కేవలం దేశ వ్యతిరేక శక్తుల సమాహారమని ఆయన ఆరోపించారు.

భారత్ సమ్మిట్ కాదు.. యాంటీ భారత్ సమ్మిట్

Advertisement

కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని ‘యాంటీ భారత్ సమ్మిట్’ గా రామచందర్ రావు అభివర్ణించారు. అంతర్జాతీయంగా భారత వ్యతిరేక కుట్రలు పన్నుతున్న వ్యక్తులు, సంస్థలు కలసి ప్రోగ్రెసివ్ అలయెన్స్ రూపంలో ఏర్పడ్డాయని ఆయన పేర్కొన్నారు. గతంలో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ ఈ అలయెన్స్ నాయకులతో దిగిన ఫొటోలే వీరి మధ్య ఉన్న సంబంధాలకు ప్రత్యక్ష నిదర్శనమని స్పష్టం చేశారు. ఢిల్లీలోని 10 జనపథ్‌లో సోనియా గాంధీ, ఖర్గేలు ‘ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్’ ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ కావడం వెనుక అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

జార్జ్ సోరోస్ హస్తం, రెజీమ్ చేంజ్ కుట్రలు

Advertisement

ఈ అంతర్జాతీయ సంస్థల వెనుక జార్జ్ సోరోస్ వంటి భారత వ్యతిరేక శక్తులు ఉన్నాయని రామచందర్ రావు ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోయడానికి రెజీమ్ చేంజ్ నినాదంతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. స్పెయిన్, ఫ్రాన్స్, అల్బేనియా, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లలో అలజడులు సృష్టించిన కూటమినే ఇప్పుడు కాంగ్రెస్ భారత్‌లోకి తెస్తోందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి హైదరాబాద్‌ను అడ్డాగా మార్చుకునే కుట్ర జరుగుతోందని హెచ్చరించారు.

రాహుల్ గాంధీ రీలాంచ్ కోసమేనా?

రాష్ట్రానికి పెట్టుబడుల కోసం ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పెడితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ దేశ వ్యతిరేక శక్తులతో సమ్మిట్లు పెట్టడం సరికాదని ఆయన అన్నారు. దేశంలో ఇప్పటికే ఫెయిల్ అయిన రాహుల్ గాంధీని 100 దేశాల ప్రతినిధుల ముందు ప్రధానమంత్రి మెటీరియల్ గా రీలాంచ్ చేయడానికే ఈ డ్రామాడుతున్నారని ఎద్దేవా చేశారు. 42 ఇస్లామిక్ దేశాలు, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న దేశాల ప్రతినిధులతో విదేశీ శక్తుల వెన్నుదన్నుతో జరుగుతున్న ఈ సమ్మిట్‌ను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తేల్చి చెప్పారు.

Also Read: నెల రోజుల ఇంటర్నెట్ ఉచితం.. BSNL ధమాకా ఆఫర్‌లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా?

Tags

Related News

తెలంగాణ గల్లీ కారు.. ఢిల్లీకి చేరగానే కమలం రూపురేఖలు-సీఎం రేవంత్‌రెడ్డి

లక్డికాపూల్ వన్ వే ట్రాఫిక్ ప్లాన్! రిటైర్ బ్యాంక్ ఉద్యోగి పక్కా స్కెచ్, పరిశీలన చేస్తున్న అధికారులు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాల్లో సినిమా ప్రమోషన్లకు బ్రేక్! అసలేం జరిగింది?

బక్కచిక్కిన తమ్మిడికుంట చెరువుకు పూర్వ వైభవం.. రూ.20 కోట్లతో సుందరీకరణ!

మహిళల అండాల అక్రమ దందా కేసులో.. కీలక నిందితుడు అరెస్ట్!

ఎమ్మెల్సీ ఎన్నికలపై కల్వకుంట్ల కవిత ధీమా.. కాలం కలిసోచ్చేనా..?

ఏసీబీకి రెడ్ హ్యండెడ్‌గా చిక్కిన​ మున్సిపల్​ కమిషనర్​!

Big Stories

Advertisement
×