SSMB29 : ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన రాజమౌళి నేడు ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ దర్శకుడు అయిపోయారు. బాహుబలి అనే సినిమాతో ఆయన స్థాయిని పెంచుకోవడం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు.
అల్లు అర్జున్ మినహాయిస్తే ప్రస్తుతం స్టార్ హీరోలు అని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరికి సార్డం ఇచ్చింది ఎస్.ఎస్ రాజమౌళి. ప్రభాస్ ప్రస్తుత పాన్ ఇండియా హీరో, కానీ ప్రభాస్ కి మంచి కమర్షియల్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా మాత్రం ఛత్రపతి. ఎన్టీఆర్ ఎన్ని సినిమాలు చేసినా కూడా కెరియర్ బిగినింగ్ లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సింహాద్రి యమదొంగ వంటి సినిమాలే తనను స్టార్ హీరోని చేశాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అక్కడితోనే రామ్ చరణ్ కు స్టార్ డం వచ్చేసింది.
ఏకంగా జక్కన్నకు చేంజెస్ చెప్పాడు
ఇక ప్రస్తుతం జక్కన్న మహేష్ బాబుతో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో కనిపిస్తున్నారు. మామూలుగా జక్కన్న చెప్పింది హీరోలు చేస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు ఏకంగా జక్కన్నకు స్క్రిప్ట్ లో చేంజెస్ చెప్పారు అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీనిలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది తెలియదు గానీ మహేష్ చెప్పిన కొన్ని చేంజెస్ పైన ఎస్ఎస్ రాజమౌళి టీం అంతా కలిసి కూర్చొని పనిచేస్తున్నట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంది.
మొదటిసారి స్టార్ హీరోతో
రాజమౌళి విషయానికొస్తే చాలామంది హీరోలను స్టార్ హీరోలను చేశాడు. కానీ ఆల్రెడీ స్టార్డమ్ ఉన్న హీరోతో ఇప్పటివరకు పనిచేయలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిన విషయమే. అయితే మొదటిసారి మహేష్ బాబుతో రాజమౌళి పనిచేస్తున్నారు. ఆల్రెడీ స్టార్ ఇమేజ్ ఉన్న మహేష్ కు రాజమౌళి ఎంతటి హిట్ సినిమా అందిస్తాడు అనేది అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. అన్నిటిని మించి త్రిబుల్ ఆర్ వంటి సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కూడా ఈ సినిమాలో లాంగ్ హెయిర్ మరియు గుబురు గడ్డంతో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షెడ్యూల్ గ్యాప్ లో ఉంది.
Also Read : Reshma Rathod : సినిమాను మించిన ట్విస్ట్, సినిమా నుంచి ఏకంగా సుప్రీంకోర్టు లాయర్