Case on HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే… ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యాన్ని బెదిరింపులకు గురి చేయడం.. టికెట్ల విషయంలో కుట్రలు పన్నడం… ఇలాంటి రకరకాల కేసులో… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హెచ్సీఏ వివాదంలోకి ఈడి కూడా ఎంటర్ అయింది.
తెరపైకి మనీలాండరింగ్ అంశం
HCAపై కేసు నమోదు చేసిన ED… ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ECIRలో ఐదుగురిపై కేసులు నమోదు చేసింది ED. గతంలో నమోదైన రెండు కేసులను కలిపి కొత్త ECIR లో కేసులు నమోదు అయ్యాయి. PMLA సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది ED. BCCI నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానం వ్యక్త్తం చేస్తోంది ED. ఇందులో భాగంగానే జగన్ మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్రయాదవ్, సునీల్ కాంటే, కవితలపై కేసులు నమోదు అయ్యాయి. కేసు నమోదు నేపథ్యంలో నిందితులను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. సీఐడీ కస్టడీ ముగియగానే ఈడీ విచారణ ప్రారంభించే అవకాశం ఉంది.
కవిత, కేటీఆర్ మెడకు చుట్టుకున్న HCA వివాదం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాల వెనుక గులాబీ పార్టీ నేతల హస్తము ఉందని.. కొత్తగా తెరపైకి చర్చ వచ్చింది. ఇందులో భాగంగానే గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారకరామారావు అలాగే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. వెంటనే గులాబీ పార్టీ నేతలు కేటీఆర్ అలాగే కల్వకుంట్ల కవితపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Hyderabad Cricket Association ) కేసు విచారిస్తున్న సిఐడి బృందానికి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ బృందం. ఇందులో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ అలాగే కార్యదర్శి గురువారెడ్డి కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అధ్యక్షుడు కావడానికి కారణం గులాబీ పార్టీ అని… ఈ సందర్భంగా వెల్లడించారు. గులాబీ పార్టీ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రెడ్డి రెచ్చిపోయాడని కూడా ఆరోపణలు చేశారు. అందుకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ( Hyderabad Cricket Association ) అక్రమాలు జరిగినట్లు… తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై సిఐడి బృందం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అటు ఈ అంశంపై గులాబీ పార్టీ నేతలు కల్వకుంట్ల తారకరామారావు అలాగే కల్వకుంట్ల కవిత ఇలా రియాక్ట్ అవుతారని దానిపైన కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
HCAపై కేసు నమోదు చేసిన ED
ECIRలో ఐదుగురిపై కేసులు నమోదు
గతంలో నమోదైన రెండు కేసులను కలిపి కొత్త ECIR
PMLA సెక్షన్ల కింద కేసులు నమోదు
BCCI నుంచి వచ్చిన నిధుల విషయంలో మనీలాండరింగ్ జరిగినట్లు అనుమానం
జగన్ మోహన్ రావు, శ్రీనివాసరావు, రాజేంద్రయాదవ్, సునీల్ కాంటే, కవితలపై కేసులు… pic.twitter.com/1WAqIoS3wG
— BIG TV Breaking News (@bigtvtelugu) July 17, 2025