Vassishta: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది కొత్త దర్శకులు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాళ్ల సినిమా హిట్ అయిన తర్వాత ఆదర్శకులకు పేరు రావడం అనేది సహజంగా జరుగుతుంది. కానీ దర్శకుడుగా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మెగా ఫోన్ పట్టుకోవడం వెనక ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి.
మొత్తానికి కళ్యాణ్ రామ్ హీరోగా చేసిన బింబిసార సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు వశిష్ట. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. కళ్యాణ్ రామ్ లాంటి హీరోతో కూడా ఆ టైంలో సక్సెస్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇక ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
రజనీకాంత్ కథ ఓకే చేశారు
బింబిసారా సినిమా తర్వాత దిల్ రాజు గారు నాకు రజనీకాంత్ కి కథ చెప్పించారు. రజనీకాంత్ కి నేను చెప్పిన కదా విపరీతంగా నచ్చింది. రజనీకాంత్ గారు తర్వాత బింబిసారా సినిమా చూసి నాకు ఫోన్ కూడా చేశారు. మనం ఇలా చేయాలి అమ్మ అని ఆయన కొన్ని సజెషన్స్ చెప్పారు. ఆయనకు నేను ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా చెప్పాను. అది భాషా సినిమాకు సీక్వెల్ లాగా ఉంటుంది. కానీ నాకు సెకండాఫ్ లో ఎక్కడో కరెక్ట్ గా సెట్ కాలేదు. నాకు అనిపించింది ఏంటి అంటే రజినీకాంత్ లాంటి హీరో అవకాశం ఇచ్చినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా వెళ్లాలి.
ఆ అడ్జస్ట్మెంట్ చేసి వెళ్లడం కరెక్ట్ కాదేమో అనిపించింది. రాజుగారికి నాకు మధ్య డిస్కషన్ స్టార్ట్ అయింది. సో అప్పుడది అలా ఆగింది. మేము వెళ్లే టైంకే రజనీకాంత్ గారు మాకు ఒక మాట చెప్పారు. టైలర్ సినిమా ఉందమ్మా, ఆ తరువాత వెట్టయాన్ సినిమా ఉంది, తర్వాత లాల్ సలాం కూడా ఉంది. ఈ మూడు సినిమాలో అయిపోయిన తర్వాత చేద్దామని రజనీకాంత్ గారు చెప్పారు.
విశ్వంభర పై అంచనాలు
విశ్వంభర సినిమాను అనౌన్స్ చేసినప్పుడే మంచి అంచనాలు మొదలయ్యాయి. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి సోషియా ఫాంటసీ సినిమా చేస్తున్నారు అంటేనే క్యూరియాసిటీ మొదలైపోయింది. ఒక తరుణంలో జగదేకవీరుడు అతిలోకసుందరి టైంలో ఈ సినిమా ఉండబోతుంది అని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా టీజర్ వచ్చిన తర్వాత అంచనాలు తగ్గాయి. బహుశా ఈ కామెంట్స్ అన్ని టీం దృష్టికి చేరడం వలన మరి కొంత జాగ్రత్త తీసుకొని ఇప్పుడు రిలీజ్ కావలసిన సినిమాని ఇప్పటికీ అద్భుతంగా వచ్చేలాగా చెక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
Also Read : Genelia : నేను సినిమాలకు దూరం అవ్వడానికి అదే కారణం