E-Paper
Advertisement

ధనుష్ తో స్నేహం.. చేదు జ్ఞాపకంపై విఘ్నేష్ శివన్ షాకింగ్ కామెంట్స్!

ధనుష్ తో స్నేహం.. చేదు జ్ఞాపకంపై విఘ్నేష్ శివన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Vignesh: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఆ సంబంధాలు చెడిపోతే మాత్రం ఆ బాధ వర్ణనాతీతం అనే చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల మధ్య మంచి స్నేహబంధం ఏర్పడినప్పుడు ఎదుటివారిలో తమ కుటుంబ సభ్యులను చూసుకున్న సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. అయితే కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆ బంధం చెడిపోతే ఎలా ఉంటుందో నిరూపించారు ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ లో తన తండ్రిని చూసుకున్నానని, అయితే ఇప్పుడు ఆ సంబంధం కూలిపోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ధనుష్ నుండి విడిపోవడం పై పశ్చాతాపం వ్యక్తం చేస్తూ .. ఆ రోజు కూర్చొని మాట్లాడి ఉంటే ఈరోజు ఇంత వేదన కలిగేది కాదు అంటూ తన బాధను వ్యక్తపరిచారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ధనుష్ తో విభేదాలపై స్పందించిన విఘ్నేష్..

డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ప్రస్తుతం దర్శకత్వం వహించిన చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ.. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్గా రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై నయనతార నిర్మించిన ఈ చిత్రం.. ఏప్రిల్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న విఘ్నేష్ శివన్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని స్టార్ హీరో ధనుష్ తో విభేదాలపై స్పందించారు.

ధనుష్ లో నా తండ్రిని చూసుకున్నాను..

Advertisement

విఘ్నేష్ మాట్లాడుతూ.. ధనుష్ తో స్నేహం చెడిపోవడం నా జీవితంలోనే ఒక చేదు జ్ఞాపకం. కెరియర్ ఆరంభంలో ధనుష్ ఇచ్చిన ప్రోత్సాహం నేను మరువలేనిది. రఘువరన్ బీటెక్ సినిమా సమయంలో రెండేళ్ల పాటు నేను ఆయనతోనే ఉంటూ ఎంతో నేర్చుకున్నాను. నా తండ్రి మరణించిన రోజే ధనుష్ పుట్టినరోజు కావడంతో ఆయనలో నేను నా తండ్రిని చూసుకునేవాడిని. అంతటి ఘాడమైన అనుబంధం బ్రేక్ అవ్వడాన్ని ఇప్పటికీ నేను తట్టుకోలేక పోతున్నాను
. ముఖ్యంగా జరిగిన పొరపాట్లకు సిగ్గుపడుతున్నాను.

పశ్చాతాప పడుతున్న విఘ్నేష్..

ఇద్దరి వ్యక్తుల మధ్య సమస్యలు ఉన్నప్పుడు కూర్చోని మాట్లాడుకుంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. కేవలం కమ్యూనికేషన్ గ్యాప్ వల్లి మా ఇద్దరి మధ్య దూరం పెరిగింది. అసలు ఆ గొడవ ఎందుకు జరిగిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ” అంటూ విఘ్నేష్ తెలిపారు. మొత్తానికైతే ధనుష్ లేకపోతే తాను లేనని, తాను ఈ స్థాయిలో ఉండడానికి ధనుష్ కారణమని , ధనుష్ పై కృతజ్ఞత చాటుకుంటూనే .. మరొకవైపు కోల్పోయిన స్నేహాన్ని మళ్లీ పొందాలనే మనసులోని బాధను బయటపెట్టారు విఘ్నేష్ . ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ధనుష్ – విఘ్నేష్ మధ్య అక్కడే చెడిందా?

Advertisement

ఇకపోతే వీరిద్దరి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.. నయనతార వివాహ డాక్యుమెంటరీ విడుదల సమయంలో తలెత్తిన వివాదాల వల్లే వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. ధనుష్ నిర్మించిన నానుమ్ రౌడీధాన్ చిత్రంలోని కొన్ని సెకన్ల ఫుటేజీని అనుమతి లేకుండా వాడారు అంటూ ధనుష్ పది కోట్ల రూపాయల నష్టపరిహారం కోరారు. దానికి నయనతార బహిరంగ లేఖ రాయడం సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన విగ్నేష్ కూడా ధనుష్ పై విమర్శలు చేశాడు. ఇక అప్పట్నుంచే ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

ALSO READ:యూట్యూబ్ ద్వారా లక్షలు సంపాదిస్తున్న బుల్లితెర నటి?

ధనుష్ క్షమాభిక్ష పెడతారా?

మరి విఘ్నేష్ పశ్చాతాపడుతున్న విషయాన్ని ధనుష్ తెలుసుకొని క్షమాభిక్ష పెడతారేమో చూడాలి.

Related News

హైదరాబాద్‌లో ‘వైఫ్ ఎక్స్ఛేంజ్’ కల్చర్ ఉందంటూ హీరోయిన్ మాధవీలత సంచలన వ్యాఖ్యలు!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

Big Stories

Advertisement
×