Gen Z Movement: నేపాల్ రాజధాని నగరం ఖాట్మండ్ లో జెన్ జెడ్ (Zen Z) పేరుతో యువత సారథ్యంలో భారీ ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రభుత్వంలో అవినీతి, సోషల్ మీడియా యాప్స్ పై నిషేదాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంది. మొదట అంతంతా మాత్రంగా మొదలైన ఈ ఉద్యమం నగరాలకు వ్యాపించి.. అనంతరం పార్లమెంట్ సమీపంలో యువత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. ఒక్కసారిగా యువత పార్లమెంట్ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించింది. భద్రతా బలగాలు కాల్పులు జరిపడంతో 16 మంది యువకులు మృతిచెందగా.. 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
వేలాది మంది యువకులు ‘జెన్ జెడ్ విప్లవం’ పేరుతో ఖాట్మండ్ నగర వీధుల్లో నిరసనకు దిగారు. నిషేధిత ప్రాంతాల్లోకి చొచ్చుకుపోయి బారీకేడ్లను తొలగించారు. ఘర్షణలు తీవ్రమవడంతో పోలీసులు అనేక చోట్ల కాల్పులకు దిగారు. దీంతో ప్రభుత్వం ఖాట్మండ్ లో కర్ఫ్యూ విధించింది. పార్లమెంట్ ప్రాంతం, ఇతర ముఖ్య ప్రాంతాల్లో ఈ ఆదేశాలు అమలవుతున్నాయి. ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా యాప్ లను నిషేధించండం ఈ ఉద్యమానికి దారితీసింది. ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సాప్, యూట్యూబ్ వంటి ప్రధాన యాప్ లు కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో రిజిస్టర్ కానందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇది నియంత్రణ చర్య అని చెబుతుండగా.. ఆందోళనకారులు మాత్రం ఇది విమర్శలను అణచివేసే సెన్సార్‌షిప్ అని ఆరోపిస్తున్నారు.
🚨Breaking news:- Youth brigade's fierce protest against Nepal government in Kathmandu, youth took to the streets against corruption and social media ban.
This movement of Nepali youth is absolutely justified.💪🔥#socialmediaban#Nepal #kathmandu #protest pic.twitter.com/f9E7mZrlg9
— Aman Verma (@aman9950) September 8, 2025
ప్రభుత్వం ఫోన్, ఇంటర్నెట్ బ్లాకౌట్ విధించినా, జెన్ జెడ్ యాక్టివిస్టులు టిక్‌టాక్, రెడ్డిట్ వంటి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించి యువతకు ఒక తాటిపైకి వచ్చారు. వేలాది మంది ఆందోళనకారులు స్లోగన్ లు చేస్తూ మైతిఘర్ మండల్ నుంచి పార్లమెంట్ వైపు ఆందోళనకు దిగాు. పార్లమెంట్ సమీపంలో పోలీసులు అడ్డంకులు ఏర్పాటు చేసినా.. ఆగ్రహావేశంతో ఆందోళనకారులు వాటిని ధ్వంసం చేశారు. పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కానన్లు ప్రయోగించారు. కొందరు ఆందోళనకారులు పార్లమెంట్ కాంపౌండ్‌లోకి చొచ్చుకుపోయారు.
ALSO READ: Weather News: మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, పిడుగులు పడే ఛాన్స్
నేపాల్ లో ఈ ఆందోళనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. టియర్ గ్యాస్ కానిస్టర్లు గాలిలో ఎగురుతున్న దృశ్యాలు, ఆందోళనకారుల చేతుల్లో కర్రలు, వాటర్ బాటిల్స్ విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విశ్లేషకుల మాటల్లో.. ఈ ‘జెన్ జెడ్ విప్లవం’ అవినీతి, ఆర్థిక అసమానతలపై కురిస్తున్న ఆగ్రహానికి ప్రతీక. సోషల్ మీడియా యాప్ ల నిషేధం ఈ అగ్నికి చివరి స్పార్క్ అయింది. డిజిటల్ సావీ యువత ఆన్‌లైన్ నుంచి వీధుల్లోకి వచ్చి, ధైర్యసాహసాలతో ప్రదర్శనలు చేస్తోంది.
ALSO READ: Dussehra holidays: తెలంగాణలో దసరా సెలవు.. విద్యార్థులు ఫుల్ ఎంజాయ్, టూర్ ప్లానింగ్
మరోవైపు, ప్రధాని కెపి శర్మ ఓలి సోషల్ మీడియా యాప్స్ నిషేధాన్ని సమర్థించారు. ‘దేశాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నాన్నీ సహించం’ అని అన్నారు. రూలింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి, అహంకారాలకు వ్యతిరేకంగా పార్టీ నిలబడుతుందని చెప్పారు. ‘దేశ స్వాతంత్ర్యం కొందరి ఉద్యోగాల కన్నా గొప్పది. చట్టాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, జాతీయ గౌరవాన్ని అవమానించడం ఎలా సమ్మతమవుతుంది’ అని ప్రశ్నించారు.