OG Movie: ఓజీ మూవీ టీంకి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ మూవీ ప్రీమియర్ టికెట్ రేట్లను పెంచుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై నిన్న విచారించిన కోర్టు ప్రభుత్వం ఇచ్చిన మోమోను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ గురువారం అప్పిల్ చేయగా.. డివిజన్ బెంచ్ తీర్పుని సస్పెండ్ చేసి రేపటికి వాయిదా వేసింది.
ఈ పిటిషన్ గురువారం విచారించిన డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జ్ తీర్పును సస్పెండ్ చేసింది. దీంతో హైకోర్టులో ఓజీ మూవీ టీంకి స్వల్ప ఊరట లభించింది. కాగా పుష్ప 2 ప్రీమియర్స్లో సంధ్య థియేటర్ సంఘటన తర్వాత రాష్ట్రంలో ప్రీమియర్స్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. అంతేకాదు టికెట్ల రేట్లు కూడా పెంచేది లేదని తెల్చింది. అయితే మూవీ నిర్మాతల విజ్ఞప్తి మే రకు ఓజీ ప్రీమియర్స్కి టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఈ జీవోపై మహేష్ యాదవ్ అనే వ్యక్తి.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిన్న బుధవారం ఈ పిటిషన్పై విచారించిన సింగిల్ బెంచ్ ప్రభుత్వం ఇచ్చిన మోమోను రద్దు చేసింది.
Also Read: OG Collections: OG Collections : ఓజీ డిస్ట్రక్షన్… ఓపెనింగ్ కలెక్షన్లు రూ. 160 కోట్లు
ఈ మేరకు జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగిల్ జడ్జీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని కోరుతూ మూవీ టీం డివిజన్ బెంచ్‌లో అప్పిల్ వేయగా.. ఈ తీర్పును సస్పెండ్ చేసి తీర్పుని రేపటికి వాయిదా వేయడంతో ఓజీ టీంకి కాస్తా ఊరట లభించింది.కాగా వసూళ్లలో ఓజీ మూవీ రికార్డులు నెలకొల్పుతోంది. కేవలం ప్రీమియర్ షోలతో ఈ చిత్రం రూ. 100 వరకు వసూళ్లు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లలో ప్రీమియర్స్ బడ్డాయి. కేవలం ఒక్క నైజాంలోనే 366పైగా థియేటర్లలో ఓజీ మూవీని ప్రదర్శించారు.
ఇది తెలుగు ఇండియన్ మూవీ ఇండస్ట్ర లోనే ఆల్ టైం రికార్డు. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకుని ఈ చిత్రం రూ. 160 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు రాబ్టటే అవకాశం ఉందట. ప్రీమియర్స్ తో ఓజీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో మూవీ చూసేందుకు ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో థియేటర్లలోనూ భారీ ఎత్తున షోలు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఓజీ టీం సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగితేలుతుంది. ఓజీ డిస్ట్రక్షన్ పేరుతో మూవీ టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ కల ఓజీతో నిజమవ్వడంతో.. అభిమానులు సైతం ఓజీని సెలబ్రేట్ చేస్తుకుంటున్నారు.