Yoga For Brain Health: యోగా చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు. ముఖ్యంగా యోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే ప్రతిరోజు యోగా చేయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రకాల ఆసనాలు చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. పద్మాసనం, పాద హస్తాసనం, ఈగల్ భంగిమ వంటి ఆసనాలు చేయడం వల్ల మెదడుకు రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. ఫలితంగా నాడీ వ్యవస్థ కూడా ఉత్తేజితం అవుతుంది. ఇంతకీ మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి ఎలాంటి యోగాసనాలు చేయాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు పని తీరుకు యోగా ఎలా ఉపయోగపడుతుంది ?
రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది: అనేక రకాల యోగా ఆసనాలు ముఖ్యంగా ముందుకు వంగే ఆసనాలు మెదడుకు రక్త ప్రసరణను పెంచుతాయి. అంతే కాకుండా హైబీపీ వంటి సమస్యలు కూడా రాకుండా చేస్తాయి.
ఆక్సిజన్ సరఫరా పెంచుతుంది: ప్రాణాయామం చేయడం వల్ల కూడా మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అంతే కాకుండా ఆక్సిజన్ సరఫరా కూడా మెరుగ్గా ఉంటుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది: యోగా , ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి , మనస్సును ప్రశాతంగా ఉంచుతాయి. అంతే కాకుండా ఇవి ఏకాగ్రతను పెంచడానికి కూడా ఉపయోగపడతాయి.
నాడీ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది: కొన్ని రకాల ఆసనాలు చేయడం వల్ల నాడీ వ్యవస్థ కూడా ఉత్తేజితం అవుతుంది. అంతే కాకుండా వీటి వల్ల మెదడు కూడా బాగా పనిచేస్తుంది.
Also Read: డైలీ ఒక్క స్పూన్ ఇది తింటే చాలు.. ఊడిన చోటే కొత్త జుట్టు. 100 % రిజల్ట్ !
బ్రెయిన్ షార్ప్ గా మారాలంటే ఏ యోగాసనాలు చేయాలి ?
పద్మాసనం: ఇది మనస్సును ప్రశాంతపరుస్తుంది. అంతే కాకుండా ఏకాగ్రతను కూడా పెంచడానికి ఉపయోగపడుతుంది.
పాదహస్తానం: మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచడంలో కూడా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఇది ఏకాగ్రతను కూడా పెంచుతుంది.
ధ్యానం: ఒత్తిడిని తగ్గించడంతో పాటుమనస్సును ప్రశాంతంగా ఉంచడంలో కూడా ధ్యానం చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఏకాగ్రత, స్వీయ అవగాహన పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది.
ఈగల్ ఫోజ్: మనస్సు, శరీరం రెండింటినీ చురుగ్గా ఉంచడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా ఏకాగ్రతను కూడా పెంచుతుంది.