Hyderabad News: హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి జీహెచ్ఎంసీ చకచకా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ భోజన కేంద్రాలను ఇందిరా క్యాంటీన్లుగా మార్చింది. అంతేకాదు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇవ్వాలని డిసైడ్ అయ్యింది.
హైదరాబాద్ సిటీలో ప్రజల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ భోజన కేంద్రాలకు కొత్త రూపు రానుంది. ఈ మేరకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్నపూర్ణ కేంద్రాలను ఇకపై ‘ఇందిరా క్యాంటీన్’గా మారనున్నాయి. ఇప్పుడు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకే అందజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మరింత విస్తృతం చేయనుంది.
అంతేకాదు ఆయా క్యాంటీన్లకు శాశ్వత భవనాలు నిర్మించాలని డిసైడ్ అయ్యింది. హైదరాబాద్ మహానగరానికి తమ అవసరాల నిమిత్తం వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు లక్షల్లో వస్తుంటారు. హోటల్‌కి వెళ్లాలంటే టిఫిన్‌కు మినిమమ్ 30 రూపాయల పైమాటే. ఇక భోజనం గురించి చెప్పనక్కర్లేదు. మినిమమ్ తక్కువలో తక్కువ 50 రూపాయల పైమాటే.
ఇందిరా క్యాంటీన్లు ఇకపై ఐదు రూపాయలకే అల్పాహారం అందించనుంది. బయట హోటళ్లకు ఏ మాత్రం తీసిపోని విధంగా రెడీ చేస్తున్నారు. వీరితోపాటు రోజువారీ కూలీలు, విద్యార్థుల ఆకలిని కేవలం ఐదు రూపాయలకే తీర్చనుంది. భోజన కేంద్రాలు ఇకపై కొత్త పేరు దర్శనం ఇవ్వనున్నాయి.
ALSO READ: హైదరాబాద్‌లో బైక్ ట్యాక్సీ బ్యాన్? అదే జరిగితే
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్-జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ పథకం రూపు రేఖలను సమూలంగా మారనుంది. సిటీ వాసులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కీలక తీర్మానాలకు కమిటీ ఆమోదముద్ర వేసింది.
ఇప్పటివరకు ఆయా కేంద్రాల్లో మధ్యాహ్నం వేళ 5 రూపాయలకు భోజనం అందుబాటులో ఉండేది. ఉదయం పనులకు, కాలేజీలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకుని ఇందిరా క్యాంటీన్లలో ఉదయం టిఫిన్ కూడా అందించనుంది. ఇడ్లీ, ఉప్మా వంటివి ఐదు రూపాయలకు ఇచ్చేలా సన్నాహాలు చేస్తోంది జీహెచ్ఎంసీ.
దీనిద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత విషయంలో మరింత భరోసా లభించనుంది. ప్రస్తుతం చాలావరకు ఆయా కేంద్రాలు తాత్కాలిక షెడ్లలో నడుస్తున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు శాశ్వత భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. నిర్మాణాలను పునరుద్ధరించి ఆధునీకరించాలని నిర్ణయం తీసుకుంది.
ఇంతకుముందు ఎక్కడపడితే అక్కడ భోజనం అందజేసేవారు. ఇప్పుడు అలాకాకుండా పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలు భోజనం అందేలా చూడటమే ముఖ్య ఉద్దేశంగా చెబుతున్నారు అధికారులు. ఇదేకాకుండా సిటీలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను ‘పే అండ్ యూజ్’ పద్ధతికి ఆమోదం పడింది.
దీనివల్ల మరుగుదొడ్ల నిర్వహణ మెరుగుపడడమేకాకుండా ప్రజలకు పరిశుభ్రమైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. మొత్తానికి జీహెచ్ఎంసీ తీసుకున్న నిర్ణయాలు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో ముందడుగుగా భావిస్తున్నారు.