Priyanka Jain : బుల్లితెర ప్రేక్షకులకు ప్రియాంక జైన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ మించిన ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. లేటెస్ట్ ఫోటోలతో పాటుగా కొన్ని రీల్స్ కూడా షేర్ చేస్తున్నాడంతో ఈమెను ఎక్కువమంది ఫాలో అవుతున్నారు. ఇక ఈ అమ్మడు ఈమధ్య బిగ్ బాస్ లోకి కూడా అడుగు పెట్టడంతో ఆమె క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేస్తుంటే ఒక్కో సీరియల్ కి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుంది..? బిగ్ బాస్ తర్వాత రెమ్యూనరేషన్ ను ఏమైనా పెంచిందా? ప్రస్తుతం ఒక్క రోజుకి ఎంత వసూల్ చేస్తుంది అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ప్రియాంక జైన్ ఒక్కరోజుకు ఎంతంటే..?
ఒకప్పుడు సీరియల్స్ అంటే.. ఓస్ సీరియల్స్‌నా అనేవాళ్లు.. కానీ ఇప్పుడు సినిమా మార్కెట్‌తో పాటు పోటీ పడుతుంది టీవీ ఇండస్ట్రీ. అయితే టీవీ ఆర్టిస్ట్‌లంటే ఒకింత చిన్నచూపు ఇప్పటికీ ఉంది.. కానీ రెమ్యూనరేషన్ విషయంలో సినిమా వాళ్లకి గట్టి పోటీగానే నిలబడుతున్నారు ఈ బుల్లితెర బ్యూటీలు. అయితే సినిమా రెమ్యూనరేషన్స్‌కి టీవీ రెమ్యూనరేషన్స్‌కి చాలా తేడా ఉంటుంది.. ఇటీవల కాలంలో టీవీ యాక్టర్స్ ఎక్కువగా వసూల్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విషయానికొస్తే.. ప్రియాంక జైన్ ఒక్కరోజుకు 35 వేలకు పైగా వసూల్ చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఒక డైలీ సీరియల్ కు కమిట్ అయితే మాత్రం నెలలో 20 రోజుల వరకు షూటింగ్ ఉంటుంది. కాబట్టి గట్టిగానే సంపాదిస్తున్నారు.. ఆ మాటకు వస్తే ప్రియాంక జైన్ కూడా బాగానే సంపాదిస్తుందన్నమాట..
Also Read: ‘కన్నప్ప’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?
సీరియల్స్ విషయానికొస్తే..
బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి ఒక్క సీరియల్ తో బాగా పాపులరీటిని సొంతం చేసుకున్న హీరోయిన్లలో ప్రియాంక జైన్ కూడా ఒకరు. ఈమె మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ ద్వారా తెలుగు లో మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రియాంక జైన్. తర్వాత బిగ్‌బాస్ సీజన్-7 లో కూడా పార్టిసిపేట్ చేసి సత్తా చాటింది. ప్రస్తుతం కిర్రాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ 2షో చేస్తుంది ఈ బ్యూటీ.. బిగ్ బాస్ తర్వాత ఎవరికైనా లైఫ్ టర్న్ అవుతుంది. కానీ ఈ అమ్ముడు కు మాత్రం పెద్దగా కలిసి రాలేదని తెలుస్తుంది. దీనికి ముందు వరుసగా సీరియల్స్లలో బిజీగా ఉంది.. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు షోలలో సందడి చేస్తూ వస్తుంది. కొన్ని టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఇక ఈమె ఆమె బాయ్ ఫ్రెండ్ శివకుమార్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అన్న ప్రశ్న సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. మరి ఆ గుడ్ న్యూస్ ని ఎప్పుడు చెబుతుందో చూడాలి.. సోషల్ మీడియాలో ఈమె ఎంత యాక్టివ్ గా ఉంటుందో అందరికి తెలుసు. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతుంది..