E-Paper
Advertisement

సాగునీటి హక్కులా.. పొలిటికల్ మైలేజ్‌లా.. తెలంగాణలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా బీఆర్ఎస్ ప్లాన్..?

సాగునీటి హక్కులా.. పొలిటికల్ మైలేజ్‌లా.. తెలంగాణలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా బీఆర్ఎస్ ప్లాన్..?
Advertisement

Irrigation Campaign: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ పొలిటికల్ కాక రేగబోతోంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రజాక్షేత్రంలోకి ఉధృతంగా దూసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కలిసి ఉమ్మడిగా కార్యాచరణకు సిద్ధమవుతున్నారు “బావబామ్మర్ధులు ప్రాజెక్టుల బాట” పేరిట సాగునీటి రంగమే అజెండాగా క్షేత్రస్థాయి పోరాటానికి సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో అడుగంటుతున్న భూగర్భజలాలు, నీటిని ఒడిసిపట్టకపోతుండటంతో ఏర్పడుతున్న కరువు ఛాయలు, ఎండిపోతున్న పంటలు, సాగునీటి ప్రాజెక్టుల వైఫల్యాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే, రైతాంగానికి అండగా నిలవడమే లక్ష్యంగా గులాబీ అగ్రనేతలు కదులుతున్నారు.

సంగమేశ్వర టు బసవేశ్వర.. హరీష్ ‘పాదయాత్ర’..

ప్రాజెక్టుల పరిరక్షణ, సాగునీటి లభ్యతపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సుదీర్ఘ పాదయాత్రకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నుంచి సంగమేశ్వర వరకు ఈ యాత్ర సాగనుంది. ప్రాజెక్టును ఆపిన ప్రభుత్వానికి బసవేశ్వర, సంగమేశ్వర తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఇప్పటికే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలను తెలుసుకుంటూ, గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రాజెక్టుల ప్రగతిని వివరించడం, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు పరిధిలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు సాగుతాగునీరు అందనుంది. భూగర్భజలాలు పెరగనున్నాయి. కరువు ఛాయల నుంచి ప్రజలు బయటపడనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సుదీర్ఘ నడక ద్వారా పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

కాళేశ్వరం పరిధిలో కేటీఆర్ దూకుడు..

Advertisement

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. కాళేశ్వరం రీ-డిజైనింగ్, నీటి పంపిణీ, ఆయకట్టు స్థిరీకరణపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఆయన క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టబోతున్నాన్నట్లు సమాచారం. ప్రాజెక్టుల సందర్శనతో పాటు స్థానిక రైతాంగంతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ, వాస్తవాలను ప్రజల ముందుంచడమే లక్ష్యంగా కేటీఆర్ పర్యటనలు సాగనున్నాయి. ఇప్పటికే కన్నెపల్లి పంపు హౌజ్ ను పరిశీలించారు.

Also read: గులాబీ రంగులో మెరిసే సరస్సులు.. ఈ అందం వెనుక ఇంత కథ ఉందా?

వ్యవసాయ సంక్షోభం..

Advertisement

నీటి లభ్యత, నీటిని లిప్టు చేస్తే కలిగే ప్రయోజనాలను వివరించారు. తాజాగా మిడ్ మానేరు ప్రాజెక్టును సైతం సందర్శించారు. ప్రాజెక్టులో నీటి లభ్యతను పరిశీలించారు. కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకపోవడంతోనే లోయర్ మానేరు, మిడ్ మానేరు మాత్రమే కాకుండా గోదావరి బేసిన్ కు చెందిన అన్ని ప్రాజెక్టులు ఎండిపోయే ప్రమాదం ఉందని, ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ సంక్షోభంతో పాటు తాగునీటి సంక్షోభం కూడా తలెత్తే ప్రమాదం ఉందని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు తో లబ్దికూరే అన్ని ప్రాజెక్టు, ఏరియా అంతా పాదయాత్ర చేపట్టి ప్రజలను చైతన్యం చేయాలని కేటీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రజల్లో చైతన్యమే లక్ష్యం

రైతులకు సాగునీరు అందించడమే ప్రధాన ధ్యేయంగా.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్‌రావు సరికొత్త కార్యాచరణతో జనం మధ్యకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నవారు. ప్రాజెక్టుల బాట పడుతూ అధికార పక్షంపై ఒత్తిడి పెంచేందుకు బావబామ్మర్ధులు ఇద్దరూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు, డిక్లరేషన్ అమలులో జరుగుతున్న జాప్యంను నిలదీయాలని భావిస్తున్నారు. ప్రధానంగా సాగునీటితో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సాగునీటి హక్కుల సాధన కోసం ప్రజలను చైతన్యపరచడమే మా ప్రధాన అజెండా అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానం, గోదావరి, కృష్ణాలో రావాల్సిన వాటాపై ప్రభుత్వ తీరును సైతం ఎండగట్టాలని భావిస్తున్నారు. అందుకు రూట్ మ్యాప్ ను పార్టీ అధిష్టానం సిద్ధం చేస్తుంది.

సమర శంఖారావం.. కేడర్‌లో జోష్!

ఈ ప్రాజెక్టుల బాట కేవలం సాగునీటి పోరాటానికే పరిమితం కాకుండా.. రాబోయే స్థానిక సంస్థల (ఎంపీటీసీ, జడ్పీటీసీ) ఎన్నికలతో పాటు భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేలా వ్యూహాత్మకంగా పార్టీ పావులు కదుపుతుంది. గత కొన్ని నెలలుగా అడపాదడపా కార్యక్రమాలను నిర్వహించిన నేతలు, మరింత దూకుడు పెంచబోతున్నారు. గులాబీ శ్రేణుల్లో ఈ యాత్రలు సరికొత్త జోష్ నింపుతాయని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. త్వరలోనే ఈ రెండు ప్రాజెక్టుల యాత్రలకు సంబంధించిన పూర్తి స్థాయి రూట్‌మ్యాప్, తేదీల షెడ్యూల్‌ను పార్టీ అధికారికంగా ప్రకటించనుంది. బావబామ్మర్ధులు ఇద్దరూ ఒకేసారి రెండు వైపుల నుంచి ప్రజాక్షేత్రంలోకి వస్తుండటంతో తెలంగాణ రాజకీయం వేడెక్కబోతుంది. ప్రాజెక్టుల పోరుబాట రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Also read: Gold Paste: బంగారం పేస్ట్‌ ఇదిగో.. ఎప్పుడైనా చూశారా, అడ్డంగా బుక్కైన జంట

Related News

Beerla Ilaiah: బీఆర్ఎస్ పార్టీపై బాంబ్ పేల్చిన బీర్ల ఐలయ్య.. కేటీఆర్‌ను పని ఖతం..!

Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?

Minor Driving: పిల్లలపై ప్రేమతో ఇలా చేస్తున్నారా.. అయితే డేంజర్‌లో పడినట్టే..?

Drug Scam: మరీ ఇంత దారుణమా.. గాంధీ హాస్పిటల్‌లో మైండ్ బ్లాంక్ అయ్యే స్కామ్..?

Ganja Smuggling: మేడ్చల్‌లో భారీ గంజాయి కలకలం.. ఫ్రెండ్స్‌తో ఎలా దోరికాడంటే..?

డబ్బులిస్తేనే పని అవుతుందన్నాడు.. కట్ చేస్తే రూ. 2 లక్షలతో పాటు బుక్కయ్యాడు!

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన

Big Stories

Advertisement
×