E-Paper
Advertisement

లీకైన గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఈ కలర్, డిజైన్ చూస్తే టెక్ ప్రియులకు పిచ్చెక్కిపోవాల్సిందే!

లీకైన గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్.. ఈ కలర్, డిజైన్ చూస్తే టెక్ ప్రియులకు పిచ్చెక్కిపోవాల్సిందే!
Advertisement

Google Pixel 11 Pro Fold: గూగుల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్ మరికొద్ది రోజుల్లోనే జరగబోతోంది. ఈ తరుణంలో గూగుల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ ‘పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్’ గురించిన ఆసక్తికరమైన వివరాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. తాజాగా ఈ ఫోన్ సరికొత్త ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ కనిపించింది.

ఆకట్టుకునే కలర్ కాంబినేషన్:

టెలిగ్రామ్ ఛానెల్ ‘మిస్టిక్ లీక్స్’ ద్వారా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ చూడటానికి ఎంతో క్లాసీగా ఉంది. దీనికి లైట్ గోల్డ్ కలర్ ఫ్రేమ్‌తో పాటు అదే రంగులో మెరిసే గూగుల్ లోగోను జోడించారు. గతంలో వచ్చిన నలుపు రంగు వేరియంట్ కంటే ఈ కలర్ వేరియంట్ మరింత ప్రీమియం లుక్‌ను ఇస్తోంది. ఈ ఫోన్ అంచులకు గతంలో లాగే సాటిన్ ఫినిషింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కెమెరా డిజైన్‌లో కీలక మార్పులు:

Advertisement

వెనుక వైపు ఉండే కెమెరా మాడ్యూల్‌లో గూగుల్ కొన్ని మార్పులు చేసినట్లు ఈ లీక్ ద్వారా స్పష్టమవుతోంది. గత మోడల్‌తో పోలిస్తే.. ఈసారి కెమెరా భాగం కొంచెం సన్నగా మారి, లెన్స్‌లు అంచులకు మరింత దగ్గరగా ఉన్నాయి. మెయిన్, అల్ట్రావైడ్ కెమెరాలు కింది భాగంలో ఉండగా, టెలిఫోటో కెమెరా కుడి వైపు పైభాగంలో ఉంది. అలాగే, ఫ్లాష్ లైట్ పరిమాణాన్ని కూడా పెంచారు.

Also Read: చెవులకు నొప్పి ఉండదు.. 37 గంటల బ్యాటరీతో అదరగొడుతున్న సోనీ కొత్త ఇయర్‌బడ్స్!

ఆసక్తి రేకెత్తిస్తున్న పిక్సెల్ గ్లో ఫీచర్:

Advertisement

ఈ ఫోన్‌లో ఫ్లాష్ పరిమాణం పెద్దదిగా ఉండటంతో.. గతంలో ప్రచారంలోకి వచ్చిన ‘పిక్సెల్ గ్లో’ ఫీచర్‌పై సరికొత్త చర్చ మొదలైంది. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు లేదా జెమిని ఏఐని ఉపయోగించేటప్పుడు ఈ లైట్ వెలుగుతుందని భావిస్తున్నారు. అయితే దీని కోసం ప్రత్యేకంగా ఎలాంటి లైట్ స్ట్రిప్స్ కనిపించకపోవడంతో, పెద్ద ఫ్లాష్ లైట్ ద్వారానే ఈ ఫీచర్ పనిచేసే అవకాశం ఉంది.

లాంచ్ వివరాలు:

ఈ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ శక్తివంతమైన టెన్సర్ జీ6 చిప్‌సెట్, 4,800mah బ్యాటరీతో రానున్నట్లు సమాచారం. డిస్‌ప్లే పరిమాణంలో పెద్దగా మార్పులు లేకపోయినా.. ఫోన్ బాడీ మాత్రం మునుపటి కంటే చాలా సన్నగా ఉండబోతోంది. ఆగస్టు 12న జరిగే గూగుల్ ఈవెంట్‌లో పిక్సెల్ 11 సిరీస్ ఫోన్లతో పాటు ఈ ఫోల్డబుల్ ఫోన్ అధికారికంగా విడుదల కానుంది.

Also Read: Redmi Turbo 6 Series లీక్.. ఏకంగా 10,000mAh బ్యాటరీ, పవర్‌ఫుల్ చిప్‌సెట్‌తో రాబోతున్న కొత్త ఫోన్లు!

Related News

డార్క్ మోడ్‌లో ఫోన్ వాడితే ఛార్జింగ్ సేవ్ అవుతుందా? తెలిస్తే షాక్ అవుతారు

ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నా వాట్సాప్ మెసేజ్ వెళ్తుంది! వాట్సాప్ నుంచి మరో కిర్రాక్ అప్‌డేట్!

రూ.వెయ్యిలోపు బెస్ట్ ఇయర్‌బడ్స్! సేల్‌లో సగం ధరకే..

BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. రూ. 202 కే 32 రోజుల వ్యాలిడిటీ.. అదిరిపోయే బెనిఫిట్స్ మామ!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఎగిరి గంతేసే న్యూస్! ఇక నుంచి కోడింగ్,ఫైనాన్స్ పనులు చిటికెలో!

ఏఐ బాట్స్ డేంజర్ జోన్..శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

జియో ఫైబర్ బంపర్ ఆఫర్..ఏడాది రీఛార్జ్‌పై 4 నెలలు ఫ్రీ ఇంటర్నెట్!

ఇదేందయ్యా ఇదీ..సేల్‌లో చిమ్నీల రేట్లు ఇంత తక్కువగా ఉన్నాయ్!

Big Stories

Advertisement
×