Tollywood Hero: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే కొంతమంది హీరోలు సినిమాల విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. కొంతమంది హీరోలు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా సినిమాకు కావలసిన బడ్జెట్ను కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు. అంతేకాదు ఇటీవల కాలంలో కొంతమంది హీరోలు నిర్మాతలుగా కూడా మారుతున్నారు. అయితే ఏదో ఒక సందర్భంలో హీరోలు అప్పులు చేస్తూ వస్తుంటారు. కొంతమంది సినిమాలు కోసం అప్పులు చేస్తే మరి కొంతమంది బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టడానికి అప్పులు చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకొని హీరో ఉన్నారు అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు అన్నది ఒకసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఏదో ఒక విషయంలో అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా పలు వ్యాపారాల కోసం పెట్టుబడులు పెట్టేందుకు లోన్లు తీసుకోవడం చేస్తూ ఉంటారన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అప్పు తీసుకోకుండా ఉన్న హీరో ఒకరు ఉన్నారంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది.. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరో తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఇంటర్వ్యూలో భాగంగా ‘అసలు ఎప్పుడైనా మీరు అప్పు చేసారా? అని యాంకర్ ప్రశ్నించగా దేవుడి దయ వల్ల నేనెప్పుడూ అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు అని వెంకటేష్ ఈ నిజాన్ని బయటపెట్టారు.. ప్రస్తుతం వెంకటేష్ అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకు ఏ హీరో చెప్పని విధంగా వెంకటేష్ నిజాలను బయట పెట్టడంతో వెంకీ పై ఆయన అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
వెంకటేష్ నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. ప్రతి ఏడది హీరో వెంకటేష్ సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్న ఈ హీరో ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 సినిమాలో నటిస్తున్నారు. అలాగే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో జనవరి 12 విడుదల సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలు రెండు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ జనాలను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాలపై అంచనాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి.. మరి ఈ సినిమాలో ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటాయో చూడాలి..