Gundeninda GudiGantalu Today episode September 30th : బయట వాళ్లందరూ కూడా పారిపోతారు అయితే శృతి ఏది కనిపించలేదు దొరికిపోయిందా తనకేమైనా అయితుందేమో అని రవి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన శృతిని చూసి రవి అమ్మయ్య నువ్వు వచ్చేసావా పద వెళ్ళిపోదామని అంటాడు.. నాకేం కాలేదు లే బుడ్డోడా నేను బాగానే ఉన్నాను వచ్చేసాను అని శృతి ఎంత చెప్తున్నా సరే రవి మాత్రం చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు ఇక మొత్తానికి ఐడి కార్డులను గోదావరిలో కలిపేయాలి అని శృతి అంటుంది. మొత్తానికి మీనా కోసం బాలు చేసిన ప్లాను సక్సెస్ అవుతుంది. మీనా వీళ్ళ కోసం టెన్షన్ పడుతుంది అని బాలు ఫోన్ చేస్తే డబ్బులు దొరికాయి అని చెప్తుంది అమ్మయ్య డబ్బులు దొరికాయి అని మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
చింతామణి ఇంటికి వెళ్లి కొట్టుకొచ్చిన విధానం గురించి బాలు చెప్పగానే ప్రభావతి దొంగతనం చేసావా అంటూ అడుగుతుంది. నేనేమీ తప్పు చేయలేదు కదా.. మన దగ్గర కొట్టేసిన డబ్బులని మళ్లీ నేను కొట్టేసాను అంతే అని బాలు అంటాడు. అయితే సత్యం కూడా నువ్వు చేసింది. తప్పే రా కానీ మనం బాధపడకుండా చేసే కాబట్టి ఇది కరెక్టే ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ చేయొద్దు అని అంటాడు. సరే నాన్న నువ్వు ఎలా చెప్తే అలానే అని బాలు అంటాడు. కానీ ప్రభావతి మీనా మళ్ళీ సంతోషంగా ఉంది అని నిప్పులు పోసుకుంటూ ఉంటుంది. నువ్వు నిప్పులు పోసుకుంటున్నావు అంటే నీ ప్రమేయం ఉందా ఏంటి అని సత్యం అడుగుతాడు. తనకు నాకు ఏ సంబంధం లేదండి నేను కేవలం డాన్స్ మాత్రమే నేర్పిస్తున్నాను అని ప్రభావతి అంటుంది. బాలు మాత్రం తనకు అనుమానం ఉంది అని అంటాడు. ఏది ఏమైనా కూడా ప్రభావతి చింతామణికి చెప్పిందన్న అనుమానం బాలుకి కలుగుతుంది.
చింతామణి కడుపులో ఏదో తేడా ఉందని చెప్పి వాష్ రూమ్ కి వెళ్లి వచ్చిన తర్వాత తన మనుషుల దగ్గరికి వెళ్లి మీరు ఎందుకు వాళ్ళని ఇంట్లోకి రానిచ్చారు అని అడుగుతుంది. వాళ్ళు ఆఫీసర్లు అని అబద్ధం చెప్పారు. మేము వాళ్ళ ఐడి కార్డులు చూసి నిజమే అనుకొని లోపలికి రానిచ్చాము అని అక్కడున్న పని వాళ్ళందరూ చెప్తారు. అయితే చింతామణి తన డబ్బులు ఏమైనా కొట్టేసారేమో అని పైకి వెళ్లి చూసుకోగానే అక్కడ తలుపు మొత్తం తెరిచి ఉండడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే మీ నా దగ్గర కొట్టేసి రా డబ్బుల్ని తప్ప ఒక్క రూపాయి కూడా వాళ్ళు తగలకపోవడంతో చింతామణి అసిస్టెంట్ వాళ్ళు ఎంత దొంగతనంలో కూడా నిజాయితీగా చేశారో అంటూ పొగిడేస్తూ ఉంటాడు చింతామణితో దెబ్బలు తింటూ ఉంటాడు.
మీనా చింతామణికి ఫోన్ చేసి నా దగ్గర డబ్బులు కొట్టేసి నన్ను ఆర్డర్ ని తీసుకుని ఇవ్వకుండా చేస్తావా? ఇప్పుడు అదే డబ్బులు నేను తీసుకుని వచ్చాను ఇప్పుడు నీకు అర్థమైంది అనుకుంటాను. నా జోలికి వస్తే అది నీ దగ్గరికి రాదు అని మీనా చింతామణి వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తుంది. అయితే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చింతామణి అంటుంది. నేను కూడా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అనగానే చింతామణి షాక్ అవుతుంది. అసలేం జరిగింది అన్నది నువ్వు పోలీసులకు ఎలాగైతే చెప్పలేవు నేను కూడా అలాగే చెప్పలేను అని మేన అనగానే చింతామణి షాక్ అవుతుంది. ఇక డెకరేషన్ నుంచి మేనేజర్ ఫోన్ చేసి మీ చెక్కు బౌన్స్ అయింది అని చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతుంది. తన అసిస్టెంట్ వల్ల ఇదంతా జరిగిందని బాధ పడిపోతూ ఉంటుంది. మొత్తానికి మీనా చాలా సంతోషంగా ఉంటుంది.
మేనేజర్ ఫోన్ చేసి అదే ఆర్డర్ మే నాకు వచ్చింది అని చెప్పగానే.. మీనా చాలా సంతోషంగా ఉంటుంది ఇక ప్రభావతి మాత్రం నిప్పులు పోసుకుంటూ ఉండగా.. సత్యం అంతగా నిప్పులు పోసుకోవద్దు మన ఇంటికే కదా మంచి జరుగుతుంది అని అంటాడు. కానీ మనోజ్ రోహిణి ఇద్దరు కూడా దిమ్మ తిరిగిపోయేలా బాలు కౌంటర్లు వేస్తాడు. ఇక మీద చాలా సంతోషంగా వచ్చి సుమతికి ఆ డబ్బులు దొరికాయి ఆర్డర్ కూడా నాకే వచ్చింది అని చెప్పగానే సుమతి ఆ సంతోషాన్ని అప్పుడే అక్కడికి వచ్చిన అరుణ్ తో పంచుకుంటుంది. నిజంగానే గుడ్ న్యూస్ చెప్పావు మీ అక్క చాలా సంతోషంగా ఉంటుంది కదా.. అని సుమతిని అడుగుతాడు అరుణ్ మొత్తానికి ఎటు చూసినా కూడా ఒక్క ప్రభావతికి తప్ప మిగిలిన వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక మీనా తన సంతోషాన్ని రవి శృతిలతో పంచుకోవాలని స్వీట్ చేసి రెస్టారెంట్ కి తీసుకొని వెళుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : చక్రీ మాటతో గోపిక షాక్.. బాధపడ్డ మాధవ్.. లక్కీ, విక్కీ లవ్ ట్రాక్..