Varanasi: ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లోబల్ ప్రాజెక్టు వారణాసి. ఈ సినిమా అనౌన్స్ అయిన రోజు నుంచి ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నా.. రిలీజ్ కి ముందే అటు బిజినెస్ వర్గాలలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కుల కోసం టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు గట్టిగానే పోటీ పడుతున్నాయి.
ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకోవడానికి టాలీవుడ్ లో ఉండే బడా నిర్మాతలు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు), మైత్రి మూవీ మేకర్స్, సితార ఎంటర్టైన్మెంట్ గట్టిగానే పోటీ పడుతున్నాయి..రూ. 275 కోట్ల మేర ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో తెలుగు రాష్ట్రాలలో అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ నిలిచింది.. ఆ సినిమా ఏకంగా రూ.225 కోట్ల ధర పలికింది. మళ్లీ ఆ రికార్డును ఇప్పుడు రాజమౌళి మూవీనే బ్రేక్ చేయబోతోందని తెలిసి అంచనాలు మరింత పెరిగిపోయాయి.
అయితే ఇప్పటికీ ఇంకా ఈ డీల్ క్లోజ్ కాలేదు. మూడు ప్రముఖ సంస్థలు ఏకంగా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ఒకరికి మించి మరొకరు ఆఫర్ చేయడంతో దసరా తర్వాత ఒక నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నారు మేకర్స్. ఒకపక్క రాజమౌళి సినిమాల బిజినెస్ ను రెగ్యులర్ గా చూసే ఒక సంస్థ.. ఇటు మూవీ డిస్ట్రిబ్యూటర్స్ కి.. సినిమా బిజినెస్ మేమే చూస్తాము. ఈ సినిమా మీకే అని పలువురు పంపిణీదారులకు మాట ఇస్తున్నారట.మరి ఫైనల్ డీల్ క్లోజ్ అయ్యేసరికి ఈ ఆఫర్ రేంజ్ మరిన్ని కోట్లు దాటే అవకాశం కూడా లేకపోలేదు. అంటూ ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏది ఏమైనా వారణాసి బిజినెస్ డీల్ కోసం బడా నిర్మాణ సంస్థలు ఈ రేంజ్ లో ఆఫర్ చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
also read:బిగ్ బాస్ 10.. ఈ వారం నామినేషన్ లోకి 9మంది.. మరి డేంజర్ జోన్ లో?
వారణాసి సినిమా విషయానికి వస్తే.. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) నటించిన ఈ చిత్రంలో గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ మలయాళ సినీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే కీలకపాత్ర పోషిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ క్రియేషన్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.
ఇప్పటికే మహేష్ బాబు తన షూటింగ్ పార్ట్ ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఏదేమైనా రాజమౌళి ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో నిర్మించి, ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా ఆస్కార్ దిశగా అడుగులు వేస్తున్నారనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో డైరెక్టర్ విభాగంలో అవార్డు మిస్ అయిన రాజమౌళి ఈ సినిమాతో ఎలాగైనా ఆస్కారం అందుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.