BigTV English

Kannappa Movie: నెమలి పాత్రను వదులుకొని తప్పు చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు ఎవరో తెలుసా ?

Kannappa Movie: నెమలి పాత్రను వదులుకొని తప్పు చేసిన స్టార్ హీరోయిన్ చెల్లెలు ఎవరో తెలుసా ?

Kannappa Movie: మంచి విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం కన్నప్ప. మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. మొదటినుంచి ఈ చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే కన్నప్ప మంచి విజయాన్ని అందుకుంది. ఇక సినిమాకు హైలైట్ గా ప్రభాస్ నిలిచాడు. ఇది విష్ణు కన్నప్ప అని కాదు.. ప్రభాస్ కన్నప్ప అని చెప్పుకొస్తున్నారు.  ప్రభాస్ కోసమే ప్రేక్షకులు కన్నప్ప సినిమాకు క్యూ కడుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.


 

ఇక మొదటి రోజు కన్నప్ప దాదాపు 13 కోట్లు రాబట్టిందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వెంటనే మేకర్స్ ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అంతేకాకుండా నేడు సక్సెస్ మీట్ ను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇదంతా పక్కన పెడితే నిన్నటి నుంచి కన్నప్ప సినిమాను వదులుకున్న హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో చర్చ జరగడం ఆసక్తిగా మారింది. కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో నటించిన ప్రీతి ముకుందన్ కు మంచి పేరు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె అందానికి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ఆ పాత్రకు ఆమె ఎంతో చక్కగా సరిపోయిందని చెప్పుకొస్తున్నారు.


 

తిన్నడు  శివున్ని  ఎంత తిట్టినా కూడా నెమలి మాత్రం శివుడిని ఎప్పుడు పూజిస్తూనే ఉంటుంది. ఆమె భక్తికి శివుడు ముగ్దుడు అవుతాడు. ఇక ఫస్ట్  హాఫ్ లో నెమలి- తిన్నడు మధ్య రొమాంటిక్ సీన్స్, ప్రీతి అందాలు  ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెకండాఫ్ లో ఆమె భక్తి.. రుద్రుడితో ఆమె సంభాషణలు అద్భుతమని చెప్పొచ్చు.  అలాంటి మంచి పాత్రను ఒక స్టార్ హీరోయిన్ చెల్లెలు మిస్ చేసుకుంది అన్న విషయం చాలామందికి తెలియదు.

 

కన్నప్ప సినిమాను మొదట అనౌన్స్ చేసినప్పుడు నెమలి పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ ను తీసుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చెలెల్లిగా నుపూర్ ఇండస్ట్రీకి పరిచయమైంది. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత కన్నప్ప ఛాన్స్ వచ్చింది.  కన్నప్ప పూజా కార్యక్రమాలకు కూడా నుపూర్ హాజరైంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే నుపూర్ కన్నప్ప నుంచి తప్పుకుంటున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

 

ఇతర సినిమాల డేట్స్ తో క్లాష్ రావడం వల్లనే నుపూర్ ఈ సినిమా నుంచి తప్పుకుందని విష్ణు క్లారిటీ ఇచ్చాడు. డేట్స్ సర్దుబాటు చేయలేకపోవడం వల్లే నుపూర్ వెళ్లిపోయిందా..? లేకపోతే ఈ సినిమాపై ఆమె అంతగా ఆసక్తి చూపించలేదా..? అనేది ఇప్పటివరకు తెలియలేదు.  ఆదిలోనే హంసపాదు అన్నట్లు షూటింగ్ మొదలుకాకుండానే హీరోయిన్ తప్పుకోవడంతో కన్నప్పపై బాగా ట్రోల్ కూడా నడిచింది.  కానీ, చివరకు నెమలి పాత్ర తనకే రాసిపెట్టి ఉన్నట్లు నుపూర్  స్థానంలో ప్రీతి ముకుందన్ చేరింది. కన్నప్ప సినిమాతో ప్రీతి స్టార్ హీరోయిన్ గా మారింది అని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు క్యూ కడతాయి అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏది ఏమైనా కూడా నుపూర్, కన్నప్పను వదులుకొని తప్పు చేసింది అనే మాటలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఏ పాత్ర ఎవరు చేయాలి అనేది ముందుగానే రాసిపెట్టి ఉంటుందని ఈ పాత్ర ద్వారా మరోసారి రుజువైందని కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Nagarjuna: ఢిల్లీ హైకోర్టులో నాగార్జునకి ఊరట.. వారిపై వేటు తప్పదా?

Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో ట్విస్ట్.. మరో వ్యక్తి అరెస్ట్!

IBomma Counter: బరాబర్ పైరసీ చేస్తాం… పోలీసులకు ఐ బొమ్మ స్ట్రాంగ్ కౌంటర్!

Deepika Padukone: ఇట్స్ రివేంజ్ టైమ్.. సందీప్ కి దీపిక స్ట్రాంగ్ కౌంటర్!

Kantara 2 Premiers: ఏపీలో కాంతార ప్రీమియర్ షోలు రద్దు.. నిరాశలో ఫ్యాన్స్.. కారణం?

Film industry: షాకింగ్.. స్టార్ జంటకు విడాకులు మంజూరు!

Dimple Hayathi:హీరోయిన్ డింపుల్ హయాతిపై క్రిమినల్ కేస్… అసలేం జరిగిందంటే?

Drugs Case: డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్.. ఏకంగా 35 కోట్ల విలువ.. ఎవరంటే?

Big Stories

×