Dark Circles: ఈ రోజుల్లో డార్క్ సర్కిల్స్ సమస్య సర్వసాధారణంగా మారిపోయింది. చాలా మందికి డార్క్ సర్కిల్స్ ఉంటున్నాయి. ఇవి ముఖం యొక్క అందాన్ని పాడు చేస్తాయి. కళ్ళ కింద ఉన్న డార్క్ స్పాట్స్ ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తాయి. స్త్రీ అయినా, పురుషుడైనా, ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఏదేమైనా ఈ సమస్య నుంచి బయటపడటానికి కొన్ని రకాల హోం రెమెడీస్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడానికి కారణం ఏమిటి ?
కళ్ళ కింద నల్లటి వలయాలు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. నిద్ర లేకపోవడం, ఒత్తిడి, అలసట వంటి కారణాలు చాలా సాధారణం. ఇవి చర్మం కింద రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే.. వయస్సు పెరిగే కొద్దీ చర్మంపై పొర సన్నగా మారుతుంది. అంతే కాకుండా రక్త నాళాలు కూడా మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఇందుల జన్యుశాస్త్రం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీ కుటుంబంలో ఎవరికైనా డార్క్ సర్కిల్స్ సమస్య ఉంటే.. మీరు కూడా దానిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. చర్మంపై అలెర్జీలు, అధిక సూర్యరశ్మి , చెడు జీవనశైలి అంటే సరైన ఆహారం, మద్యం లేదా ధూమపానం వంటివి కూడా నల్లటి వలయాలకు కారణమవుతాయి. ఈ కారణాలను అర్థం చేసుకోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి.
హోం రెమెడీస్:
సాధారణ హోం రెమెడీస్‌తో కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇవి ఎలాంటి సైడ్ ఎఫక్ట్స్ లేకుండా సమస్యను దూరం చేస్తాయి.
ఎక్కువ నిద్ర:
ప్రతి రోజు రాత్రి తగినంత, నిద్ర పొందుతున్నారా లేదా నిర్ధారించుకోవాలి. ఇది డార్క్ సర్కిల్స్‌ను తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. అంతే కాకుండా నిరోధించవచ్చు.
దోసకాయ:
2013 లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. దోసకాయ ముక్కలను కళ్ళ క్రింద రుద్దడం వల్ల అలసిపోయిన కళ్ళకు ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా దోసకాయలలో ఉండే అధిక నీరు, విటమిన్ సి కంటెంట్ చర్మాన్ని పోషించి తేమగా చేస్తుంది. దోసకాయలలో సిలికా కూడా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలాలకు చాలా అవసరం.
టీ ఆకులు:
టీ ఆకులు కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ సమస్యలను దూరం చేస్తాయి. అంతే కాకుండా వాపును తగ్గించడంలో సహాయపడతాయి. కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. అంతే కాకుండా కళ్ళ చుట్టూ రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది. ఇందుకోసం మీరుటీ ఆకులను మరిగించి చల్లబరిచిన తర్వాత.. వాటిని కళ్ళపై ఉంచండి. ముందుగా ఉడికించిన టీ ఆకులను రిఫ్రిజిరేటర్‌లో ఉంచి తర్వాత వాడటం వల్ల కళ్ళు చల్లబడతాయి.
Also Read: బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం
ఫేషియల్స్:
కళ్ళ చుట్టూ రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. కళ్ళ చుట్టూ సున్నితమైన మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. మీరు కళ్ళకు కోల్డ్ కంప్రెస్ వేయడం కూడా ప్రయత్నించవచ్చు. ఇది కళ్ల క్రింద నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడుతుంది.
స్కిన్ కేర్ ప్రొడక్ట్స్:
ఫేస్ క్రీములు కళ్ళ కింద నల్లటి వలయాలను తగ్గిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఫేస్ క్రీములు నల్లటి వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. విటమిన్ ఇ, సి యాంటీఆక్సిడెంట్లు. ఇవి నల్లటి డార్క్ సర్కిల్స్ తగ్గడానికి చాలా బాగా సహాయపడతాయి.