BigTV English

Harihara Veeramallu: వీరంగం సృష్టిస్తున్న యాంటీ ఫ్యాన్స్.. ఒక్క సమాధానంతో అదిరిపోయే కౌంటర్!

Harihara Veeramallu: వీరంగం సృష్టిస్తున్న యాంటీ ఫ్యాన్స్.. ఒక్క సమాధానంతో అదిరిపోయే కౌంటర్!

Harihara Veeramallu:సాధారణంగా ఒక హీరో సినిమా విడుదలవుతోంది అంటే చాలు.. అభిమానులు ఎంతమంది అయితే ఉంటారో.. యాంటీ ఫ్యాన్స్ కూడా అంతేమంది ఉంటారు. ముఖ్యంగా సినిమా బాగున్నా సరే.. సినిమా బాగోలేదని నెగిటివ్ రివ్యూలు ఇస్తూ సినిమా కలెక్షన్స్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాపై కూడా యాంటీ ఫ్యాన్స్ ఒక యుద్ధం చేస్తున్నారని చెప్పాలి. ముందు నుంచే బాయ్ కాట్ అంటూ ట్రెండ్ చేసిన యాంటీ ఫ్యాన్స్ ఇప్పుడు సినిమా ఏం బాగోలేదని, అసలు పవన్ కళ్యాణ్ నటన ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోదు అని, మిక్స్డ్ టాక్ అని ఇలా ఎవరికి వారు నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.


రెచ్చిపోతున్న యాంటీ ఫ్యాన్స్..

ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ల్యాగ్ ఉందని.. చూసే ఆడియన్స్ కి బోర్ కొడుతుందని.. పవన్ కళ్యాణ్ ఇందులో గుర్రంపై స్వారీ చేస్తున్న సన్నివేశాన్ని హైలైట్ గా చేస్తూ ఇక్కడేదో బండి నడిపినట్లు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది వన్ మ్యాన్ షో కాదు కదా అసలు ఈ సినిమా చూడడమే దండగా.. వీరమల్లు పాత్రకు పవన్ న్యాయం చేయలేదు అంటూ ఇలా ఎవరికి వారు సినిమాపై నెగెటివిటీ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేకించి వైసిపి అభిమానులతో పాటు అల్లు అర్జున్ (Allu Arjun), మహేష్ బాబు (Maheshbabu), జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) అభిమానులు కూడా ఈ సినిమాపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


దిమ్మతిరిగే కౌంటర్ ఇస్తున్న పవన్ ఫ్యాన్స్..

ఇకపోతే ఎవరు ఎంత నెగెటివిటీ క్రియేట్ చేసినా సినిమా నచ్చితే ఆడియన్స్ కచ్చితంగా చూస్తారు అని.. అటు యాంటీ ఫ్యాన్స్ కి దిమ్మ తిరిగే కౌంటర్ ఇస్తున్నారు పవన్ అభిమానులు. అంతేకాదు లెక్కలతో సహా ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి జన సైనికుడు ఈ సినిమా చూసినా రూ.200 కోట్లు ఖాయం. అటు 50 లక్షల మంది జనాలు చూసినా కచ్చితంగా రూ.300 కోట్లు రాబట్టడం అత్యంత సులభం అవుతుంది. ఇక ఎవరు ఎన్ని రకాలుగా నెగిటివ్ క్రియేట్ చేసినా.. ఈ కలెక్షన్స్ ఆపడం ఎవరి తరం కాదు అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే రూ.300 కోట్ల పోస్టర్ తో మీ ముందుకు వస్తాం అంటూ యాంటీ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే కౌంటర్లు వేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.. మొత్తానికైతే ఇప్పుడు చిన్న పాటి యుద్ధమే సోషల్ మీడియాలో జరుగుతోందని చెప్పవచ్చు.

హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..

జ్యోతి కృష్ణ (Jyoti Krishna) దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, నిధి అగర్వాల్(Nidhhi Agerwal) హీరోయిన్గా ఈ సినిమా విడుదలయ్యింది. ఇక భారీ అంచనాల మధ్య జూలై 23 రాత్రి నుండి ప్రీమియర్ షోలు పడగా.. ప్రీమియర్ షోతోనే మంచి కలెక్షన్స్ వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కచ్చితంగా రూ.70 కోట్లు రాబడుతుంది అని, ఇక వీకెండ్ ముగిసే సరికి రూ.300 కోట్లు పక్కా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Rajeev kanakala: యాంకర్ సుమ భర్తకు నోటీసులు.. రూ.70లక్షల భారీ మోసం!

Related News

Allu Sneha: స్నేహ రెడ్డికి ఈ ఫోటో అంటే అంత ఇష్టమా.. అంత స్పెషల్ ఏంటబ్బా?

Pasivadi Pranam Film: చిరు పసివాడి ప్రాణం చైల్డ్ ఆర్టిస్ట్ ఆ హీరోయినేనా.. ఇప్పుడు ఎలా ఉందంటే?

Idli KottuTrailer: ఆకట్టుకుంటున్న ధనుష్ ఇడ్లీ కొట్టు ట్రైలర్.. పని ఆదాయం కోసమే కాదంటూ!

Actress Hema: మంచు లక్ష్మికి హేమ సపోర్ట్.. మధ్యలో యాంకర్ సుమను కూడా ఇరికించేసిందిగా!

Mohanlal: ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికైన నటుడు మోహన్ లాల్.. ఖుషి అవుతున్న ఫ్యాన్స్!

OG Business: ఓజీ ముందు బిగ్ టార్గెట్… సేఫ్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేయాలంటే ?

Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!

Allu Arjun Fans: అల్లు అర్జున్ అభిమాన సంఘాల ప్రెసిడెంట్స్ భేటీ.. అదే కారణమా?

Big Stories

×