E-Paper
Advertisement

Prabhas: డైరెక్టర్ రెడీ.. స్క్రిప్ట్ రెడీ.. కానీ ప్రాబ్లం అంతా హీరోనే

Prabhas: డైరెక్టర్ రెడీ.. స్క్రిప్ట్ రెడీ.. కానీ ప్రాబ్లం అంతా హీరోనే
Advertisement

Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో ప్రభాస్ ఒకరు. ఏ ఇండస్ట్రీలో అయినా సక్సెస్ అవ్వాలి అంటే ఒక ప్రత్యేకమైన అడుగు ముందుకు వేయాలి. అలా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కోసం ఒక అడుగు ముందుకు వేశాడు ప్రభాస్. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోకపోయినా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు ప్రభాస్. ఆ తర్వాత వచ్చిన కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన సక్సెస్ సాధించింది. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.

డైరెక్టర్ రెడీ

ప్రభాస్ తో ప్రశాంత్ వర్మ చేసే మూవీ స్టోరీ, స్క్రిప్ట్ పనులు అన్నీ పూర్తి అయ్యాయట. ప్రభాస్ డేట్స్ ఇస్తే ఇక డైరెక్ట్ సెట్స్ పైకి వెళ్లడమే. దీన్ని హంబోలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నారు. కానీ ప్రభాస్ ఇంకా ఫౌజీలోనే ఉన్నాడు. అలాగే రాజా సాబ్ మూవీ కోసం జర్మనీ వెళ్తున్నాడు.

Advertisement

దీని తర్వాత స్పిరిట్ మూవీకి బల్క్ డేట్స్ ఇస్తున్నాడు. ఈ స్పిరిట్ టైంలో వేరే సినిమా చేయడానికి అవకాశం ఉండదు. ఆ విధంగా సందీప్ రెడ్డి వంగా డీల్ చేసుకున్నాడు. ఇవి అన్నీ అవ్వాలంటే, చాలా టైం పడుతుంది. ప్రశాంత్ వర్మ అన్నీ సెట్ చేసుకున్నా… ప్రభాస్ రెడీగా లేడు ఇప్పుడ.

ప్రశాంత్ కు ఇస్తే వర్కౌట్ 

ప్రశాంత్ వర్మ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను దర్శకత్వం వహించిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భీభత్సమైన సక్సెస్ సాధించింది. వెంకటేష్, నాగార్జున, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి హీరోలను దాటి హనుమాన్ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాతే ప్రశాంత్ వర్మ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే చాలామంది ఆడియన్స్ క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా అంటే ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

Also Read: Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Related News

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

వారణాసి షూటింగ్ పై క్రేజీ అప్డేట్.. జక్కన్న ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

ఎమోషనల్ గా ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్.. కిరణ్ ఖాతాలో మరో హిట్?

Big Stories

Advertisement
×