E-Paper
Advertisement

శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!
Advertisement

Samsung Galaxy Buds On: ఇయర్ ఫోన్స్ చాలా సేపు పెట్టుకుంటే చెవులు నెప్పి పుడతాయి అని బాధపడేవారి కోసం శాంసంగ్ ఒక సూపర్ ప్రొడక్ట్‌ను తీసొచ్చింది. అదే ‘గెలాక్సీ బడ్స్ ఆన్’. చెవి లోపలికి తోసేయకుండా, బయట క్లిప్ లాగా పెట్టుకునే కొత్త డిజైన్‌తో వీటిని మార్కెట్లోకి పరిచయం చేశారు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు లేదా పనిలో ఉన్నప్పుడు మ్యూజిక్ వింటూనే, చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ ఓపెన్-ఇయర్ డిజైన్ బాగా ఉపయోగపడుతుంది.

ఈ Galaxy Buds On ఇయర్ బడ్స్ ప్రారంభ ధర దక్షిణ కొరియాలో సుమారు రూ.21,000 వరకు ఉంటుంది. ముందుగా అక్టోబర్ 27 నుంచి ఇవి క్లాసిక్ బ్లాక్ కలర్‌లో అమ్మకానికి రానున్నాయి. ఆ తర్వాత మిగతా దేశాలతో పాటు భారతదేశంలోకి కూడా వీటిని త్వరలోనే తీసొచ్చే అవకాశం ఉంది.

Advertisement

Also Read: 110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

ఎంతోమంది చెవుల ఆకారాలను పరిశీలించి, అందరికీ హాయిగా సరిపోయేలా ఈ బడ్స్‌ను తీర్చిదిద్దారు. చెవిపై గట్టిగా కూర్చోవడం వల్ల వర్కౌట్స్ చేసేటప్పుడు లేదా పరుగెత్తేటప్పుడు కింద పడిపోతాయనే భయం ఉండదు. ఇందులో ట్విన్‌బోస్ట్ స్పీకర్లు, స్నాప్‌డ్రాగన్ S7 ప్రొసెసర్ వాడారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి సౌండ్ అదే అడ్జస్ట్ అవుతుంది. మనం వినే పాటలు పక్కనున్న వారికి వినిపించకుండా ఆడియో లీకేజ్ టెక్నాలజీ కూడా అందిస్తున్నారు.

Advertisement

కాల్స్ మాట్లాడేటప్పుడు బయటి గాలి శబ్దం, ఇంట్లోని ఫ్యాన్ గోల రాకుండా ఉండటానికి ఇందులో మూడు మైకులు, ప్రత్యేక వాయిస్ పికప్ సెన్సార్ ఉపయోగించారు. దీనివల్ల మనం మాట్లాడే మాటలు ఎదుటివారికి చాలా క్లియర్‌గా వినిపిస్తాయి. అంతేకాకుండా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 9.5 గంటల పాటు నాన్-స్టాప్ ప్లేబ్యాక్ వస్తుందని సామ్‌సంగ్ చెప్తోంది.

శాంసంగ్ గెలాక్సీ ఏఐ ఫోన్లకు ఇది బాగా సెట్ అవుతుంది. చెవి దగ్గర హ్యాండ్స్-ఫ్రీగా జెమిని ఏఐని ఆన్ చేయవచ్చు, వాయిస్ నోట్స్ రికార్డ్ చేయవచ్చు. కేవలం తల కదిలించి (హెడ్ జెస్టర్స్) కాల్స్ మాట్లాడటం, అలారమ్స్ ఆపడం లాంటివి చేయొచ్చు. కేస్ ఓపెన్ చేయగానే ఫోన్‌కి కనెక్ట్ అవుతాయి. సపరేట్ యాప్ లేకుండానే ఫోన్ సెటింగ్స్ నుంచే ఆడియో లెవెల్స్ మార్చుకోవచ్చు.

Also Read: వైర్డ్ vs వైర్‌లెస్ పవర్ బ్యాంక్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ కాలం మన్నుతుంది?

Tags

Related News

15 సెకన్ల క్రితం ఏం మాట్లాడారో మళ్లీ వినొచ్చు.. యాపిల్ వాచ్‌లో సరికొత్త AI ఫీచర్!

శాంసంగ్ M సిరీస్, ఫోల్డబుల్ ఫోన్లపై ఎప్పుడూ లేనంత భారీ డిస్కౌంట్లు.. ఇంత తక్కువకి మళ్లీ దొరకవు!

స్టూడెంట్స్, ప్రొఫెషనల్స్ కోసం బెస్ట్.. 2-ఇన్-1 ల్యాప్ టాప్

విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు పునాది..’రోహిణి ఇంజనీరింగ్ కాలేజ్’ ప్రత్యేకతలివే!

పార్టీ లవర్స్ కోసం ఫర్ఫెక్ట్.. సౌండ్‌కి దిమ్మ తిరిగిపోవాల్సిందే !

బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్ కావాలా? శామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ 9 ఫీచర్లు ఇవే!

గూగుల్‌లో ఈ విషయాలను అసలు వెతకొద్దు..సెర్చ్ చేస్తే నేరుగా జైలుకే!

Big Stories

Advertisement
×