Ranabaali Third Documentary: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ప్రధాన పాత్రలలో నటిస్తున్న తాజా చిత్రం రణబాలి(Ranabaali). డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityn) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన కథను 4 డాక్యుమెంటరీ సిరీస్ గా విడుదల చేస్తున్నారు. రెండు సిరీస్ లను విడుదల చేయగా చిత్ర బృందం తాజాగా మూడవ సిరీస్ కూడా విడుదల చేశారు.
ఇందులో భాగంగా మరుగున పడిన కొంతమంది వ్యక్తుల గురించి ఈ సిరీస్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ సిరీస్ లో భాగంగా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారని తెలిపారు. అయితే ఈ పాత్ర తనకు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అయింది అనే విషయాన్ని తెలిపారు. రాయలసీమలో అప్పట్లో పాలేగాళ్లు ఉండేవారు. వారిలో బుడ్డా వెంగల్ రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి వంటి పాలే గాళ్లు ఉండేవారని తెలిపారు. అయితే వీరిలో గడేకల్ బొబ్బిలి నాగిరెడ్డి పాత్ర నన్ను ఇన్స్పిరేషన్ చేసింది అలాగే బుడ్డా వెంగల్ రెడ్డి తన ఆస్తిని మొత్తం ప్రజల కోసం వారి ఆకలిని తీర్చడం కోసమే ఖర్చు చేశారని తెలిపారు.
ఇలా రాయలసీమ ప్రాంతంలో పాలేగాళ్లుగా పేరుపొందిన కొంతమంది నుంచి స్ఫూర్తిగా తీసుకొని ఇందులో సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రను డిజైన్ చేశామని తెలిపారు. ఇక అప్పట్లో ఈ పాలేగాలు అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్లేనని ఈ సిరీస్ ద్వారా డైరెక్టర్ తెలియచేశారు.. ఈ సినిమా 150 ఏళ్ల క్రితం జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన కరువు, రాయలసీమ ప్రజలపై బ్రిటిష్ వారి ఆధిపత్యం గురించి ఇందులో చూపించారు.
ఇలా రణబాలి సినిమాకు సంబంధించి ఇలా డాక్యుమెంటరీ రూపంలో చిత్ర బృందం ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఏది ఏమైనా విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఇలాంటి ఒక అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నారనే విషయం తెలిసి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ మంచి సక్సెస్ అందుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి సింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) విజయ్ దేవరకొండ భార్యగా జయమ్మ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.
Also Read: తిరిగితే తప్పేంటీ…తల్లితో విదేశీ పర్యటనలపై సుప్రత ఫైర్!