BigTV English

F1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘F1’ కలెక్షన్ల జోరు..ఇండియాలో ఎన్ని కోట్లంటే?

F1 Box Office Collections: బాక్సాఫీస్ వద్ద ‘F1’ కలెక్షన్ల జోరు..ఇండియాలో ఎన్ని కోట్లంటే?

F1 Box Office Collections: ఇటీవల తెలుగులో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది అన్న సంగతి తెలిసిందే. తెలుగులో డబ్ అవుతున్న యాక్షన్ చిత్రాలకు ప్రేక్షకులు నీరాజనం పలుకుతున్నారు. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్ పిట్ హీరోగా జోసెఫ్ కోసిన్‌స్కీ దర్వకత్వంలో రూపొందిన అమెరికన్ స్పోర్ట్స్ డ్రామా మూవీ F1.. ఫార్మూలా వన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ సౌజన్యంతో రూపొందిన ఈ మూవీకి ఎహ్రెన్ క్రూజర్ స్క్రీన్ ప్లే అందించారు. గత నెల జూన్ 27 న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ అయింది.. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ షో కలెక్షన్ లో వర్షం కురిపిస్తుంది.. భారత్లో ఇప్పటివరకు భారీగానే వసూళ్లను రాబట్టింది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఇదే ఎక్కువ.. ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూస్తే..


ఇండియాలో ‘ఎఫ్1’ కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

బ్రాడ్ పిట్, జెరెమీ క్లీనర్, జెర్నీ బ్రూక్‌హైమర్, డేడ్ గార్డనర్ నిర్మాతలుగా మారారు. న్యూయార్క్ క్యాబ్ డ్రైవర్, ప్రొఫెషనల్ గ్యాంబ్లర్‌గా బ్రాడ్ పిట్ నటించిన ఈ సినిమాను భారీ వ్యయంతో నిర్మించారు. సుమారుగా 300 మిలియన్ డాలర్లు అంటే భారతీయ కరెన్సీలో 2580 కోట్ల రూపాయలతో నిర్మించారు.. ఇందులో డామ్సన్ ఐడ్రీస్, కెర్రీ కాండన్, తోబియాస్ మెంజీస్, విల్ మెర్రిక్, సారా నైల్స్, సైమన్ ఆష్లే వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటించారు.. జూన్ 27 న థియేటర్లలోకి వచ్చేసిన మూవీ రెండు వారాలు అవుతున్నా కలెక్షన్ల జోరు తగ్గలేదు. రోజు రోజుకు వసూళ్ల సునామీ సృష్టిస్తుంది.. గత 10 రోజులుగా నిలకడగా వసూళ్లను సాధిస్తున్నది. తొలి రోజే 5.5 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. రెండు వారాలకు గాను దాదాపుగా రూ. 70 కోట్లు సాధించింది. ఇదే జోరులో మూవీ కలెక్షన్స్ ఉంటే మాత్రం రెండు మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉందని టాక్.


Also Read :‘మహావతార్ నరసింహ’ ట్రైలర్ రిలీజ్.. నరసింహుడి ఉగ్రరూపం చూస్తే గూస్‌బంప్స్ పక్కా..!

ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..

ఈ మూవీలో బ్రాడ్ పిట్ సన్నీ హేయెస్ పాత్రలో నటించారు. ఇందులో ఫార్మూలా వన్ కారు డ్రైవర్. 1990లో జరిగిన రేసింగ్ సందర్భంలో తీవ్రమైన ప్రమాదానికి గురైన ఆయన ఫార్మూలా వన్ రేసింగ్ నుంచి రిటైర్ అవుతాడు.. ఆ తర్వాత కుటుంబ పోషణకు క్యాబ్ డ్రైవర్ గా మారతాడు. రిటైర్మెంట్‌కు స్వస్తి చెప్పి తిరిగి అపెక్స్ గ్రాండ్ ప్రీ టీమ్‌లో పాల్గొనాలని ఆఫర్ లభిస్తుంది. ఆ రేసింగ్‌లో సన్నీ హేయస్ పాల్గొన్నాడా? ఆ తర్వాత అతడి జీవితంలో ఎలాంటి ట్విస్టులు ఎదురవుతాయి అనేది ఈ మూవీ స్టోరీ.. ఒక ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజులో రెస్పాన్స్ రావడం మామూలు విషయం కాదు.. ఇంకెన్ని కోట్లు వసూల్ చేస్తుందో చూడాలి..

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×