Vidyabalan:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్కసారి జరిగే సంఘటనలు.. ఆ సెలబ్రిటీల జీవితాలపై ఎంతలా ప్రభావం చూపిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఒక సినిమా మొదలు పెట్టాము అంటే.. ఆ సినిమా పూర్తయి విడుదల అయ్యేవరకు దర్శక నిర్మాతలు, నటీనటులు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొన్ని సినిమాలు అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయి, ఆ సెలబ్రిటీలకు తీరని నష్టాన్ని మిగులుస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరోతో సినిమా చేసి, తన సగ సినీ జీవితాన్నే కోల్పోయాను అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రముఖ హీరోయిన్. మరి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
స్టార్ హీరోతో సినిమా.. 8 ప్రాజెక్టులు కోల్పోయాను- విద్యాబాలన్
ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్ (Vidyabalan). బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం వల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయి.. తనపై ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది అంటూ ఎమోషనల్ అయింది. ఇదే విషయంపై విద్యాబాలన్ మాట్లాడుతూ..” నేను మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ (Mohan Lal) తో కలిసి ‘చక్రం’ అనే సినిమాలో నటించడానికి సిద్ధం అయ్యాను. కొన్ని రోజులు సినిమా షూటింగ్ కూడా జరిగింది. అయితే సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఈ ఒక్క సినిమా వల్ల దాదాపు 8 ప్రాజెక్టులు నేను కోల్పోయాను. వాస్తవానికి దర్శకుడికి, మోహన్ లాల్ కు మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్ల ఆ సినిమా ఆగిపోయింది.కానీ నా వల్లే సినిమా ఆగిపోయిందని, నేను ఒక “ఐరన్ లెగ్”అని నా పైన లేనిపోని అభాండాలు వేసి నా సినీ జీవితాన్ని నాశనం చేశారు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మొత్తానికి అయితే మోహన్ లాల్ తో సినిమా వల్లే తనకు ఎనిమిది ప్రాజెక్టులలో అవకాశం కోల్పోవాల్సి వచ్చింది అంటూ తెలిపింది. ప్రస్తుతం విద్యాబాలన్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విద్యాబాలన్ కెరియర్..
విద్యాబాలన్ కెరియర్ విషయానికి వస్తే..పలు హిందీ, బెంగాలీ, మలయాళ చిత్రాలలో నటించింది. ఇక మ్యూజిక్ వీడియోలలో, సీరియల్స్ లో, వాణిజ్య ప్రకటనల ద్వారా కెరియర్ను ఆరంభించిన ఈమె 16 ఏళ్ల వయసులో ఏక్తాకపూర్ నిర్మించిన ‘హం పాంచ్’ అనే హిందీ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగులు వేసింది. హీరోయిన్ అవ్వాలనుకుంటున్నట్టు ఇంట్లో చెబితే ముందు చదువు పూర్తి చేయాలని చెప్పారట. దీంతో సోషియాలజీలో ముంబై యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ అందుకుంది.
అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి.. మోసం చేశారు..
ఇక తర్వాత మెల్లగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన ఈమె.. అందులో భాగంగానే మొదటి సినిమా మలయాళం లో మోహన్ లాల్ సరసన చక్రం అనే సినిమాకు సైన్ చేసింది. ఈ సినిమా ఆగిపోయింది. ఈ సినిమా వల్ల ఆ తర్వాత తమిళంలో 2002లో వచ్చిన రన్ అనే సినిమాకి హీరోయిన్గా ఎంపిక చేసుకున్నా.. మీరాజాస్మిన్ ను రీప్లేస్ చేసి ఆ సినిమా నుండి తప్పించారు.ఆ తర్వాత మనసెల్లాం అనే సినిమాలో కూడా ఈమెను తీసుకొని.. మళ్ళీ త్రిష కృష్ణన్ తో రీప్లేస్ చేశారు. ఎన్నో కష్టాలు పడి కళారీ విక్రమన్ అనే సినిమా చేసినప్పటికీ.. ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. అలా ఎన్నో కష్టాలు పడి ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు మళ్ళీ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:Ramayan: ‘రాముడు పాత్రలో బీఫ్ తినేవాడా ?’.. ట్రోల్స్‌కి ఆన్సర్ ఇచ్చిన మూవీ టీం!