BigTV English

CM Chandrababu: టీచర్‌‌గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్‌‌గా మంత్రి లోకేష్, పీటీఎం ముచ్చట్లు

CM Chandrababu: టీచర్‌‌గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్‌‌గా మంత్రి లోకేష్, పీటీఎం ముచ్చట్లు

CM Chandrababu: క్షణం తీరిక లేకుండా గడుపుతున్న సీఎం చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడిగా మారిపోయారు. స్కూల్‌లోని విద్యార్థులకు పాఠాలు చెప్పారు.  ఆ తరగతిలో మంత్రి నారా లోకేశ్‌ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. అరుదైన సన్నివేశం ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రాంతం వేదికైంది.


రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు-ఉపాధ్యాయులతో మెగా సమావేశాన్ని శ్రీకారం చుట్టింది చంద్రబాబు సర్కార్. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఉద్యోగులు, దాతలు, పూర్వ విద్యార్థులు అందరినీ ఒక చోటకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జడ్పీ పాఠశాల వేదికైంది.

ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు ముఖ్యమంత్రి. భవిష్యత్‌లో ఏం కావాలనుకుంటున్నారని విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి సమాధానాలు తెలుసుకున్న సీఎం, తరగతి గదులను పరిశీలించారు. గదులను చూసిన సీఎం చంద్రబాబు కాసేపు ఉపాధ్యాయుడిగా మారిపోయారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. వనరులు అనే సబ్జెక్టుపై చిన్న క్లాస్‌ తీసుకున్నారు.


ఆ క్లాస్‌లో మంత్రి లోకేశ్‌ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. చివరకు విద్యార్థుల ప్రోగ్రెస్‌ కార్డులు పరిశీలించిన సీఎం చంద్రబాబు, వారికి వచ్చిన మార్కులపై ఆరా తీశారు. మీటింగుకు వచ్చిన తల్లిదండ్రులతో మాట్లాడి పాఠశాల ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి ఫొటోలు దిగారు.

ALSO READ: కార్యకర్తల మధ్య ఉక్కిరిబిక్కిరైన రోజా

విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ బాగా పని చేస్తున్నారని, పాఠశాలల్లో మార్పులు తీసుకొచ్చారని అన్నారు.  అంతకుముందు మెగాపేరెంట్-టీచర్ మీటింగ్ లోగోతో రూపొందించిన ఫోటో ఫ్రేమ్‌లో ఫోటోలు దిగారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్. ఆ తర్వాత సీఎంకు గౌరవ వందనం సమర్పించారు ఎన్సీసీ కేడెట్‌లు.

విద్యార్ధులు రూపొందించిన తల్లికి వందనం పోస్టర్లు, కళారూపాలను తిలకించారు. జెడ్పీ పాఠశాల పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం, అధికారులకు పలు సూచనలు చేశారు.

 

Related News

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Railways: రైల్వే ప్రాజెక్టులపై దృష్టి.. అవన్నీ జరిగితే ఏపీకి తిరుగుండదు

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Big Stories

×