Dont Trouble The Trouble: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే సినిమా పై భారీగా అంచనాలు ఉంటాయి. ఇక రాజమౌళి సమర్పణలో సినిమా రాబోతోంది అంటేనే ఆ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. ఇలా రాజమౌళి సమర్పణలో తన కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ (S.S.Karthikeya)నిర్మాణంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ” డోంట్ ట్రబుల్ ద ట్రబుల్”(Don’t Trouble The Trouble). ఈ సినిమా నేడు తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ శశాంక్ ఏలేటి దర్శకత్వంలో ఫహద్ పజిల్(Fahadh Faasil) ఈ సినిమాలో నటించారు.
ఈ సినిమా మొత్తం మ్యాజిక్ నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా నేడు విడుదల కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో రాజమౌళి (Rajamouli)ప్రమోషన్లను నిర్వహిస్తూ సినిమాపై అంచనాలను పెంచేశారు. అయితే నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రివ్యూలు రావడం గమనార్హం. ఇలా ఈ సినిమా చూసిన అనంతరం నేటిజన్స్ సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అలాగే ఎన్టీఆర్ (NTR) పై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.
ఇలా ఈ సినిమా విషయంలో ఎన్టీఆర్ మహేష్ పై విమర్శలు కురిపించడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే.. ఈ సినిమా విడుదల కాకుండానే ఎన్టీఆర్, మహేష్ ఈ సినిమా చూసి ఈ సినిమా పట్ల వారి అభిప్రాయాలను తెలియజేశారు. ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంది అంటూ సినిమాపై భారీగా పాజిటివ్ రివ్యూ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇలా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు సినిమాకి మంచి రివ్యూ ఇవ్వడంతో ప్రేక్షకులలో కూడా ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అంచనాలను చేరుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే మహేష్ బాబు ఎన్టీఆర్ లను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.. లక్షల మంది అభిమానులని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఉన్న మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి గొప్ప నటులు మొహమాటానికి పోయి రిలీజ్ కి ముందే పాజిటివ్ రివ్యూ ఇవ్వటం కరెక్ట్ కాదు… సినిమా నచ్చిన కూడా రిలీజ్ కి ముందు ఇలాంటి రివ్యూ ఇవ్వకపోవడం బెటర్ అని తెలిపారు. కేవలం రాజమౌళిని దృష్టిలో పెట్టుకొని సినిమా బాలేకపోయినా బాగున్నట్టు రివ్యూ ఇవ్వటం ఏంటీ అంటూ వీరిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ హాజరయ్యారు. అదే విధంగా సినిమాపై ఈయన సోషల్ మీడియాలో స్పందిస్తూ గొప్పగా రివ్యూ ఇచ్చారు. మహేష్ బాబు కూడా సినిమా అద్భుతంగా ఉంది అంటూ రివ్యూ ఇవ్వడంతోనే ఈ విమర్శలు వస్తున్నాయి.
Also Read: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇల్లు ఇల్లాలు పిల్లలు నటి…పోస్ట్ వైరల్!