Gas geyser vs electric geyser: చలికాలం వచ్చేందంటే చాలు ప్రతి ఇంట్లోనూ.. వేడి నీళ్ల అవసరం విపరీతంగా పెరుగుతుంది. దీంతో అందరి చూపు గీజర్‌ల వైపు వెళ్తాయి. మార్కెట్లో ప్రస్తుతం గ్యాస్ గీజర్లు, ఎలక్ట్రిక్ గీజర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏది మంచిది, దేని వల్ల కరెంట్ బిల్లు తక్కువ వస్తుంది. అంతే కాకుండా ఏది మన కుటుంబానికి పూర్తిగా సేఫ్ అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలు ఏంటీ.. సేఫ్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
గ్యాస్ గీజర్లు ఎల్పీజీ గ్యాస్ సహాయంతో.. నీటిని క్షణాల్లో వేడి చేస్తాయి. వీటిలో ప్రత్యేకంగా వాటర్ ఫ్లో జరగగానే గ్యాస్ బర్నర్ ఆన్ అయ్యి నీటిని ఇన్‌స్టంట్‌గా వేడి చేస్తుంది. ఇవి నీటిని వేడి చేయడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటాయి. అంతే కాకుండా.. ఇది కరెంట్ బిల్లుతో సంబంధం లేకుండా కేవలం గ్యాస్ సిలిండర్ ఖర్చుతోనే నడుస్తాయి కాబట్టి రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉంటుంది.
నష్టాలు: గ్యాస్ గీజర్లు పని చేసేటప్పుడు కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాద కరమైన వాయువులు వెలువడతాయి. ఒక వేళ బాత్రూమ్ సరిగ్గా.. వెంటిలేషన్ (గాలి ఆడే అవకాశం) లేకపోతే.. ఈ గ్యాస్ రూమ్‌లో నిండిపోయి శ్వాస ఆడక ప్రాణాలకే ముప్పు వాటిల్లే తీవ్రమైన ప్రమాదం ఉంది. అందుకే గ్యాస్ గీజర్లను ఎప్పుడూ ఓపెన్ స్పేస్ లేదా కిచెన్/బాల్కనీ వంటి గాలి బాగా ఆడే ప్రాంతాల్లోనే ఇన్‌స్టాల్ చేయాలి.
ఎలక్ట్రిక్ గీజర్లు కరెంట్‌తో పని చేస్తాయి. ఇవి స్టోరేజ్ టైప్ ,ఇన్ స్టంట్ టైప్ రూపంలో.. మార్కెట్లో లభిస్తాయి. వీటిలో.. ఉండే హీటింగ్ ఎలిమెంట్ కరెంట్ ద్వారా వేడెక్కి నీటిని వేడి చేస్తుంది. ఎలక్ట్రిక్ గీజర్లు ఇళ్లలో.. ఇన్‌స్టాల్ చేయడానికి చాలా సేఫ్ అని చెప్పొచ్చు. వీటిలో గ్యాస్ లీకేజ్ లేదా కార్బన్ మోనాక్సైడ్ భయం అసలు ఉండదు. ఆటో మేటిక్ థర్మోస్టాట్ సపోర్ట్ ఉండటం వల్ల.. నీరు వేడెక్కగానే ఆటోమేటిక్‌గా పవర్ కట్ అవుతుంది.
నష్టాలు: ఇవి నీటిని వేడి చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయి. అలాగే.. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉప్పు నీరు వచ్చే.. ప్రాంతాలలో ఎలక్ట్రిక్ గీజర్ హీటింగ్ ఎలిమెంట్ త్వరగా దెబ్బతింటుంది.
Also Read: ఫ్రిజ్ దగ్గర గ్యాస్ సిలిండర్ ఉందా? వెంటనే ఈ తప్పు సరిదిద్దుకోండి!
సేఫ్టీ పరంగా చూస్తే ఎలక్ట్రిక్ గీజర్లు గ్యాస్ గీజర్ల.. కంటే చాలా బెస్ట్. ఎలక్ట్రిక్ గీజర్లలో ప్రాణాంతకమైన వాయువులు వెలువడే ప్రమాదం ఉండదు. అయితే.. ఎలక్ట్రిక్ గీజర్ వాడేటప్పుడు ప్రాపర్ ఎర్తింగ్, క్వాలిటీ MCB స్విచ్ ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ మీరు గ్యాస్ గీజరే వాడాలనుకుంటే.. బాత్రూమ్ బయట సెట్ చేసుకోవడం లేదా బాత్రూమ్‌లో వెంటిలేషన్ వెంట్లు పక్కాగా ఉండేలా చూసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు.
ఎలక్ట్రిక్ గీజర్ ధర: బ్రాండ్ , కెపాసిటీని బట్టి (10 లీటర్ల నుంచి 25 లీటర్లు) సుమారు రూ. 5,000 నుంచి రూ. 12,000 వరకు ఉంటుంది.
గ్యాస్ గీజర్ ధర: ఇవి సాధారణంగా కొంచెం తక్కువ ధరలో లభిస్తాయి. సుమారు రూ. 3,500 నుంచి రూ. 7,000 వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
మీ ఇంటి అవసరాలు, బడ్జెట్ , బాత్రూమ్ స్థలాన్ని బట్టి గీజర్‌ను కొనడం మంచిది. చిన్న బాత్రూమ్‌లు ఉన్నవారు ఎలక్ట్రిక్ గీజర్‌ను ఎంచుకోవడం బెస్ట్. మీ కుటుంబ సేఫ్ గా ఉండేందుకు తగిన మోడల్ కొనడం మంచిది.