E-Paper
Advertisement

ర్యాపిడో పింక్ డ్రైవ్ వివాదం.. మహిళా రైడర్‌కి పురుష డ్రైవర్‌.. ‘నేను గే’ అంటూ విచిత్ర సమాధానం!

ర్యాపిడో పింక్ డ్రైవ్ వివాదం.. మహిళా రైడర్‌కి పురుష డ్రైవర్‌.. ‘నేను గే’ అంటూ విచిత్ర సమాధానం!
Advertisement

Rapido Pink Ride: మహిళల భద్రత కోసం ‘ర్యాపిడో’ ప్రారంభించిన ‘పింక్ రైడ్’ సేవలు వివాదాస్పదంగా మారాయి. మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించిన ఈ సేవలో.. ఒక మహిళకు పురుష డ్రైవర్‌ను కేటాయించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్ ఫ్లూయెన్సర్ షాలిని చతుర్వేది తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అసలేం జరిగిందంటే?

షాలిని చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె ర్యాపిడో పింక్ రైడ్‌ను బుక్ చేసుకున్నారు. అయితే రైడ్ కన్ఫర్మ్ అయిన కాసేపటికే ఒక మగ డ్రైవర్ ఆమెకు ఫోన్ చేసి తనే రైడ్ కోసం వస్తున్నట్లు చెప్పాడు. పింక్ సర్వీస్‌ను ఎంచుకున్నది మహిళా రైడర్ వస్తారనే కదా అని ఆమె గుర్తు చేయగా.. ఆ డ్రైవర్ షాకింగ్ సమాధానం చెప్పాడు. ‘మేడమ్, నేను గే (Gay)’ అని షాలినికి బదులిచ్చాడు.

డ్రైవర్ ప్రొఫైల్లో మహిళ ఫొటో

Advertisement

ర్యాపిడో యాప్‌లో చూసినప్పుడు డ్రైవర్ ప్రొఫైల్ ఫోటో ఒక మహిళదిగా కనిపించిందని షాలిని చతుర్వేది పేర్కొన్నారు. కానీ ప్రత్యక్షంగా పురుషుడు రావడం చూసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. భద్రతకు ముప్పు ఉందన్న ఉద్దేశంతో రైడ్‌ను క్యాన్సిల్ చేసినట్లు తెలియజేశారు. అయితే రూ. 25 విలువైన రైడ్‌ను క్యాన్సిల్ చేసినందుకు ర్యాపిడో నిర్వాహకులు తనకు రూ. 15 క్యాన్సిలేషన్ ఛార్జీ విధించారని షాలిని చతుర్వేది అసహనం వ్యక్తం చేశారు.

మాటలు కాదు.. భద్రతే ముఖ్యం

దేశంలో మహిళా భద్రత అనేది వ్యాపార మార్గంగా మారిపోయిందని ఈ సందర్భంగా షాలిని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన దేశంలో మహిళా భద్రత ఒక జోక్ లా తయారైంది. మహిళను ప్రీమియం ఛార్జీగా పరిగణిస్తున్నారు. ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప, ఎలాంటి రక్షణ లభించడం లేదు’ అని ఆమె సామాజిక మాధ్యమాల్లో ఘాటుగా స్పందించారు.

Advertisement

Also Read: ఏపీలో సంచలనం.. తిరుపతి బీజేపీ నేత హత్యకు భార్య కుట్ర.. బయటపడ్డ షాకింగ్ నిజాలు!

ర్యాపిడో రియాక్షన్ ఇదే..

ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారడంతో ర్యాపిడో సంస్థ అధికారికంగా స్పందించింది. పింక్ రైడ్లు కేవలం మహిళా క్యాప్టెన్లకు మాత్రమే కేటాయించబడతాయని ఒక పురుషుడికి ఈ రైడ్ ఎలా కేటాయించబడిందో సమగ్ర విచారణ జరుపుతామని తెలిపింది. అలాగే బాధితురాలికి క్షమాపణలు చెబుతూ విధించిన క్యాన్సిలేషన్ ఛార్జీని రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. అలాగే సదరు డ్రైవర్ ను ప్లాట్‌ఫామ్ నుండి శాశ్వతంగా తొలగించి.. దానికి సంబంధించిన ఆధారాలను సైతం షాలినితో పంచుకుంది.

Also Read: ఎయిర్‌టెల్ vs వీఐ.. ఒకే ధరకు రూ.3,999 వార్షిక ప్లాన్.. ఏది రీఛార్జ్ చేస్తే ఎక్కువ బెనిఫిట్?

నెటిజన్లు ప్రశ్నల వర్షం

మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. రైడ్ హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో భద్రతా తనిఖీలు, జవాబుదారీతనం లోపించాయని పలువురు విమర్శిస్తున్నారు. ‘నాకు కూడా ఇలాగే జరిగింది. ఒక బండి బుక్ చేస్తే మరొక వాహనంపై వచ్చారు’ అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ‘సాధారణ రైడ్ కంటే పింక్ రైడ్‌కు ఎక్కువ ఛార్జ్ ఎందుకు వసూలు చేస్తున్నారు?’ అని మరొకరు నిలదీశారు.

?utm_source=ig_embed&ig_rid=A3tjSz6BO6LH4J49invjDjm

Also Read: సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

Tags

Related News

ఢిల్లీలో హైటెన్షన్.. మెట్రో, ఇంటర్నెట్ సేవలు బంద్.. రంగంలోకి 5 వేల బలగాలు!

సీఎం విజయ్ ఓ అడుగు ముందుకు.. ఉచిత బస్సు ప్రయాణం డీలక్స్ వరకు, మహిళల్లో ఒకటే ఆనందం

కెప్టెన్ స్మిత్‌తో ప్రధాని ఫోన్ కాల్.. దేశానికే గర్వకారణమని ప్రశంసలు.. ఏడ్చేసిన పైలట్!

లాడ్జిలో ప్రియుడితో ఓ మహిళ.. సుపారీ గ్యాంగ్‌తో భార్య ఎంట్రీ, చివరకు అక్కడ ఏం జరిగిందంటే..

అత్తింట్లో నవ వధువుకు చుక్కలు.. రూ. 50 వేలు ఇస్తే బాత్రూం, చివరకు ఏం జరిగిందంటే

దేశవ్యాప్తంగా అక్టోబర్ 2 నుంచి 8 వరకు భారీ నిరసనలు.. కారణం ఇదే!

బంధువుతో వివాహేతర బంధం.. అడ్డుగా ఉన్న భర్తను చంపేందుకు.. ఏకంగా భూమిని అమ్మేసిన భార్య!

Big Stories

Advertisement
×