Allu vs Mega :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలుగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో అల్లు, మెగా కుటుంబాలు కూడా ఒకటి. ముఖ్యంగా టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఎంత మంచి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుమారుగా ఈ కుటుంబం నుంచే పదిమందికి పైగా హీరోలు ఇండస్ట్రీలో చలామణి అవుతున్నారు. ఇందులో కొంతమంది హాలీవుడ్ రేంజ్ కి కూడా ఎదిగిన విషయం తెలిసిందే. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో సత్తా చాటుతో దూసుకుపోతున్న ఈ ఫ్యామిలీ ఎంతోమందికి అండగా ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదిలా ఉండగా గత కొంతకాలంగా అల్లు Vs మెగా అంటూ అభిమానుల మధ్య వార్ గట్టిగా జరిగిన విషయం తెలిసిందే. దీనికి తోడు అటు అల్లు అర్జున్ (Allu Arjun) ఇటు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మధ్య కూడా సఖ్యత లేకపోవడంతో ఈ గొడవను మరింత తీవ్రతరం చేశారు అభిమానులు. నిజానికి 2024లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటి నుంచే “అల్లు వర్సెస్ మెగా” అంటూ గొడవ మొదలైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి సపోర్ట్ చేయకుండా తన స్నేహితుడు వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేయడంతోనే అసలు సమస్య మొదలయింది. అక్కడి నుంచి అల్లు అర్జున్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించకపోవడం, అటు పుష్ప2 (Pushpa 2) కేసులో ఒక రోజంతా జైల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ పలకరించకపోవడం పైగా సెటైరికల్ కామెంట్లు చేయడం అన్నీ కూడా వీరి మధ్య గొడవను క్రియేట్ చేశాయి.
కథ సుఖాంతం..
దీంతో ఎప్పుడు ఈ రెండు కుటుంబాలు కలుస్తాయో అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma) మరణం తర్వాత ఈ రెండు కుటుంబాలు కలిసిపోయాయి. అటు అల్లు అర్జున్ కూడా తన మేనమామలు చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, రామ్ చరణ్ అందరూ కూడా అల్లు కనకరత్నమ్మ మరణం తర్వాత కలిసిపోయారు. పైగా అల్లు కనక రత్నమ్మ దశదిన కార్యక్రమాన్ని అందరూ దగ్గరుండి మరీ పూర్తి చేశారు. దీంతో కథ సుఖాంతం అని అందరూ అనుకున్నారు.
“పాన్ ఇండియా మెగాస్టార్ బన్నీ” అంటూ..
ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు చేసిన పనికి మళ్లీ గొడవ మొదలయ్యేలా ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ చిత్రం కోసం హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీ ఎఫ్ ఎక్స్ సంస్థలను కూడా రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా చిత్ర బృందాన్ని నెట్ ఫ్లిక్స్ చీఫ్ కంటెంట్ ఆఫీసర్ బేలా బజారియా బృందం అల్లు అర్జున్ అట్లీ , అల్లు అరవింద్ లను కలిశారు. అందుకు సంబంధించిన ఫోటోని అల్లు అర్జున్ అభిమాని షేర్ చేస్తూ “పాన్ ఇండియా మెగాస్టార్ బన్నీ” అంటూ సంబోధించడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.
also read:Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా
మళ్లీ మొదలు..
ఇది చూసిన అభిమానులు అల్లు కనకరత్నమ్మ మరణం తర్వాత కలిసిపోయారు. దీంతో కథ సుఖాంతం అనుకుంటే మళ్లీ అల్లు అర్జున్ అభిమాని పెట్టిన చిచ్చు గొడవకు దారి తీసేలా ఉందే అంటూ పలు కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై మెగా అభిమానులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.
Netflix Chief Content Officer Bela Bajaria met Indian megastar #AlluArjun and the #AA22 team during her visit to Hyd 🤯
PLANS ARE HUGE 🥶💥#AA22 @alluarjun pic.twitter.com/xar7SKFBbY
— Sumanth (@SumanthOffl) September 17, 2025
also read: Nag 100: నాగార్జున 100వ సినిమా ముహూర్తం ఆరోజే.. గెస్ట్ గా ఆ స్టార్ హీరోస్.. టైటిల్ కూడా