Andhra King Taluka:ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా, మహేష్ బాబు.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూకా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆంధ్రా కింగ్ సూర్యకుమార్ పాత్రలో కనిపించనున్నాడు. రామ్.. ఉపేంద్ర అభిమాని సాగర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ప్రతి అభిమాని బయోపిక్‌లా తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం కోసం రామ్ చాలా కష్టపడుతున్నాడు. మొట్ట మొదటిసారి ఒక సినిమా కోసం లిరిసిస్ట్ అయ్యాడు. సింగర్ గా మారాడు. గత కొన్నేళ్లుగా రామ్ కు సరైన హిట్ లేదు. అయితే ఈసారి ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
ఆంధ్రా కింగ్ తాలూకాపై అభిమానులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నేడు ఉపేంద్ర పుట్టినరోజు. దీంతో ఉదయం నుంచి ఆయనకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక తాజాగా ఆంధ్రా కింగ్ తాలూకా నుంచి సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేసి ఉపేంద్రకు బర్త్ డే విషెస్ తెలిపారు మేకర్స్.
ఉపేంద్ర పోస్టర్ లో ఆంధ్రా కింగ్ లానే కనిపిస్తున్నాడు. అభిమానులకు అభివాదం చేస్తూ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఆంధ్రా కింగ్ సూర్యగా ఆయన నటించడం అందరికి నచ్చుతుంది. సినిమా రిలీజ్ తరువాత సెలబ్రెట్ చేస్తారు అని తెలుపుతూ ఉపేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. నవంబర్ 28 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాలి.