Fatima Sana Shaikh: బాలీవుడ్ ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్ (Fatima Sana Shaikh) ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యంగా ఈమె ఇటీవల నటుడు విజయ్ వర్మతో (Vijay Varma)కలిసి కనిపించడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి అప్పటినుంచి ఏదో ఒక విధంగా ఫాతిమా సోషల్ మీడియా వార్తలలో నిలుస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె హీరో మాధవన్ తో కలిసి నటించిన
“ఆప్ జైసా కోయి” (Aap Jaisa Koi)అనే రొమాంటిక్ కామెడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఫాతిమా పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరయ్యారు.
అసభ్యకరంగా…
ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెకు ఒక వ్యక్తి నుంచి గతంలో ఏదైనా చేదు సంఘటనల గురించి బయటపెట్టారు. ” ఓ వ్యక్తి తన పట్ల చాలా అసభ్యకరంగా ప్రవర్తించాలని అలాగే ఎంతో అభ్యంతరకరంగా తనని తాకారని వెల్లడించారు. ఆ వ్యక్తి అలా తాగగానే చాలా కోపం వచ్చి లాగి పెట్టి ఒకటి కొట్టాను. అయితే ఆ వ్యక్తి కూడా తిరిగి నన్ను కొట్టాడని ఫాతిమా వెల్లడించారు. తనని అసభ్యంగా తాకుతూ ఆ వ్యక్తి తప్పు చేసినప్పటికీ తిరిగినని కొట్టడం చాలా బాధనిపించింది” అంటూ ఈమె తనకు జరిగిన ఈ సంఘటన గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.
కమిట్మెంట్స్ అడుగుతున్నారు..
ఇక ఈ ఘటన తనకు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఎదురయిందా ? లేక ఇండస్ట్రీలోకి రాకముందే ఇలాంటి సంఘటన జరిగిందా? ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇలా ఆ వ్యక్తి వివరాలను కూడా బయట పెట్టకుండా ఫాతిమా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎంతోమంది ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పాలి. ఇప్పటికే పలు సందర్భాలలో చాలామంది నటీమణులు ఇండస్ట్రీలో వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి బయటపెట్టారు. అవకాశాలు కావాలంటే కమిట్మెంట్లు ఇవ్వాలి అంటూ నేరుగా అడిగారని ఎంతో మంది మీడియా సమావేశాలలో ఇలాంటి ఘటనల గురించి తెలియజేశారు. ఇలా వారు ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టారే తప్ప అందుకు కారణమైన వారి వివరాలను మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం.
విజయ్ వర్మతో రిలేషన్..
ఇక ఫాతిమా ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. అయితే ఇటీవల ఈమె తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మతో కలిసి చాలా క్లోజ్ గా కనిపించిన నేపథ్యంలో తమన్నకు బ్రేకప్ చెప్పిన విజయ్ వర్మ ఫాతిమాతో రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఖండిస్తూ ఈమె తాను ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాను అంటూ పరోక్షంగా ఒక పోస్ట్ చేశారు. ఇలా విజయ్ వర్మ కారణంగా ఫాతిమా తరచు వార్తలలో నిలుస్తున్నారు.
Also Read: Jagapathi Babu: పిచ్చి నా కొ**లు అంటూ రెచ్చిపోయిన జగ్గూ బాయ్.. ఏమైందంటే?