దేశ వ్యాప్తంగా ఎన్నో వింత గ్రామాలు ఉన్నాయి. అక్కడి ప్రజల ఆచార విధానాలు, ప్రజలు వ్యవహరించే తీరు, పాటించే పద్దతులు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. అలాంటి ఓ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా మనం ఆలయాలకు, ఇతర పవిత్ర ప్రదేశాలకు వెళ్లినప్పుడు చెప్పులు వదిలి వెళ్లడం కామన్. ఇంట్లోకి కూడా చెప్పులు విడిచే వెళ్తాం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే గ్రామ ప్రజలు ఎవరూ చెప్పులు వేసుకోరు. అలా వేసుకోవడం తప్పుగా భావిస్తారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉందంటే..
వేంకటేశ్వరుడిని మొక్కినా, తిరుమలకు వెళ్లరు!
‘వేమన ఇండ్లు’. తిరుపతికి 50 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 25 ఇళ్లు ఉంటాయి. ఇక్కడ 80 మంది జనాభా ఉంటారు. ఈ గ్రామంలో ఎవరూ చెప్పులు వేసుకోరు. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు కూడా చెప్పులు బయటే విడిచి వస్తారు. ఈ గ్రామ ప్రజలు వేంకటేశ్వర స్వామిని పూజిస్తారు. కానీ, పక్కనే ఉన్న తిరుమలకు మాత్రం వెళ్లరు. ఇంకా ఇక్కడి ప్రజలకు మరో అలవాటు ఉంది. ఈ గ్రామ ప్రజలు అస్సలు బయటి ఫుడ్ తినరు. స్కూల్ లో మధ్యాహ్న భోజనం పెట్టినా ఎవరూ టచ్ చేయరు. ఎంత అనారోగ్యంగా ఉన్నా ఇక్కడి ప్రజలు హాస్పిటల్ వంక చూడరు. బయటి వ్యక్తులను అస్సలు తాగరు. ఒకవేళ పొరపాటున తాకితే స్నానం చేశాకే ఇంట్లోకి అడుగు పెడతారు. ఈ ఊళ్లోకి దళితులకు అస్సలు ప్రవేశం లేదు. వారితో కనీసం మాట్లాడరు కూడా.
Read Also: గర్భంలో బిడ్డ ఇలా ఏర్పడుతుందా? కట్టిపడేస్తున్న అద్భుత శిల్పాలు.. ఎక్కడో తెలుసా?
తిరుపతి ప్రాంతంలో వింత గ్రామం
ఇక వేమన ఇండ్లు గ్రామ ప్రజలను ఆ పరిసర ప్రాంతాల ప్రజలు చాలా విచిత్రంగా చూస్తారు. అక్కడి వారితో కలిసేందు ఇష్టపడరు. ఎందుకంటే, ఎదుటి వాళ్లు కలిసేందుకు ప్రయత్నించినా, ఆ ప్రాంత ప్రజలు ఇష్టపడరు. అందుకే వారిని కలిసేందుకే కూడా పెద్దగా చొరవ చూపించరు. మొత్తంగా ఇక్కడి ప్రజలు ఆధునిక కాలంలో ఉన్నా, పురాతన జీవన ఆలోచనలను కలిగి ఉన్నారు. వారిలో అవగాహన కల్పించేందుకు ఇతర ప్రాంతల ప్రజలతో కలిసి ఉండాలని, హాస్పిటల్స్ ను వినియోగించుకోవాలని సూచించే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదంటారు అధికారులు. చాలా కాలం చెప్పి చూసినా వారిలో మార్పు రాలేదంటారు. అందుకే వారిని తామకు కూడా పట్టించుకోవడం లేదంటున్నారు కొంత మంది అధికారులు. మొత్తంగా వేమన ఇండ్లు గ్రామం తిరుపతి ప్రాంతంలో వింత గ్రామంగా గుర్తింపు తెచ్చుకుంది.
Read Also: హైదరాబాద్ నుంచి నేరుగా హిల్ స్టేషన్స్ కు తీసుకెళ్లే రైళ్లు ఇవే.. ఘాట్ రోడ్డులో వెళ్లక్కర్లేదు!