Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న జగపతిబాబు(Jagapathi Babu) తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా విలన్(Vallain) పాత్రలలో నటిస్తూ ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఈయన హీరోగా కంటే కూడా విలన్ పాత్రలలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా ఉన్న జగపతిబాబు త్వరలోనే బుల్లితెర పైకి కూడా రాబోతున్న విషయం తెలిసిందే. జీ తెలుగులో ఈయన జయమ్ము.. నిశ్చయమ్మురా (Jayammu Nischayammu Raa)అనే షో ద్వారా రాబోతున్నట్లు ఇదివరకు ఒక ప్రోమో విడుదల చేశారు.
జయమ్ము.. నిశ్చయమ్మురా…
ఇలా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కాబోతున్న నేపథ్యంలో జగపతిబాబు సోషల్ మీడియా వేదికగా మరొక వీడియోని అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా జగపతిబాబు ఈ వీడియోలో “హాయ్ బాగున్నారా.. అని నేను అడగను బాగుంటేనే మీరు నా వీడియోలు చూస్తారు అంటూ ఎప్పటిలాగే తనదైన శైలిలోనే మాట్లాడారు. ఇక సోషల్ మీడియాలో ఈయన చేసే పోస్టులకు వచ్చే రెస్పాన్స్ గురించి కూడా ఈ సందర్భంగా తెలియజేశారు చాలామంది మంచి కామెంట్స్ చేస్తున్నారని నేను నాకు ఫ్రీగా ఉన్నప్పుడు వాటిని చదువుతున్నానని తెలిపారు”.
కాంట్రవర్సీలు వద్దు..
“ఇక ఆ కామెంట్లకు రిప్లై ఇవ్వాలని అనుకుంటున్నాను కాకపోతే ఇవ్వలేకపోతున్నా. ఎందుకంటే మనకు కనెక్షన్ కుదరలేదు.. ఈ కనెక్షన్ కుదిరించడానికి ఒక ప్రోగ్రాం చేయాలని అనుకుంటున్నాను”. “మీరు ఏ ప్రశ్న అడగొచ్చు.. మీరు మంచోళ్ళు కాబట్టి మంచి ప్రశ్నలే అడుగుతారు.. ఇలా అంటున్నానంటే తప్పించుకోవడానికి కాదు.. కాంట్రవర్సీలు వద్దు.. పిచ్చి నా కొడుకులు కాంట్రవర్సీలు చేయడానికి రెడీగా ఉంటారు.. ఇలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే మీరు మంచి ప్రశ్నలు అడగండి. ప్రొఫెషనల్ గా కాకుండా పర్సనల్ క్వశ్చన్స్ కూడా అడగచ్చని మీరు ఏమి అడిగినా నేను సమాధానం చెబుతానని” తెలిపారు.
?igsh=MXhsY2ZjazBqd2d5dQ%3D%3D
ఇలా ఈ ప్రశ్నలు కేవలం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదండి జపాన్ వాళ్లకు కూడా వర్తిస్తుందని తెలిపారు. ఇక జపాన్ లో కూడా జగపతిబాబుకు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగపతిబాబు ఈ షో ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అతి త్వరలోనే ఈ కార్యక్రమం జీ తెలుగులో ప్రసారం కాబోతుందని త్వరలోనే ప్రసార తేదీ కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. జగపతిబాబు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలలో కీలక పాత్రలలోను అలాగే విలన్ పాత్రలలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు.
Also Read: Madhavan: ఇక పై అలాంటి సినిమాలు చేయలేనేమో.. ఏజ్ అయిపోయిందని గ్రహించారా?