E-Paper
Advertisement

పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!

పాత ఫ్యాన్లతో విసిగిపోయారా? ఈ ‘స్మార్ట్’ ఫ్యాన్లకు మారండి.. LED స్క్రీన్, రిమోట్ కంట్రోల్!
Advertisement

Atomberg Fans: ప్రస్తుత రోజుల్లో మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రతీది స్మార్ట్ గా మారిపోతున్నాయి. ఈ క్రమంలోనే సంప్రదాయ ఫ్యాన్ల స్థానంలో అత్యాధునిక బీఎల్‌డీసీ (BLDC) టెక్నాలజీతో పనిచేసే స్మార్ట్ ఫ్యాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ టెక్నాలజీ ఫ్యాన్లను చాలా కంపెనీలు లాంచ్ చేసినప్పటికీ.. నాణ్యత పరంగా అటాంబర్గ్ కంపెనీ మంచి గుడ్ విల్ సాధించింది. తక్కువ విద్యుత్ వినియోగం, స్టెబిలైజర్ అవసరం లేని పనితీరు, మోడ్రన్ లుక్ వంటి ప్రత్యేకతలే దీనికి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో దూసుకుపోతున్న కొన్ని అటాంబర్గ్ మోడల్స్, వాటి విశేషాలపై ఒక ప్రత్యేక కథనం.

అటాంబర్గ్ రెనెసా ఎంజెల్ (Renesa Enzel)

ఇంటికి లగ్జరీ లుక్ ఇవ్వాలనుకుంటే 1200mm సైజులో లభించే ‘గ్లాస్ వైట్’ మోడల్ లేదా 1400mm సైజులో వచ్చే ‘హనీ మేపుల్‌వుడ్’ వేరియంట్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. 5-స్టార్ రేటింగ్‌తో వచ్చే ఈ ఫ్యాన్లలో ‘అడ్వాన్స్డ్ ఎయిర్+’ టెక్నాలజీ ఉంది. ఇది గది అంతటా సమానంగా గాలిని అందిస్తుంది. ఇందులో ఉండే ఎల్ఈడీ స్పీడ్ ఇండికేటర్, రిమోట్ కంట్రోల్ ఫీచర్లు, తక్కువ శబ్దం వంటి ఫీచర్లు దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు. ఈ ఫ్యాన్ పై 3 ఏళ్ల వారంటీని కూడా కంపెనీ అందిస్తోంది.

అటాంబర్గ్ ఎఫిషియో ఆల్ఫా (Efficio Alpha)

Advertisement

గ్లాస్ బ్లాక్ కలర్‌లో లభించే 1200mm ‘ఎఫిషియో ఆల్ఫా’ మోడల్.. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ విద్యుత్ ఆదా చేయాలనుకునే వారికి సరిగ్గా సరిపోతుంది. BEE 5 స్టార్ రేటింగ్ పొందిన ఈ ఫ్యాన్.. పెద్ద ఎత్తున గాలిని (High Air Delivery) ఇస్తూనే కరెంట్ బిల్లును సగానికి పైగా తగ్గిస్తుందని కంపెనీ చెబుతోంది. రిమోట్ కంట్రోల్, ఎల్ఈడీ ఇండికేటర్లతో వచ్చే ఈ మోడల్‌పై 2 సంవత్సరాల వారంటీ కూడా అందుబాటులో ఉంది.

అటాంబర్గ్ అమేజా (Ameza)

ఈ ‘అటాంబర్గ్ అమేజా గ్లాస్ వైట్’ మోడల్ ను రిమోట్ తోనే కంట్రోల్ చేయవచ్చు. ఈ బీఎల్‌డీసీ ఫ్యాన్ సూపర్ స్పీడ్ తో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గాలిని అందిస్తుందని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. కొత్తగా నిర్మించిన లగ్జరీ ఇళ్లకు ఈ ఫ్యాన్ డిజైన్ రిచ్ లుక్ ను తీసుకొస్తుందని చెప్పవచ్చు.

అటాంబర్గ్ ఎరికా నువో (Erica Nuvo)

Advertisement

ఇంటి అందాన్ని రెట్టింపు చేయాలనుకునే వారి కోసం ‘ఎరికా నువో లోటస్ పింక్’ 1200mm మోడల్ కూడా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఇదొక అవార్డు విన్నింగ్ డిజైనర్ ఫ్యాన్ కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆకర్షణీయమైన ఎలిగెంట్ ట్రిమ్స్, సైలెంట్ పనితీరు, 5-స్టార్ ఎనర్జీ రేటింగ్, 3 ఏళ్ల వారంటీతో వస్తున్న ఈ ఫ్యాన్.. ప్రీమియం లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

Also Read: ఏసీ కొనే బడ్జెట్ లేదా? ఉక్కపోతకు చుక్కలు చూపించే.. టాప్-5 కూలర్లు ఇవే!

65 శాతం విద్యుత్ ఆదా..

సాధారణ ఫ్యాన్లు 75 వాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తే.. అటాంబర్గ్ బీఎల్‌డీసీ ఫ్యాన్లు కేవలం 28 నుండి 35 వాట్లను మాత్రమే వాడుకుంటున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే దాదాపు 65% వరకు కరెంట్ బిల్లు ఆదా అవుతుందని చెప్పవచ్చు. రిమోట్ ద్వారా స్మార్ట్ కంట్రోల్స్, ఎక్కువ రోజుల వారంటీ ఉండటంతో ప్రస్తుతం చాలా మంది యూజర్లు.. తమ ఇళ్లల్లో ఆటోంబర్గ్ ఫ్యాన్లకు పెద్ద పీట వేస్తునట్లు స్పష్టమవుతోంది.

Also Read: Bandla Ganesh : నిజంగా బండ్లన్న పవన్ భక్తుడే.. నిరంజన్ కుటుంబానికి భారీ ఆర్థిక సాయం..

Related News

ఫోన్ బ్యాటరీని సైలెంట్‌గా ఖాళీ చేస్తున్న 5G.. ఈ ఒక్క సెట్టింగ్ మారిస్తే.. మైండ్ బ్లోయింగ్ రిజల్ట్!

ఇంతవరకు ఏ ఇయర్‌బడ్స్‌లోనూ లేని ఫీచర్లు..లుక్ చూస్తే మైండ్ బ్లాకే!

తడిసిన ఇయర్‌బడ్స్‌ను ఎలా కాపాడుకోవాలి? ఈ తప్పులు అస్సలు చేయకండి!

మీ స్మార్ట్‌ఫోన్ కొత్తదా లేక వాడిందా? ఈ చిన్న ట్రిక్స్‌తో..2 నిమిషాల్లో కనిపెట్టండి!

ఫిలిప్స్, షావోమీ, నోవా.. రూ. 1,500 లోపు ఏ ట్రిమ్మర్ కొంటే బెటర్?

ఇండిపెండెన్స్ డే ధమాకా సేల్స్..ఐఫోన్లు,వన్‌ప్లస్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు!

వైఫై రూటర్ మీద యాంటెనాలు దేనికోసమో తెలుసా? ఇప్పటివరకు మీకు ఎవ్వరూ చెప్పని షాకింగ్ ఫ్యాక్ట్స్!

మార్కెట్లోకి All-in-One మిక్సీ.. 1 మిషన్, 10 రకాల పనులు.. హెవీ డ్యూటీకి కేరాఫ్!

Big Stories

Advertisement
×