BigTV English

Pawan Vs Allu Arjun: మళ్లీ పవన్ తో సై అంటున్న అల్లు కాంపౌండ్.. ఈసారి ఏమైందంటే?

Pawan Vs Allu Arjun: మళ్లీ పవన్ తో సై అంటున్న అల్లు కాంపౌండ్.. ఈసారి ఏమైందంటే?

Pawan Vs Allu Arjun: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ని దెబ్బ కొట్టడానికి అల్లు అరవింద్ (Allu Aravindh) ప్లాన్ రెడీ చేశారా..? సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ చేస్తున్న పోస్టుల వెనుక ఉన్న అర్థం ఏంటి..? పడుకున్న సింహాన్ని గిచ్చి మరీ లేపుతున్నారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. ఒకప్పుడు పాలు నీళ్ళలా కలిసి ఉండే మెగా అల్లు (Mega-Allu) ఫ్యామిలీ మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. రోజు రోజుకి వివాదాలు ముదురుతున్నాయి. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు వీరి మధ్య ఎంతో మంచి అనుబంధం కొనసాగింది. కానీ పిల్లలు పెద్దయ్యే కొద్దీ రెండు ఫ్యామిలీల మధ్య గొడవలు పెరిగి పోతున్నాయి.


మళ్ళీ మొదలైన వార్..

అలా రామ్ చరణ్, అల్లు అర్జున్ (Ram Charan- Allu Arjun) మధ్య ప్రత్యేక పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఏపీలో ఎలక్షన్స్ టైంలో తన ఫ్రెండ్ వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడంతో ఈ గొడవలు స్టార్ట్ అయ్యాయి. అలా పుష్ప -2(Pushpa-2) సినిమా రిలీజ్ సమయంలో మెగా అభిమానులు అందరూ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తాం అన్నట్లుగా సవాల్ విసిరారు. కానీ మెగా అభిమానులే స్వయంగా థియేటర్ కి వెళ్లి చూసేంత భారీ హిట్ అయింది పుష్ప-2.


పవన్ కళ్యాణ్ తో పోటీకి సిద్ధం అంటున్న అల్లు అరవింద్..

ఇదిలా ఉంటే తాజాగా పవన్ కళ్యాణ్ కి అల్లు అరవింద్ మరో షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ హీరోగా, జ్యోతి కృష్ణ (Jyothi Krishna) డైరెక్షన్లో తెరకెక్కిన హరిహర వీరమల్లు సినిమా పలుమార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకి ప్రమోషన్స్ కూడా మొదలెట్టేశారు. అయితే ఎన్నోసార్లు వాయిదా పడుతూ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.

మెగా ఫ్యాన్స్ కి అల్లు అరవింద్ షాక్..

కానీ ఇలాంటి సమయంలోనే భారీ షాకిచ్చారు అల్లు అరవింద్ (Allu Aravind). అదేంటంటే.. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్లో ఒక భారీ సినిమాని పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా రిలీజ్ చేయబోతున్నారట. కన్నడలో ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి హోంబలే ఫిలిం (Homebale Films) నిర్మించిన ‘మహావతార్ నరసింహ’ అనే మూవీని ఏకకాలంలో తెలుగు, తమిళ,కన్నడ,హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాని తెలుగులో గీత ఆర్ట్స్ ప్రొడక్షన్స్(Geeta Arts Production) డిస్ట్రిబ్యూషన్ చేయడం ఇండస్ట్రీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఒక్క రోజు వ్యవధిలో నువ్వా నేనా..?

అయితే ఈ సినిమా హరిహర వీరమల్లు సినిమాకి పోటీగా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే హరిహర వీరమల్లు మూవీ జూలై 24న విడుదలైతే మహావతార్ నరసింహ మూవీ జూలై 25న అంటే ఒకరోజు వ్యవధిలో రెండు పెద్ద సినిమాలు విడుదల కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద షాక్ తగిలినట్టు అయింది. అయితే ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ అల్లు అరవింద్ కావాలనే ఈ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ మీద ఉన్న పగతోనే ఇలాంటి పని చేస్తున్నారంటూ ఏకి పారేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మరోసారి అల్లు మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియాలో వార్ మొదలైంది. మహావిష్ణు అవతారం అయినటువంటి 10 అవతారాల్లో ఒకటైన నరసింహ అవతారం పురాణ కథ బేస్ చేసుకుని త్రీడీ యానిమేషన్లో మహావతార్ నరసింహ(Mahavatar Narasimha) మూవీ రాబోతుంది.

ALSO READ:Pawan Kalyan : కోటా చివరి సినిమా పవన్‌తోనే… పారితోషకం ఎంత ఇచ్చారంటే ?

Related News

Tollywood: బడా చిత్రాలకు దేవుడే అడ్డమా.. ఇదెక్కడి విడ్డూరం!

Mrunal Thakur: మృణాల్ నోటిదూల.. ఈసారి విరాట్ భార్యనే ..?

SSMB 29: మహేష్ బాబు మూవీ సెట్ నుండి సీన్ లీక్ .. గూస్ బంప్స్ గ్యారెంటీ!

Ghaati: ఘాటీ సినిమాపై ఈగల్ టీమ్ అభ్యంతరం

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Big Stories

×