BigTV English

Ysrcp: వివాదాస్పద వ్యాఖ్యలు.. న్యాయస్థానానికి పేర్నినాని

Ysrcp: వివాదాస్పద వ్యాఖ్యలు.. న్యాయస్థానానికి పేర్నినాని

Ysrcp: కోరి కష్టాలు తెచ్చుకోవడమంటే ఇదేనేమో..? తనపై వరుసగా కేసులు నమోదు కావడంతో బెంబేలెత్తుతున్నారు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని. కేసుల నుంచి బయటపడేందుకు చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇంతకీ అసలేం జరిగింది? నాని ఎందుకు భయపడ్డారు? కేవలం కార్యకర్తలను రెచ్చగొట్టాలని భావించి చిక్కుల్లో పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


వైసీపీ అధినేత జగన్ తర్వాత వార్తల్లోకి వస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని. అధినేత స్టయిల్‌లో మాటలు ఆడుతూ కార్యకర్తలను ఉత్సాహ పరిచే ప్రయత్నం చేశారు.. చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో మరిన్ని చిక్కులు ఎదురవుతున్నాయి. పేర్ని నానిపై వరుసగా నమోదవుతున్న కేసులు ఆయన బెంబేలెత్తుతున్నారు.

ఈ కేసుల నుంచి బయటపడేందుకు హైకోర్టుకి వెళ్తున్నారు. జూన్ 12న పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదు అయ్యింది. మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన, పాముర్రు, పార్టీ కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్‌బుక్ కు దీటుగా ‘రప్పా రప్పా’ అంటే వాళ్లకు మనకు తేడా ఏముంటుందని, చీకట్లో కన్ను కొడితే పనులు అయిపోవాలన్నారు.


జగన్ 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని చెప్పారు. అప్పటి వరకు రప్పా రప్పా బంద్ చేయాలన్నారు. చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా? మన జోలికి వచ్చిన వాళ్ల పేర్లు రాసి పెట్టుకోండంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాటలతో కార్యకర్తలు బాగానే ఉత్సాహ పరిచాయి. ఆ తర్వాత ఆయనలో ఉత్సాహం తగ్గిపోయింది.

ALSO READ: రీకాలింగ్ మేనిఫెస్టో.. జగన్ సాధించిందేంటి?

ఎందుకంటే నాని వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రేపో మాపో మాజీ మంత్రిని అరెస్టు చేస్తారని వార్తల నేపథ్యంలో నేరుగా హైకోర్టుని ఆశ్రయించారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని నమోదైన కేసు కొట్టేయాలంటూ ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు.

రేపో మాపో న్యాయస్థానం ఆ పిటిషన్‌పై విచారణ జరపనుంది. మాజీమంత్రి పేర్ని నానికి ఇలాంటి సమస్య ఎదురైతే మన పరిస్థితి ఏంటంటూ వైసీపీలోని ఓ వర్గం అప్పుడు చర్చించుకోవడం మొదలైంది. ఆయనకు పార్టీ నుంచి అండదండలు ఉంటాయని మన పరిస్థితి ఏంటంటూ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

వైసీపీలో జరుగుతున్న పరిణామాలను కార్యకర్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీకి దూరంగా ఉండటమే బెటరని అంటున్నారు. వైసీపీలో ఇప్పటికే చాలామందిపై కేసులు నమోదు అయ్యాయని, ఒకొక్కర్ని అరెస్టు చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×