Vijay Deverakonda :సౌత్ సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ హీరోలలో యూత్ లో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda). అయితే ఇప్పుడు ఈయన ఒక వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళ నటుడు సూర్య (Suriya ) నటించిన ‘రెట్రో’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఈయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించే సందర్భంలో విజయ్ మాట్లాడుతూ..”పాతకాలంలో గిరిజన తెగలు ఎలా పరస్పరం యుద్ధాలు చేసుకుంటున్నాయో.. ఇప్పుడు ఇండియా – పాకిస్తాన్ దేశాల మధ్య అలాగే యుద్ధం జరుగుతోందని” వ్యాఖ్యానించడం పెద్ద సమస్యగా మారింది.
క్షమాపణలు చెప్పిన విజయ్ దేవరకొండ..
ఇక ఈ విషయాలు ఆదివాసీలకు ఆగ్రహాన్ని తెప్పించాయి. మనోభావాలను దెబ్బ తీశాయని , గిరిజన సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. తన మాటలపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించి క్షమాపణలు చెప్పారు విజయ్ దేవరకొండ. “పురాతన కాలాల్లో కొన్ని తెగల మధ్య జరిగిన సంఘర్షణలు ఉద్దేశించి వచ్చిన మాటలని, షెడ్యూల్డ్ లను ఉద్దేశించి, తాను మాట్లాడలేదని”వివరణ ఇచ్చినా ఆయన పై మాత్రం ఇప్పుడు కేసు నమోదవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేస్ ఫైల్..
రెండు రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంలోని పలు సెక్షన్ల కింద హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో విజయ్ దేవరకొండ పై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నిర్మాత..
ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ తీరుపై ప్రముఖ ప్రొడ్యూసర్, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నట్టి కుమార్ (Natti Kumar)ఊహించని కామెంట్లు చేశారు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నట్టి కుమార్ మాట్లాడుతూ..”నువ్వేమైనా సెలబ్రిటీ అనుకుంటున్నావా.. తీసుకెళ్లి జైల్లో పడేస్తారు” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. నట్టి కుమార్ మాట్లాడుతూ..” విజయ్ దేవరకొండ ఇలా విమర్శలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు ‘లైగర్’ ఈవెంట్ లో కూడా నా తల్లి ఎవరో తెలియదు.. తండ్రి ఎవరో తెలియదు.. ఇక్కడికి ఎంతో మంది వచ్చారు అంటూ మాట్లాడారు. ముఖ్యంగా ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నామనే స్పృహ కచ్చితంగా ఉండాలి. తనకు తాను తెలంగాణకు పెద్ద హీరో అనుకుంటున్నాడు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్లను ఇబ్బంది పెట్టకూడదు. ఎదుటి కులాలను, మతాలను కించపరచకూడదు అని తెలుసుకోవాలి.
విజయ్ దేవరకొండ క్షమాపణలు చెప్పాలి -నట్టి కుమార్
ఏఎన్ఆర్, ఎన్టీఆర్, సావిత్రి , కృష్ణ, కృష్ణంరాజు, సూర్యకాంతం ఇలా ఎంతోమంది నేడు మన మధ్య లేకపోయినా.. వారిని మనం తలుచుకుంటున్నాము అంటే వారి స్టార్డం మాత్రమే కాదు.. వారి విధేయత అలాంటిది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో చిరంజీవి, రామ్ చరణ్ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండాలని. ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు కాబట్టి ఆ రేంజ్ లో ప్రవర్తిస్తున్నాడు. వెంటనే విజయ్ దేవరకొండ క్షమాపణ చెప్పాలి..” అంటూ నట్టి కుమార్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ALSO READ:Samantha : విడాకుల తర్వాత సమంతను తొక్కేస్తున్నారా ? ఇక బుట్ట సర్దే టైం వచ్చిందా ?