Samantha :సమంత (Samantha) రీసెంట్ గానే శుభం మూవీ(Shubham Movie) తో నిర్మాతగా సక్సెస్ అయింది.ఈ సినిమా హిట్టవ్వడంతో సమంత మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో సమంత గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే సమంతని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నట్టు ఇండస్ట్రీ ఇన్సైడ్ వర్గాల్లో కొంతమంది మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆ సిరీస్ ఆగిపోవడమే. మరి ఇంతకీ సమంత నటించిన ఏ సిరీస్ ఆగిపోయింది? నిజంగానే సమంతని ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారా? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సమంత వెబ్ సిరీస్ ఆగిపోయిందా..
సమంత ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం(Ma Inti Bangaram) అనే సినిమాని టాలీవుడ్ లో చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో రాజ్-డీకే(Raj-DK) నిర్మాతలుగా ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. అయితే ఈ వెబ్ సిరీస్ గురించి తాజాగా బాలీవుడ్ లో ఒక షాకింగ్ వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ షూటింగ్ ఆగిపోయిందట. దానికి కారణం ఏంటంటే..గత కొద్ది రోజులు ముందు రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భారీ మొత్తంలో స్కామ్ చేసి డబ్బులన్ని వెనకేసుకున్నాడని,25 రోజుల షూటింగ్ కే దాదాపు సగానికి పైగా బడ్జెట్ ఖర్చు పెట్టాడని ఓ ఆడిట్ ద్వారా ఈ విషయం బయట పడ్డ సంగతి మనకు తెలిసిందే.
ఉన్న బడ్జెట్లో వెబ్ సిరీస్ తీయడం సాధ్యపడుతుందా?
ఇక ఈ విషయం ఆడిట్ ద్వారా బయటపడ్డాక సిరీస్ షూటింగ్ ఆగిపోయినట్టు కూడా వార్తలు వినిపించాయి. అకౌంటింగ్ లో అవకతవకలు చేయడంతో ఆ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ని ఈ సిరీస్ నుండి తీసివేసినట్టు కూడా వార్తలు వినిపించాయి. అయితే మళ్లీ తిరిగి సిరీస్ ని తెరకెక్కించాలి అని మిగిలిన బడ్జెట్ తో తీద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ (Netflix) వాళ్ళు ఒప్పుకోవడం లేదట. ఈ తక్కువ బడ్జెట్ తో మిగిలిన సిరీస్ షూటింగ్ పూర్తి చేయడం అంత సులభమేమీ కాదని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా పక్కన పెట్టేసారట.
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన రక్త్ బ్రహ్మాండ్ యూనిట్..
దీంతో రక్త్ బ్రహ్మండ్ (Rakt Brahmand) సిరీస్ షూటింగ్ ఆగిపోయినట్టు తెలుస్తోంది. కానీ ఈ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్లు అయినటువంటి రాజ్ అండ్ డీకే మాత్రం సిరీస్ షూటింగ్ ఆగిపోలేదని అవన్నీ పుకార్లే అంటూ కొట్టి పారేస్తున్నారు. కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం రక్త్ బ్రాహ్మండ్ షూటింగ్ ఆగిపోయిందని మాట్లాడుకుంటున్నారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ విషయం నెట్టింట వైరల్ గా మారడంతో సమంత అభిమానులు (Samantha Fans) నిరాశపడుతున్నారు.
సమంతను కావాలనే తొక్కేస్తున్నారా?
దీనికి తోడు సమంతకు ఇటు సౌత్ లో కూడా ఒక్క దర్శకుడు కూడా అవకాశం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక దీన్ని బట్టి చూస్తే సమంతని కావాలనే తొక్కేస్తున్నారని, విడాకులు అయ్యాక సమంతకి ఏ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు రాకుండా ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయేలా ఆమెపై కుట్రలు చేస్తున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విడాకుల తర్వాత భారీగా తగ్గిపోయిన అవకాశాలు..
అయితే పెళ్లికి ముందు సమంత స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అలాగే అక్కినేని ఫ్యామిలీ (Akkineni Family)కి కోడలు అయ్యాక ఆమె ఇమేజ్ మరింత పెరిగి మరిన్ని అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఎప్పుడైతే సమంత నాగ చైతన్య (Naga Chaitanya) విడాకులు తీసుకుందో అప్పటినుండి ఆమెను తొక్కిస్తున్నారంటూ మాట్లాడుకుంటున్నారు.. అయితే ఫ్యాన్స్ ఆవేదన వెనక కూడా అర్థం ఉంది. ఎందుకంటే ఒకప్పుడు బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉన్న సమంతకి ప్రస్తుతం అవకాశాలు లేకపోవడాన్ని ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇక మరి కొంతమందేమో విడాకుల తర్వాతే ఈమెకు అవకాశాలు తగ్గిపోయాయి.. ఇక బుట్ట సర్దే సమయం వచ్చింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Kannappa Tickets : ఒక్క టికెట్ ధర మరీ ఇంతేంటి సామి.. మీరేమైనా అవతార్ పార్ట్ 4 చేశారా ?