BigTV English

Reduce cholesterol: శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి సింపుల్ ఆయుర్వేద చిట్కాలు ఇవిగో

Reduce cholesterol:  శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించడానికి సింపుల్ ఆయుర్వేద చిట్కాలు ఇవిగో

తెలియకుండానే అధిక కొలెస్ట్రాల్ బారిన పడుతున్నవారు ఎంతోమంది. కొలెస్ట్రాల్ ఉన్నవారే లావుగా ఉంటారని చాలామంది అనుకుంటారు. నిజానికి సన్నగా ఉన్న వారిలో కూడా కొలెస్ట్రాల్ అధికంగా ఉండే అవకాశం ఉంది. జీవితంలో ఒత్తిడి పెరిగిపోవడం, చెడు ఆహారపు అలవాట్లు కారణంగా అధిక కొలెస్ట్రాల్ పెద్ద సమస్యగా మారుతుంది. ఇందులో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసం మీరు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరిపోతుంది.


పసుపు
మీరు తినే ఆహారంలో పసుపును ప్రతిరోజు ఉండేలా చూసుకోండి. పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నిండుగా ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. దీన్ని ప్రతిరోజు ఉదయం తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల శరీరంలో ఉన్న కొలస్ట్రాల్ కరిగిపోయే అవకాశాలు ఎక్కువ.

ఉసిరి జ్యూస్
ఉసిరికాయలను ఇండియన్ గూస్బెర్రీ అని పిలుస్తారు. అలాగే ఆమ్లా అని కూడా అంటారు. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో జోరుగా పనిచేస్తాయి. ప్రతిరోజు ఉసిరికాయ రసాన్ని నీటిలో కలుపుకొని ఉదయం పూట తాగితే కొన్ని రోజులకే కొలెస్ట్రాల్ కరిగిపోయే అవకాశం ఉంది.


మెంతులు
మెంతులు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి. ఆయుర్వేదంలో మెంతులను ఔషధంగానే భావిస్తారు. మెంతులు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తమ వంతుగా సహాయపడతాయి. ఇందుకోసం మీరు ముందు రోజు రాత్రి ఒక గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులు వేసి నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ పొట్టతో విత్తనాలతో పాటు ఆ నీటిని తాగేయండి. ఎంతటి కొలెస్ట్రాల్ అయినా కరిగిపోవడం మొదలవుతుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు ఎన్నో. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఆయుర్వేదంలో వెల్లుల్లిని ఔషధంగానే వినియోగిస్తారు. దీనిలో కొలెస్ట్రాల్ ను తగ్గించే లక్షణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. వెల్లుల్లి రెబ్బను తీసుకొని బాగా దంచి చూర్ణం చేసి మింగేయండి. ఖాళీ పొట్టతో ప్రతిరోజు ఉదయం ఇలా తినడం వల్ల చాలా వరకు కొలెస్ట్రాల్ కరిగే అవకాశాలు ఉన్నాయి.

ధనియాలు
ధనియాలలో కూడా ఔషధ లక్షణాలు ఎక్కువ. వీటిని కొత్తిమీర గింజలు అని కూడా పిలుచుకుంటారు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం ముందు రోజు రాత్రి మీరు ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ధనియాలను వేసి బాగా నానబెట్టాలి. వాటిని ఉదయాన్నే లేచి ఖాళీ పొట్టతో తాగేయాలి. ధనియాలను కూడా నమిలి మింగేయాలి.

త్రిఫల చూర్ణం
ప్రతి ఆయుర్వేద షాపులో త్రిఫల చూర్ణం దొరుకుతుంది. ఇది ఒక సాంప్రదాయక ఆయుర్వేద మూలిక ఫార్ములా. ఇందులో మూడు రకాల ఉత్పత్తులు ఉంటాయి. అమలకి, భిభితకి, హరితకి… ఈ మూడు కలిపి పొడిలా చేస్తారు. దాన్నే త్రిఫల పొడి అంటారు. ప్రతిరోజు ఉదయం లేదా నిద్ర వేళకు ముందు గోరువెచ్చని నీటిలో ఈ త్రిఫల పొడిని వేసుకొని తాగితే కొలెస్ట్రాల్ కరిగే అవకాశాలు ఎక్కువ.

Related News

Home remedies: రాత్రి దిండు కింద పెట్టే సింపుల్ హోమ్ రెమిడీ.. ఇలా చేస్తే..

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Big Stories

×