Decoit: విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యంగ్ హీరోలలో ఒకరు అడివి శేష్ (Adivi Sesh). ఈ హీరో నుంచి సినిమా వస్తోందంటే చాలు కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఇటు ఆడియన్స్ లో కూడా పెరిగిపోయింది. అందుకే ఈయన నుంచి వచ్చే సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ వచ్చిన అడివి శేష్.. కాలక్రమేనా దర్శకుడిగా, రైటర్గా హీరోగా స్థిర పడిపోయారు. చేసింది కొన్ని సినిమాలు అయినా ఆ సినిమాలతో విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు.
డెకాయిట్ నుంచి తప్పుకున్న శృతిహాసన్..
ఇదిలా ఉండగా తాజాగా ఈయన నటిస్తున్న చిత్రం డెకాయిట్ (Decoit). అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ (Supriya yarlagadda) ఈ సినిమాను నిర్మిస్తూ ఉండగా.. సునీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనురాగ్ తో పాటు కామాక్షి భాస్కర్ల, జయిన్ మారి ఖాన్, అతుల్ కులకర్ణి, ప్రకాష్ రాజ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మొదట ప్రముఖ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ (Shruti Haasan)హీరోయిన్గా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే అనివార్య కారణాలవల్ల ఆమె తప్పుకోవడంతో ‘సీతారామం’ సినిమాతో హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న మృణాల్ ఠాగూర్ (Mrunhal Thakur) ను హీరోయిన్ గా తీసుకున్నారు. దీనికి తోడు ఇటీవల విడుదలైన గ్లింప్స్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
శృతిహాసన్ తప్పుకోవడంపై అడివి శేష్ కామెంట్..
ఇకపోతే ఈ సినిమా నుండి శృతిహాసన్ తప్పుకోవడంతో అందరూ పలురకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది? ఆమె తప్పుకుందా? లేక తప్పించారా? అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా అడివి శేష్ స్పందించారు. ఇటీవల ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..” మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఇద్దరి మధ్య వర్కింగ్ స్టైల్ కుదరకపోవడం వల్లే ఆమెను తప్పించాము. ఇక ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కూలీ సినిమాలో ఆమె నటిస్తుండడం కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడానికి ఒక కారణమని చెప్పాలి. ఎందుకంటే ఒక సినిమా చేయాలి అంటే నాకు చాలా సమయం పడుతుంది. మధ్యలో నాకు సింక్ అవ్వాలి. అటు మృణాల్ కూడా స్క్రిప్ట్ చెప్పిన వెంటనే హీరోయిన్గా ఈ ప్రాజెక్టుకి ఒకే చెప్పారు” అంటూ అడివి శేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే రజనీకాంత్ సినిమా వల్ల, ఇటు అడివి శేష్ తో టైం సింక్ అవ్వకపోవడం వల్లే శృతిహాసన్ తప్పుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక శృతిహాసన్ ప్రస్తుతం రజనీకాంత్ కూలీ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్టుల ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ALSO READ:Mohan Lal: త్వరలో మరో స్టార్ కిడ్ తెరంగేట్రం.. పూర్తి వివరాలివే!