Illu Illalu Pillalu Today Episode july 2nd: నిన్నటి ఎపిసోడ్ లో.. రాత్రి అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. ఇంకా ధీరజ్ రాలేదని వెయిట్ చేస్తూ ఉంటుంది. రామరాజు సార్ గారు ఇంకా రాలేదా ఏంటి అని అడుగుతాడు. మరి మా నాన్న వాడు ఏదో ఒక జాబ్ చేసుకుంటాను అని అన్నారు కదా మీకు ఎందుకండి మధ్యలో అని వేదవతి అంటుంది. చందు ఫోన్ చేసి ధీరజ్ ని అడుగుతాడు.. చందు ధీరజ్ ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. వాడేదో డ్యూటీలో ఉన్నాడంట నాన్న అందుకే రాలేకపోయాడంట అని చందు అంటాడు.. సరేగాని డ్యూటీ అంటున్నాడు మరి తిన్నాడా లేదా కనుక్కోవచ్చు కదా అని చందు పై సీరియస్ అవుతాడు రామరాజు. కొడుకు మీద కోపమే కానీ మనసులో మాత్రం కొడుకు కంటే ఎంత ప్రేమ అని వేదవతి అంటుంది.. అయితే సాగర్ నర్మదా మాత్రం ధీరజు కార్ డ్రైవింగ్ కోసం వెళ్ళాడేమో అని మాట్లాడుకుంటూ ఉంటారు. అది విన్న శ్రీవల్లి మావయ్య గారు అండి నర్మదా సాగర్ మరిదికి ఈ విషయం తెలుసనుకుంటానండి అని ఇరికించేస్తుంది.. ప్రేమ ఏదీ తప్పు చేయకుండా వేదవతి మాట తీసుకుంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ అర్ధరాత్రి కు వచ్చి ఓపిక లేక పడుకుంటాడు. ధీరజ్ అలా పడుకోవడం చూసి ప్రేమ బాధపడుతుంది. ఈ దెబ్బ తగలడంతో ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆ కాలికి మందు వేస్తుంది. ఆ తర్వాత ధీరజ్ కు తన వల్లే ఇన్ని కష్టాలు వచ్చాయని బాధపడుతుంది. ధీరజ్ కి ఏదైనా సాయంగా చేయాలని ప్రేమ నిర్ణయించుకుంటుంది. అటు నర్మదా సాగర్ కోసం తెచ్చిన బుక్స్ ని ఇచ్చి చదువుకోమని చెప్తుంది. సాగర్ మాత్రం గట్టిగా అరుస్తూ చదువుతాడు. రాత్రి ఇలా చదివితే ఏ దయ్యాల వచ్చి చదువుతున్నాయని ముందుగా మీ నాన్న ఇక్కడికి వస్తాడు అని నర్మద అంటుంది.
నర్మద మాటలకు భయపడిన సాగర్ అయ్యో నాన్న వస్తే నేను అడ్డంగా దొరికిపోతాను కదా అని పరిగెడుతూ ఉంటాడు.. నువ్వు మెల్లగా చదువు అనేసి నర్మదా అంటుంది.. అయితే సాగర్ ఎంత చెప్పినా కూడా గట్టిగా చదువుతూ ఉండడంతో.. నర్మదా ఒక నిర్ణయం తీసుకుంటుంది. రాత్రి మనం ఇక్కడ చదివితే అందరికీ దొరికిపోతాము. ప్లేస్ కి తీసుకెళ్తాను పద అక్కడైతే నువ్వు ఎంత చదివినా కూడా ఎవరికీ వినిపించదు అని అంటుంది. సాగర్ని తీసుకొని బయటకు వెళ్తుంది నర్మదా.. బయట కూర్చుని నర్మదా చదవమని చెప్తుంది.
నువ్వు ఇలానే చదువుకుంటూ ఉండు నేను పడుకుంటాను అని నర్మదా అనగానే సాగర్ సరే అని అంటాడు. సాగర్ చదువుతూ మధ్యలో నర్మదా నడుము చూసి డైవర్ట్ అయిపోయి చదువుని పక్కన పెట్టేసి రొమాన్స్ గురించి ఆలోచిస్తుంటాడు.. గమనించిన నర్మదా ఏంటి నువ్వు ఏం చదువుతున్నావు అని అరుస్తుంది. నేను బుక్ ఏ చదువుతున్నాను నర్మదా కానీ నేను నడుమును చూసి ఆపుకోలేకపోతున్నాను అని సాగర్ అంటాడు. అన్ని పక్కన పెట్టేసి అనేసి నర్మదా అంటుంది. ఎంత చెప్పిన సాగర్ మాట వినకపోవడంతో నర్మదా అతనికి ముద్దు పెట్టి ఇప్పటికి ఇది చాలు నువ్వు ముందు చదువు అనేసి అంటుంది.
ఇదంతా కాదు నేను ఇటు తిరిగి కూర్చుంటాను నువ్వు ఇటు తిరిగి కూర్చొని నర్మద అంటుంది. ఇద్దరూ కలిసి వెనక్కి తిరిగి కూర్చుని మాట్లాడుకుంటూ.. చదువుకుంటూ ఉంటారు. అర్ధరాత్రి నీళ్ల కోసం వంటగదికొచ్చిన శ్రీవల్లి వీళ్ళని చూసి మొదట దెయ్యాలని భయపడుతుంది. ఆ తర్వాత కళ్ళు తుడుచుకొని వీళ్లు దెయ్యాలు కాదు లేచిపోయి పెళ్లి చేసుకున్న సాగర్ నర్మద జంట అని అనుకుంటుంది.. అయితే సాగర్ బుక్కు పట్టుకుని చదవడం ఏంటి అని ఆలోచిస్తుంది. ఏదో జరుగుతుంది కచ్చితంగా అదేంటో తెలుసుకుంటాను అని శ్రీవల్లి అంటుంది..
Also Read:అక్షయ్ కు అవమానం..పల్లవికి దిమ్మతిరిగే షాకిచ్చిన అవని..
ప్రేమ ఉదయం లేవగానే ధీరజ్ నీకు గుడికి తీసుకుని వెళుతుంది. ఇంత ఉదయాన్నే నీకు ఇంత మంచి అలవాట్లు ఏంటి అని ప్రేమపై సెటైర్లు వేస్తాడు ధీరజ్. మనసేం బాగోలేదు పిచ్చిపిచ్చి ఆలోచనలు వస్తున్నాయి అందుకే గుడికి తీసుకుని వచ్చాను అని అంటుంది. నాకు డెలివరీ కి టైం అవుతుంది వెళ్దామా అని ధీరజ్ అంటాడు.. కాసేపు కూర్చుని వెళ్దామని అక్కడ కథ చెప్పే వ్యక్తిని చూసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ కథను విని ధీరజ్ కోసం ఏదైనా చేయాలి నాకోసం చాలా కష్టపడుతున్నాడని ఒక నిర్ణయం తీసుకుంటుంది. కచ్చితంగా ధీరజ్ కి మనీ సపోర్ట్ నేను ఇవ్వాలి అని అనుకుంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ప్రేమ నర్మదా వెళ్తూ ఉంటారు. అక్కడ బండి పై ఇడ్లీలు అమ్ముతున్న ఆనందరావుని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..