OTT Movie : మలయాళం సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కామెడీ జానర్ లో తెరకెక్కిన సినిమాలు, ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంది. వీటి పేర్లు, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2’ (Kerala Crime Files : Season 2)
ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కు అహమ్మద్ ఖబీర్ దర్శకత్వం వహించారు.ఇందులో అజు వర్గీస్ (సబ్-ఇన్స్పెక్టర్ మనోజ్ శ్రీధరన్), లాల్ (సర్కిల్ ఇన్స్పెక్టర్ కురియన్ అవరన్), అర్జున్ రాధాకృష్ణన్ (సబ్-ఇన్స్పెక్టర్ నోబుల్), ఇంద్రన్స్ (సిపిఓ అంబిలి రాజు), హరిశ్రీ అశోకన్, జియో బేబీ, నవాస్ వల్లిక్కున్ను, సంజు సనిచెన్, షిబ్లా ఫరా, మరియు సిరాజుద్దీన్ నజర్ ప్రధాన పాత్రలలో నటించారు. మంకీ బిజినెస్ బ్యానర్‌లో హసన్ రషీద్, అహమ్మద్ ఖబీర్, జితిన్ స్టానిస్లాస్ నిర్మించిన ఈ సిరీస్ 2025 జూన్ 20 నుంచి జియోహాట్‌స్టార్ (Jio hotstar)లో ప్రీమియర్ అయింది. ఇది మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ, బెంగాలీ, మరాఠీ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది. మొదటి సీజన్ (2023) ఒక హత్య కేసు చుట్టూ తిరిగితే, సీజన్ 2 ఒక పోలీసు అధికారి మిస్సింగ్ చుట్టూ తిరుగుతుంది. 6 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ సుమారు 30 నిమిషాలు ఉంటుంది.
‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’ (Prince And Family).
ఈ సినిమాకి బింటో స్టీఫెన్ తన దర్శకత్వం వహించారు. లిస్టిన్ స్టీఫెన్ ఈ సినిమాని మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌లో నిర్మించారు. ఇందులో దిలీప్, రానియా రానా, ధ్యాన్ శ్రీనివాసన్, సిద్ధిఖ్, బిందు పనిక్కర్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళై, జోసెకుట్టి జాకబ్ ప్రధాన పాత్రలలో నటించారు. అలాగే ఉర్వశి, వినీత్ తట్టిల్ డేవిడ్ కీలకమైన పాత్రలలో కనిపించారు. ఈ సినిమా దిలీప్ నటించిన 150వ చిత్రంగా గుర్తింపు పొందింది. 2025 మే 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2025 జూన్ 20 నుండి ZEE5లో మలయాళం, తమిళ డబ్బింగ్‌లలో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ ఎంటర్టైన్ గా ఈ సినిమా తెరకెక్కింది. బ్రైడల్ బోటిక్ యజమాని ప్రిన్స్ చక్కలక్కల్ (దిలీప్), తనకి పూర్తి భిన్న వ్యక్తిత్వం కలిగిన సోషల్ మీడియా వ్లాగర్ చిన్జు (రానియా రానా)ను వివాహం చేసుకుంటాడు. ఆతరువాత గందరగోళ పరిస్థితిలు దారితీస్తాయి.
‘లవ్లీ’ (Lovely)
మలయాళం ఫాంటసీ కామెడీ సినిమాకి దిలీష్ కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ఇందులో మాథ్యూ థామస్, శివాంగి కృష్ణకుమార్, మనోజ్ కె. జయన్ ప్రధాన పాత్రలలో నటించారు, అలాగే అశ్వతి మనోహరన్, ప్రశాంత్ మురళి, బాబురాజ్, గంగా మీరా, జోమోన్ జ్యోతిర్, అరుణ్ ప్రదీప్ సహాయక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా మలయాళ సినిమాలో మొట్టమొదటి హైబ్రిడ్ యానిమేషన్, లైవ్-యాక్షన్ 3D చిత్రంగా గుర్తింపు పొందింది. ఇది సరన్య నాయర్, డాక్టర్ అమర్ రామచంద్రన్ ల నిర్మాణంలో వెస్టర్న్ గట్స్ ప్రొడక్షన్ మరియు నెని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కింది. విష్ణు విజయ్ మరియు బిజిబాల్ సంగీతం సమకూర్చగా, ఆషిక్ అబూ సినిమాటోగ్రఫీ మరియు కిరణ్ దాస్ ఎడిటింగ్ నిర్వహించారు. 2025 మే 16 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2025 జూన్ 20 నుండి jio Hotstar ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఒక చిన్న పొరపాటు వల్ల జైలుకి వెళ్ళిన హీరోకి అక్కడ ఒక మాట్లాడే ఈగ ఎదురుపడుతుంది. ఆ తరువాత స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.
‘మహారాణి’ (Maharani)
ఈ మలయాళం కామెడీ-డ్రామా మూవీకి జి. మార్తండన్ దర్శకత్వం వహించారు. ఇందులో రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో, బాలు వర్గీస్, జానీ ఆంటోనీ, హరిశ్రీ అశోకన్, జాఫర్ ఇడుక్కి, నిషా సరంగ్, శ్రుతి జయన్, గౌరీ గోపన్ ప్రధాన పాత్రలలో నటించారు. గోవింద్ వసంత సంగీతం సమకూర్చగా, గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ 2023 నవంబర్ 24న థియేటర్లలో విడుదలైంది. 2025 జూన్ 21 నుండి మనోరమా మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది
Read Also : బొగ్గు గనిలో మనుషుల ప్రాణాలు తీసే వింత రాక్షసి… ఫ్రెంచ్ హారర్ అడ్వెంచర్ ఫాంటసీ థ్రిల్లర్