BigTV English

Manisha Koirala: రజనీకాంత్ తో సినిమా.. కట్ చేస్తే.. కెరియర్ ఫట్!

Manisha Koirala: రజనీకాంత్ తో సినిమా.. కట్ చేస్తే.. కెరియర్ ఫట్!

Manisha Koirala:మనీషా కొయిరాలా (Manisha Koirala)..ఈ పేరు చెబితే తెలియని సినీ ప్రియులు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనీషా కొయిరాలా సౌత్ నార్త్ లో గుర్తింపు పొందిన హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు సౌత్ నార్త్ లో బిజీయెస్ట్ హీరోయిన్ గా ఉండేది. ఓ దశలో సౌత్ ఇండస్ట్రీని ఏలే స్టేజ్ కి వచ్చిన ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఒకే ఒక్క సినిమాతో డౌన్ ఫాల్ అయింది.


సూపర్ స్టార్ వల్లే నా కెరియర్ నాశనం – మనీషా కొయిరాలా

అది కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించిన సినిమా కారణంగా.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)తో మనీషా కొయిరాల ఓ సినిమాలో చేసింది. ఆ సినిమా తర్వాత మనీషా కొయిరాలకి సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. దాంతో ఓ ఇంటర్వ్యూలో తన అసహనాన్ని వెళ్లగక్కింది. అంతేకాదు సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం కూడా రజినీకాంత్ పేరే చెప్పడంతో రజినీకాంత్ అభిమానులు మనిషా కొయిరాలా పై అప్పట్లో మండిపడ్డారు. మరి ఇంతకీ రజినీకాంత్ వల్ల మనీషా కొయిరాలా తన సినీ కెరియర్ ఎంత నష్ట పోయింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..


మనీషా కొయిరాలా సినిమాలు..

బొంబాయి(Bombay), ఒకే ఒక్కడు(Oke Okkadu), భారతీయుడు (Bharatheeyudu), క్రిమినల్(Criminal) వంటి సినిమాల్లో నటించి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది నటి మనీషా కొయిరాలా. అయితే అలాంటి హీరోయిన్ రజినీకాంత్ నటించిన బాబా సినిమా (Baba Movie) కారణంగా తన కెరీర్ ని కోల్పోయానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

రజనీకాంత్ నేను నమ్మి మోసపోయాను – మనీషా కొయిరాలా

మనీషా కొయిరాల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “నేను రజినీకాంత్ నటించిన బాబా సినిమాలో హీరోయిన్ గా నటించాను. అయితే ఈ సినిమాలో నా పాత్రకి అంత స్కోప్ లేక పోయినప్పటికీ కేవలం రజినీకాంత్ సరసన హీరోయిన్ అనేసరికి కళ్ళు మూసుకొని ఓకే చెప్పాను. కానీ తీరా సినిమా విడుదలయ్యాక రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విడుదలయ్యాక సౌత్ లో నాకు ఛాన్స్ లు తగ్గిపోయాయి. ఈ సినిమా కంటే ముందు నాకు సౌత్ లో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ బాబా సినిమా డిజాస్టర్ అవ్వడంతో సౌత్ లో నాకున్న క్రేజ్ మొత్తం తగ్గిపోయింది” అంటూ రజినీకాంత్ బాబా సినిమాపై తన అసహనాన్ని వెల్లగక్కింది. ఇక రజినీకాంత్ మనిషా కొయిరాల నటించిన బాబా సినిమాకి సురేష్ కృష్ణ(Suresh Krishna) దర్శకత్వం వహించగా రజినీకాంత్ స్వయంగా నిర్మించారు. ఈ సినిమా 2002లో విడుదలై డిజాస్టర్ అయింది.

మనీషా కొయిరాలా కెరియర్..

మనీషా కొయిరాలా వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె సుదీర్ఘకాలం క్యాన్సర్ వ్యాధితో పోరాడి ఒక బలమైన మహిళగా క్యాన్సర్ నుండి బయటపడి ప్రస్తుతం మళ్ళీ బాలీవుడ్లో అవకాశాలు అందుకుంటుంది. క్యాన్సర్ తో పోరాడి గెలిచిన మహిళగా మనీషా కోయిరాలను ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమంది గౌరవించారు. ఇక క్యాన్సర్ నుండి కోలుకున్నాక మనీషా కొయిరాలా బాలీవుడ్లో కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. అలా రీసెంట్గా నెట్ఫ్లిక్స్ లో వచ్చిన హీరామండి (Heeramandi) వెబ్ సిరీస్ లో మనీషా కొయిరాల మంచి పాత్రలో నటించి కంబ్యాక్ ఇచ్చింది.

ALSO READ:Tollywood: 10 ఏళ్లలోనే ఇంత మార్పా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన బన్నీ హీరోయిన్!

Related News

NTR Look : బక్కచిక్కిపోయిన తారక్… ఈ ప్రయోగాల ఫలితమేనా ఇది ?

Coolie Ticket Rates : రజనీకాంత్ కూలీ క్రేజ్… ఒక్క టికెట్ ధర రూ.4500

Mass Jathara Teaser : మాస్ జాతర టీజర్ రిలీజ్.. ఈ సారి చాలా వైల్డ్‌గానే రియాక్ట్ అయ్యాడు

Upasana Konidela : రామ్ చరణ్ తో పెళ్లికి ముందే డేటింగ్.. సీక్రెట్ రీవిల్ చేసిన ఉపాసన…

NTR vs Balayya : బాబాయ్ పక్కన లేడా ? సక్సెస్ తర్వాత తారక్ రాగం మారిందా ?

Upasana: క్లీంకారా డైలీ ఫుడ్ అదే.. లేకుంటే అంతే సంగతి అంటూ!

Big Stories

×