Fish Venkat: ఎన్టీఆర్ (NTR) హీరోగా వి.వి.వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యారు ఫిష్ వెంకట్(Fish Venkat). మొదటి సినిమాతోనే మంచి ప్రజాధారణ పొందిన ఈయన ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సినిమాలలో నటుడిగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా విలన్ గ్రూప్ లో ఒకరిగా నటించిన ఫిష్ వెంకట్.. ఆ విలనిజంలో కూడా కామెడీ చేస్తూ.. తనదైన మార్క్ సృష్టించారు. ఇదిలా ఉండగా గత నెల రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఫిష్ వెంకట్.. నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. ఆయన మరణం అందరినీ ఆశ్చర్యపరిచిన.. అటు నెటిజన్స్.. ఇటు అభిమానులు సినీ పెద్దలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిష్ వెంకట్ విషయంలో సినీ పెద్దలు ఏమైనట్టు?
వాస్తవానికి ఫిష్ వెంకట్ బ్రతకాలి అంటే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలి అని వైద్యులు తెలియజేశారు. ఈ వైద్యానికి కావలసిన ఖర్చు రూ.50 లక్షలు అవుతుందట. అయితే ఫిష్ వెంకట్ దాదాపు 100కు పైగా సినిమాలలో నటించినా ఆర్థికంగా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. దీంతో హాస్పిటల్ ఖర్చులు కూడా చెల్లించలేక ఆయన కుటుంబ సభ్యులు, సినీ పెద్దలు ఎవరైనా స్పందిస్తారా అని ఎదురు చూశారు. ముఖ్యంగా చిరంజీవి(Chiranjeevi ), ప్రభాస్ (Prabhas), నాగార్జున (Nagarjuna), మోహన్ బాబు(Mohan Babu), అల్లు అర్జున్ (Allu Arjun), ఎన్టీఆర్ ఇలా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. వీరందరూ తమను ఆదుకోవాలి అని, తమ తండ్రి వైద్యానికి కావలసిన సహాయం చేయాలి అని ఫిష్ వెంకట్ భార్య, కూతురు మీడియా వేదికగా వేడుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.
ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి.. ఇండస్ట్రీ పెద్దల మనసు కరిగించలేకపోయిందా?
కానీ వీరి కన్నీరు ఒక్కరిని కూడా కరిగించలేదు అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి చాలా మంది సినీ సెలబ్రిటీలు.. ఇండస్ట్రీలో తమ సినిమాల ద్వారా కోట్ల రూపాయలను సంపాదిస్తూ.. అంచలంచెలుగా ఎదుగుతున్నారే కానీ తమ సినిమాలలో ఒక పాత్ర చేసి తమ సినిమా సక్సెస్ లో కూడా భాగమైన ఒక నటుడికి ఎందుకు సహాయం చేయలేకపోయారు అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. సాధారణంగా ఇండస్ట్రీలో ఎవరికైనా నష్టం కష్టం వచ్చింది అంటే చిరంజీవిని మొదలుకొని చాలామంది హీరోలు అండగా నిలబడతారు. కానీ ఫిష్ వెంకట్ విషయంలో వీరంతా ఏమైనట్టు.. గతంలో చిరంజీవి సహాయపడినట్లు వార్తలు వచ్చినా.. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఎవరు ఎందుకు స్పందించలేదు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..
ఇండస్ట్రీ నుంచి వచ్చిన విరాళం ఇంతే – ఫిష్ వెంకట్ కూతురు
ఇకపోతే సినీ ఇండస్ట్రీ నుండి యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) తన వంతుగా 2 లక్షల రూపాయలను ఫిష్ వెంకట్ వైద్యానికి అందించగా.. 100 డ్రీమ్స్ ఫౌండేషన్ అధినేత జెట్టి మూవీ హీరో కృష్ణ మనీనేని రెండు లక్షలు విరాళం అందించారు. మొత్తంగా సినీ ఇండస్ట్రీ నుండి ఫిష్ వెంకట్ కి కేవలం 4 లక్షల రూపాయలు మాత్రమే విరాళం వచ్చింది అని ఫిష్ వెంకట్ కూతురు మీడియాతో వెల్లడించింది. మరి వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్న ఈ హీరోలు ఎందుకు ఫిష్ వెంకట్ విషయంలో స్పందించలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి దీనిపై ఎలాంటి సమాధానం దొరుకుతుందో చూడాలి. ఇకపోతే దీనికి సమాధానం దొరుకుతుందో లేదో కానీ సినీ ఇండస్ట్రీనే ఇప్పుడు ఫిష్ వెంకట్ మరణానికి కారణం అయ్యింది అంటూ నెటిజన్స్ , అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సాయం మాట దేవుడెరుగు.. మృతిపై కూడా స్పందించని పెద్దలు..
ఇకపోతే సహాయం మాట దేవుడెరుగు కానీ.. ఫిష్ వెంకట్ మరణించి దాదాపు పది గంటలకు పైగా సమయం గడుస్తున్నా.. ఇప్పటివరకు ఒక్కరు కూడా స్పందించకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు ఫిష్ వెంకట్ విషయంలో ఎందుకు ఇలా జరుగుతోంది.. ఇండస్ట్రీ పెద్దలు కావాలని ఈయనను పక్కన పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ALSO READ:Kareena Kapoor: వేరే ఆమ్మాయితో ఎఫైర్.. భర్తను చితకబాదిన హీరోయిన్ కరీనా కపూర్!