Kareena Kapoor:బాలీవుడ్ పాపులర్ సెలబ్రిటీ జంటల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కరీనా కపూర్ (Kareena Kapoor), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)లు ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan ) పై కత్తి దాడి జరగడంతో ఒక్కసారిగా కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్ ల వ్యక్తిగత జీవితం తెర మీదకి వచ్చింది. అయితే గుర్తుతెలియని వ్యక్తి సైఫ్ పై దాడి చేశారని కొంతమంది అంటే..లేదు లేదు సైఫ్ అలీ ఖాన్ చేసిన ఓ తప్పు వల్లే ఆయనపై ఈ కత్తి దాడి జరిగిందని కొన్ని బాలీవుడ్ మీడియా ఛానళ్లు ప్రచారం చేశాయి. అయితే తాజాగా ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఆ వీడియో చూసిన చాలా మంది నెటిజన్లు ఇది నిజమేనా అని షాక్ అవుతున్నారు.
ఆమెతో ఎఫైర్.. భర్తని చితకబాదిన కరీనాకపూర్..
ఇక ఆ వీడియోలో ఏముందంటే.. కరీనా కపూర్ (Kareena Kapoor) సైఫ్ అలీ ఖాన్ ని కొట్టిందని.. మరి కట్టుకున్న భర్తని కరీనా కపూర్ ఎందుకు కొట్టింది అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.. కరీనా కపూర్,సైఫ్ అలీ ఖాన్ ని అత్యంత క్రూరంగా కొట్టినట్టు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. కరీనా కపూర్ భర్త సైఫ్ అలీ ఖాన్ పనిమనిషితో ఎఫైర్ పెట్టుకున్నాడనే కోపంతో భర్తని చావగొట్టినట్టు ఓ రూమర్ వైరల్ అవుతుంది. అయితే ఆ రూమర్ వీడియో ఎక్కడిది అంటే ఒక పాకిస్తానీ ఛానల్ నుండి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎక్కువగా రూమర్స్ ప్రచారం చేసే ఈ ఛానల్ నుండి కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లకు సంబంధించిన ఒక వ్యక్తిగత విషయం వైరల్ అవుతుంది. సైఫ్ అలీ ఖాన్ పనిమనిషితో ఎఫైర్ పెట్టుకున్న సమయంలో కరీనాకపూర్ కి దొరికాడని, దాంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి కరీనా చాలా హింసాత్మకంగా సైఫ్ ని కొట్టిందని ఆ షోలో చెప్పారు. ఇక ఆ షోలో చెప్పిన కరీనాకపూర్ సైఫ్ అలీ ఖాన్ లకి సంబంధించిన వ్యక్తిగత విషయం గురించి సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయినప్పటికీ ఈ రూమర్ పై సైఫ్ అలీ ఖాన్ గానీ, కరీనా కపూర్ గానీ స్పందించలేదు.
రూమర్ పై నెటిజన్స్ రియాక్షన్..
దీంతో ఇది ఒక రూమర్ అని సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ సన్నిహితులు కొట్టి పారేశారు. అంతేకాదు పాకిస్తాన్ (Pakistan) లోని ఆ షోలో ఇప్పటి వరకు చాలా గాసిప్ లు చెప్పారని, అందులో ఇది కూడా ఒకటి అంటూ నిర్ధారించారు. అయితే ఈ ఊహగానాలు ట్విట్టర్, వాట్సప్,యూట్యూబ్ లో ఎక్కువగా వైరల్ అవ్వడంతో చాలామంది వీరి అభిమానులు షాక్ అయిపోయారు. కానీ దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేకపోవడంతో ఇదంతా ఫేక్ అని కొట్టి పారేశారు.
కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ ల ప్రేమ, పెళ్లి..
ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా రాణిస్తున్న సైఫ్ అలీ ఖాన్, కరీనాకపూర్ ఇద్దరు ఎప్పుడు కలిసే తిరుగుతూ ఉంటారు. కలిసి తిరుగుతున్న వీరి మధ్య గొడవలు ఉన్నాయంటే నమ్మేలా లేవు. కేవలం అది ఒక పుకారు మాత్రమేనని అర్థమైంది. ఇక కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ ల ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే..సైఫ్ అలీ ఖాన్ కి మొదట అమృత ఖాన్ (Amritha Khan) తో పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారుఆ తర్వాత కరీనాకపూర్ తో ప్రేమలో పడి 2012లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.
దుష్ప్రచారం అంటూ..
అలా ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిపై సోషల్ మీడియాలో ఈ రకమైన దుష్ప్రచారం జరగడం వాళ్ళ అభిమానులని ఇబ్బంది పెడుతోంది. అంతేకాదు ఇది ఫేక్ వార్త అలాగే ఇండియాకి శత్రుదేశం గా ఉన్న పాకిస్తాన్ ఛానల్ నుండి ఈ వార్త వచ్చింది కాబట్టి కచ్చితంగా దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.
ALSO READ:Tollywood: పేరుకే స్టార్ కిడ్స్.. ఫెయిల్యూర్ గా నిలిచిన వారసులు వీరే!