Pawan Kalyan : పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జులై 24న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఎప్పుడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఇన్ని ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం కొంచెం ముందు అడుగు వేశారు.
పవన్ కళ్యాణ్ కెరియర్ లో వస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కాబట్టి దీని మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మీద పెద్దగా బజ్ లేదు అనుకునే టైంలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆన్లైన్లో టికెట్లు కూడా విపరీతంగా సేల్ అవుతున్నాయి.
పవన్ కు తప్పిన పెను ప్రమాదం
నా కమిట్మెంట్ కి ఎక్కువ పిచ్చి ఉంటుంది. నేను తొలిప్రేమ లాంటి ఒక సినిమాను చేస్తున్నప్పుడు. ఒక చిన్న లవ్ స్టోరీ. దానికి ఒక యాక్షన్ సీక్వెన్స్ కూడా కాదు, ఒక కారు యాక్సిడెంట్ అయ్యి లోయలో పడిపోవాలి. అప్పుడు కొంతమంది కార్ లో ఇరుక్కుంటారు. అప్పుడు నేను ఆ కార్ లో నుంచి దిగిపోతే వేరే బాడీ డబుల్ ఎక్కితే. ఆ కార్ లోయలో పడిపోయింది. లక్కీగా అదృష్టవశాత్తు ఎవరికి ఏమి జరగలేదు. అందరూ బయటపడ్డారు. కానీ ఆ కారులో నేను ఉండాల్సింది. నేను ఎక్కి కూడా దిగిపోయాను. అంటూ తొలిప్రేమ టైంలో జరిగిన పెను ప్రమాదాన్ని ఒక ప్రముఖ ఛానల్ కు హరిహర వీరమల్లు ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు పవన్ కళ్యాణ్.
కెరియర్ బ్లాక్ బస్టర్
పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు ఉన్నాయి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. తొలిప్రేమ విషయానికి వస్తే ఆ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం మామూలుది కాదు. ఆ సినిమా వలన దిల్ రాజు ఎంతలా లాభపడ్డారో పలు సందర్భాలలో తెలిపారు. కరుణాకర్ ఆ సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా షూటింగ్లో జరిగిన పెను ప్రమాదాన్ని చాలా తక్కువ చోట్ల కొంతమంది పంచుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే విషయాన్ని పంచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఏదేమైనా పవన్ అభిమానులంతా హరిహర వీరమల్లు సినిమా కోసం క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు.
Also Read: Anasuya Bharadwaj : పుష్ప సినిమా నేను చేసినట్లు వాళ్లకి తెలియదు, అవకాశం ఎలా వచ్చిందంటే ?