BigTV English

Coolie : అమీర్ ఖాన్ రోలెక్స్ ఏం కాదు… పక్కా కమెడియన్

Coolie : అమీర్ ఖాన్ రోలెక్స్ ఏం కాదు… పక్కా కమెడియన్

Coolie : అమీర్ ఖాన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమీర్ ఖాన్ ఒక కథను ఒప్పుకోవాలి అంటే చాలా టైం పడుతుంది. ఒప్పుకున్నారు అంటే అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అని ఒక స్థాయి నమ్మకాన్ని తెచ్చుకున్న హీరో. అలానే వ్యక్తిగతంగా కూడా అతని ఆలోచనలు డిఫరెంట్ గా ఉంటాయి.


అటువంటి వ్యక్తిత్వం ఉన్న అమీర్ ఖాన్ కూలీ సినిమాలో నటిస్తున్నాడు అని అనౌన్స్ చేసినప్పుడు, అందరికీ ఒక రేంజ్ హై వచ్చింది. అలానే అమీర్ ఖాన్ గెటప్ ఈ సినిమాలో అందరికీ ఆశ్చర్యం కలిగించింది. చెన్నైలో భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ కు కూడా అదే గెటప్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ ఇచ్చాడు. ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. తీరా సినిమా చూసిన తర్వాత అందరికీ హాస్య కరంగా అనిపించింది.

ఒప్పుకోవడమే తప్పా 


మామూలుగా ఈ కథను రజినీకాంత్ విన్న తర్వాత, ఒక పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తున్నారు. అని లోకేష్ చెప్పినప్పుడు రజనీకాంత్ ఆశ్చర్యపోయారు. అంత ఈజీగా ఒక కథను అమీర్ ఖాన్ ఒప్పుకోడు. తను ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేయడానికి రెండు సంవత్సరాలు పడుతుంది అని అనుకున్నారట. కానీ వాస్తవం ఏమిటంటే రజనీకాంత్ గారి కూలి సినిమాలో క్యారెక్టర్ ఉంది అంటే ఏ నటుడైన ఆలోచించి ఒక అడుగు ముందుకు వేస్తారు. సరిగ్గా అదే పని చేశాడు అమీర్ ఖాన్.

లోకేష్ దర్శకత్వంలో వచ్చిన విక్రం సినిమాలో సూర్య చివరి ఐదు నిమిషాల్లో వచ్చి సంచలనం సృష్టించాడు. అప్పటివరకు ఒకలా ఉన్న సినిమా అక్కడ నుంచి వేరే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం వచ్చిన కూలి సినిమాలో కూడా అమీర్ ఖాన్ పాత్ర అదే స్థాయిలో ఉంటుంది అని ఆడియన్స్ అంతా థియేటర్లో ఎదురు చూశారు. అమీర్ ఖాన్ పాత్ర విషయానికి వస్తే, చూపించినప్పుడు భారీ ఎలివేషన్ ఇచ్చారు. కానీ రజనీకాంత్ తో మాట్లాడే విధానంలో క్యారెక్టర్ కంప్లీట్ గా మారిపోయింది. ఇది సినిమా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది.

ఖైదీ 2 పై కేరింగ్ 

చాలామంది తెలుగు దర్శకులు వాళ్లకు వస్తున్న రెస్పాన్స్ ఒప్పుకోరు. ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ లోకేష్ కనకరాజు అలా కాదు వస్తున్న రెస్పాండ్ ను రిసీవ్ చేసుకుని తనను తాను కొత్తగా మలుచుకుంటాడు. అందుకే మాస్టర్ సినిమా అనుకున్న సక్సెస్ రాకపోతే విక్రంతో సక్సెస్ అందుకున్నాడు. ఇక లియో సినిమా విషయంలో కూడా సెకండ్ హాఫ్ కంప్లైంట్స్ గురించి తను ఒప్పుకున్నాడు. ఇక ఈ సినిమా రియాక్షన్స్ ను గుర్తుపెట్టుకొని ఖైదీ 2 సినిమాకి మరింత జాగ్రత్త పడతాడు అని అనిపిస్తుంది.

Also Read: Bigg Boss season 9: బిగ్ బాస్ హౌస్ కి ఆ స్టార్ డైరెక్టర్, ఇదేమి ఖర్మ సామీ?

Related News

Hero Darshan: హీరో దర్శన్ కేసు ఎఫెక్ట్… ఆ హీరోయిన్ మళ్లీ అరెస్ట్ !

Aamir Khan: ఓన్లీ 50 రూపాయలే… అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన అమీర్ ఖాన్!

Jr NTR Look: ఎన్టీఆర్ బాలీవుడ్‌ డెబ్యూ అట్టర్ ప్లాప్… బీ టౌన్‌ ఆడియన్స్ రియాక్షన్ ఎంటంటే ?

Coolie : వేయి ఆశలు… ఇప్పుడు కూలీ కూడా కూల్చేసింది

Jr NTR: అందరికీ దూరం… ఒంటరి పోరాటం… నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ మళ్లీ కౌంటర్ ?

Coolie : రజనీకాంత్ సినిమా అన్నారు, కానీ సౌబిన్ హీరో చేసేసారు

Big Stories

×